బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bengaluru Clash: పోలీసు కస్టడీలో ఉంటే ఫేస్ బుక్ పోస్టు షేర్, హౌవ్ ? మాయాబజార్ సినిమా మేలు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరులో అల్లర్లకు కారణమై 100 మందికిపైగా పోలీసులకు గాయాలై ముగ్గురు అల్లరిమూకలు ప్రాణాలు పోవడానికి కారణమైనాడని ఆరోపిస్తూ అరెస్టు అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడు నవీన్ ఫేస్ బుక్ అకౌంట్ నుంచి మరో వివాదాస్పద పోస్టు షేర్ కావడం కలకలం రేపింది, అరెస్టు అయ్యి 30 గంటలకు పైగా పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తి ఫేస్ బుక్ అకౌంట్ నుంచి మరో వివాదాస్పద పోస్టు షేర్ కావడం ఎలా సాధ్యం అవుతుంది ?, హౌవ్ ? ఈ అల్లర్ల వెనుక ఏదైనా కుట్ర ఉందా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇప్పటికే తన మొబైల్ ఫోన్ పోయిందని, ఇంతకు ముందు వివాదాస్పద పోస్టు షేర్ చేసింది తాను కాదని ఎమ్మెల్యే మేనల్లుడు పోలీసులు విచారణలో చెప్పిన సమయంలో అతని ఫేస్ బుక్ అకౌంట్ నుంచి మరో పోస్టు చేర్ కావడంతో మాయాబజార్ సినిమా మేలు అంటూ పోలీసులు షాక్ కు గురౌతున్నారు.

Torture: సినిమా ఆర్టిస్టు స్నానం చేస్తుంటే పోలీసు ఏం చేశాడంటే, మామూలోడుకాదు, ఆంటీలు రివర్స్!Torture: సినిమా ఆర్టిస్టు స్నానం చేస్తుంటే పోలీసు ఏం చేశాడంటే, మామూలోడుకాదు, ఆంటీలు రివర్స్!

బెంగళూరు అల్లకల్లోలం

బెంగళూరు అల్లకల్లోలం

బెంగళూరు సిటీలోని పులకేశీనగర శాసన సభ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి అక్క కుమారుడు నవీన్ అనే యువకుడు ఓ వర్గం దేవుడిని కించపరిచి ఫేస్ బుక్ లో పోస్టు చేశాడని ఆరోపణలు రావడంతో ఓ వర్గం వాళ్లు అర్దరాత్రి రెచ్చిపోయారు. ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి ఇంటికి నిప్పంటించడం, బందోబస్తుకు వెళ్లిన పోలీసులను చితకబాదడం, పోలీసు వాహనాలు, అంబులెన్స్ లు, ప్రజల వాహనాలకు నిప్పంటించి బూడిద చెయ్యడంతో బెంగళూరులోని డీజే హళ్ళి, కేజీ హళ్ళి ప్రాంతాల్లో అల్లకల్లోలం జరిగింది.

30 గంటలు ముందు అరెస్టు

30 గంటలు ముందు అరెస్టు

బెంగళూరులో అల్లర్లకు కారణం అయ్యాడని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి అక్క కొడుకు నవీన్ ను గొడవలు మొదలైన రోజే పోలీసులు అరెస్టు చేసి విచారణ మొదలుపెట్టారు. నవీన్ ప్రస్తుతం బెంగళూరు సిటీ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. నవీన్ అరెస్టు అయ్యి 30 గంటలు అయ్యింది. అయితే అదే నవీన్ ఫేస్ బుక్ అకౌంట్ నుంచి మరో వివాదాస్పద పోస్టు షేర్ కావడం కలకలం రేపింది.

ఎలా సాధ్యం అయ్యింది?

ఎలా సాధ్యం అయ్యింది?

బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత బీళగి ఎమ్మెల్యే మురగేష్ నిరాని గతంలో చేసిన ఓ వాట్సాప్ మెసేజ్ ను ఇప్పుడు నవీన్ ఫేస్ బుక్ అకౌంట్ నుంచి షేర్ చెయ్యడంతో పోలీసులతో పాటు ప్రజలు షాక్ కు గురైనారు. పోలీసు కస్టడీలో ఉన్న నవీన్ ఫేస్ బుక్ అకౌంట్ నుంచి వివాదాస్పద కామెంట్ ల స్క్రీన్ షాట్ లు, పోస్టులు ఎలా షేర్ చేశారు ? అది ఎలా సాధ్యం అయ్యింది ? అనే విషయం అంతు చిక్కడం లేదని స్వయంగా పోలీసులే అంటున్నారు.

బెంగళూరు అల్లర్లకు కుట్ర?

బెంగళూరు అల్లర్లకు కుట్ర?

బెంగళూరు అల్లర్ల వెనుక చాల పెద్ద కుట్రలు జరిగాయని ఇప్పటికే బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాపించనప్పటి నుంచి బెంగళూరులో అల్లర్లు వ్యాపించడానికి ఓ వర్గం కుట్రలు చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే బెంగళూరులోని పాదరాయణపుర, డీజే హళ్ళి, కేజీ హళ్ళి ప్రాంతాల్లో ఇలాంటి గొడవలు జరగడంతో కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. బెంగళూరులో జరుగుతున్న అల్లర్ల వెనుక ఎవరి కుట్ర ఉంది ? అంటూ పోలీసులు కూపీలాగుతున్నారు.

 హోమ్ మంత్రి అనుమానాలు

హోమ్ మంత్రి అనుమానాలు

బెంగళూరు జరిగిన గొడవలకు ఫేస్ బుక్ పోస్టు మాత్రమే కారణమా ?, ఒక్క ఫేస్ బుక్ పోస్టు చేసిన వెంటనే వందల మంది ఒకేసారి గుమికూడి విద్వంసం సృష్టించడానికి, హింసాత్మక సంఘటనలు సృష్టించడానికి అవకాశం ఉందా ?, ఈ పని పక్కాప్లాన్ తో చేశారు అంటూ కర్ణాటక హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ ఇప్పటికే అనుమానం వ్యక్తం చేశారు.

క్రిమినల్స్ స్కెచ్ లు

క్రిమినల్స్ స్కెచ్ లు

గత ఆరు నెలల్లో బెంగళూరులో ఈటైప్ గొడవలు జరగడం ఇది రెండోసారి, ఒక వర్గం వాళ్లే రెండుసార్లు హింసాత్మక సంఘటనలు జరగడానికి కారణం అయ్యారు. బెంగళూరులో ఎలాంటి చిన్న గొడవ జరిగిన జాతీయ స్థాయిలో పెద్ద వార్త అవుతోందని, అందువలనే కొందరు రెచ్చిపోయి సిలికాన్ సిటీకి చెడ్డపేరు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని స్వయంగా కర్ణాటక హోమ్ శాఖా మంత్రి బసవరాజ్ బోమ్మయ్ ఆరోపిస్తున్న సమయంలో పోలీసు కస్టడీలో ఉన్న నవీన్ ఫేస్ బుక్ అకౌంట్ నుంచి మరో వివాదాస్పద పోస్టు షేర్ కావడం కలకలం రేపింది.

English summary
Bengaluru Clash: One More Facebook Post In Bengaluru Accused Naveen Account in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X