బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bengaluru: కోవిడ్ పంజా సీక్రెట్ ఇదే, అపార్ట్ మెంట్స్ లో ఆ మహిళలు చేస్తున్న పనే ?, రహస్యం!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరు నగరంలో రోజురోజు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోవడానికి అపార్ట్ మెంట్లో నివాసం ఉంటున్న కొంత మంది నిర్లక్షమే కారణం అని మంత్రులు మండిపడుతున్నారు. ఐటీ హబ్ లో వందల సంఖ్యలోని అపార్ట్ మెంట్ లలో నివాసం ఉంటున్న వారు సీక్రెట్ గా కోవిడ్ పాజిటివ్ వచ్చిన విషయాలు దాచిపెట్టడం, వారి ఇళ్లలో పని చేస్తున్న మహిళలు మరో పది ఇళ్లలో పని చెయ్యడం, అలాగే లిఫ్ట్ లు పట్టుకుని తిరిగేయడం వలనే కరోనా వైరస్ చాపకిందనీరులా వ్యాపిస్తోందని, వీళ్ల నిర్లక్షం కారణంగా అమాయకుల ప్రజల జీవితాలు నాశనం అవుతున్నాయని మంత్రులు, ప్రభుత్వ అధికారులు ఆరోపిస్తున్నారు.

Recommended Video

COVID : Bengaluru IT Corridor అపార్ట్ మెంట్స్ లో నిర్లక్షం.. పాజిటివ్ వచ్చినా || Oneindia Telugu

బెంగళూరులోని బీబీఎంపీ మహదేవపుర విభాగంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదు కావడం వెనుక అసలు రహస్యం ఇదే అని కర్ణాటక మంత్రులు ఆరోపిస్తున్నారు.

facebook: లవ్+ఎంజాయ్+పిల్లలు= వాట్సాప్ లో మూడుసార్లు విడాకులు, ఆంటీ ఎఫెక్ట్, కేటుగాడు!facebook: లవ్+ఎంజాయ్+పిల్లలు= వాట్సాప్ లో మూడుసార్లు విడాకులు, ఆంటీ ఎఫెక్ట్, కేటుగాడు!

బెంగళూరులో ఈ బెల్డ్ లో రికార్డ్ బ్రేక్

బెంగళూరులో ఈ బెల్డ్ లో రికార్డ్ బ్రేక్

బెంగళూరు నగరంలో గత 10 రోజుల నుంచి జనతా కర్ఫ్యూ అమలలో ఉన్నా కరోనా పాజిటివ్ (COVID-19) కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్ గా గుర్తింపు తెచ్చుకున్న వైల్ ఫీల్డ్ లోని మహదేవపుర జోన్ (BBMP) విభాగంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య వేలల్లో ఉన్నాయి. బెంగళూరులోని 8 జోల్లతో పోల్చుకుంటే మహదేవపురలోనే అధిక సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయని స్వయంగా కర్ణాటక మంత్రులు అంటున్నారు.

అపార్ట్ మెంట్ లో వాళ్లు ఏం చేస్తున్నారంటే ?

అపార్ట్ మెంట్ లో వాళ్లు ఏం చేస్తున్నారంటే ?

కోవిడ్ కేసులు పెరిగిపోవడానికి ఏమిటి కారణాలు అంటూ కర్ణాటక క్యాబినెట్ మంత్రులు అరవింద్ లింబావలి, భైరతి బసవరాజ్, బీబీఎంపీ అడిషనల్ కమీషనర్లు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐటీ కారిడార్ లోని అపార్ట్ మెంట్ వాసుల నిర్లక్షం కారణంగానే బెంగళూరులో కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువగా పెరిగిపోతున్నాయని మంత్రులు, అధికారుల విచారణలో వెలుగు చూసింది.

మొత్తం సీక్రెట్ గా ఉంటుంది

మొత్తం సీక్రెట్ గా ఉంటుంది

అపార్ట్ మెంట్ వాసులు ఎవరైనా అనారోగ్యానికి గురైనా, కోవిడ్ లక్షణాలు ఉన్నా ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని కర్ణాటక అటవి శాఖా మంత్రి అరవింద్ లింబావలి ఆరోపించారు. గుట్టుచప్పుడు కాకుండా వైద్యపరీక్షలు చేయించుకోవడం, కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిసినా అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న సాటి వ్యక్తులకు చెప్పకుండా బయట తిరిగేస్తున్నారని, వాళ్లకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం అదే అపార్ట్ మెంట్లలో నివాసం ఉంటున్న వారికి కూడా తెలీకుండా మూసిపెడుతున్నారని మంత్రి అరవింద్ లింబావలి ఆరోపించారు.

 పని మనుషుల దెబ్బతోనే

పని మనుషుల దెబ్బతోనే

అపార్ట్ మెంట్లలో పని చేస్తున్న పనిమనుషులు (మహిళలు, పురుషులు) మరో అపార్ట్ మెంట్లలోని పలు ఫ్లాట్ లో పని చేస్తున్నారని, కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారి ఇళ్లలోని వస్తువులు, అక్కడి కోవిడ్ పేషంట్లు ఉపయోగిస్తున్న దుస్తులు ముట్టుకోవడం, అక్కడి నుంచి వెళ్లి పదుల సంఖ్యలో ఉన్న అపార్ట్ మెంట్ లలో లిఫ్ట్ లు ముట్టుకోవడం, అలాగే వెళ్లి మరో ఇంటిలో పని చెయ్యడం వలనే కరోనా వ్యాధి వ్యాపిస్తోందని మంత్రి అరవింద్ లింబావలి ఆరోపించారు.

వీళ్ల వల్లే అమాయకులు బలి అవుతున్నారు!

వీళ్ల వల్లే అమాయకులు బలి అవుతున్నారు!

అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న కొందరు నిర్లక్షం కారణంగా కరోనా వైరస్ విచ్చలవిడిగా వ్యాపిస్తుందని మంత్రులు అరవింద్ లింబావలి, భైరతి బసవరాజ్ ఆరోపించారు. అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న కొందరు నిర్లక్షం కారణంగా బెంగళూరుకు చెడ్డపేరు వస్తోంది. వాళ్ల కారణంగానే ఐటీ హబ్ లో అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని మంత్రులు అరవింద్ లింబావలి, భైరతి బసవరాజ్ ఆరోపించడం కలకలం రేపింది. మొత్తం మీద బెంగళూరులో కొన్ని అపార్ట్ మెంట్ ల లో నివాసం ఉంటున్న వారి నిర్లక్షం కారణంగానే ఐటీ హబ్ కు చెడ్డపేరు వస్తోందని ఆరోపణలు ఉన్నాయి.

English summary
Bengaluru: COVID-19 cases spiral in IT corridor, apartment dwellers to blame, say Karnataka Ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X