బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bengaluru clash: మేము సినిమా చూడం, మీకు చూపిస్తాం, సీఎం వార్నింగ్, పోలీసులకు ఫుల్ పవర్స్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ న్యూఢిల్లీ: ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని బెంగళూరులో అర్దరాత్రి అల్లకల్లోలానికి దారి తీసిన అల్లరిమూకలు ఎవరైనా సరే వారిని విడిచిపెట్టమని, ఇలాంటి హింస చెలరేగుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకొదని, తప్పు చేసిన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టమని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప హెచ్చరించారు. డీజే హళ్లి, కేజీ హళ్ళి పోలీసులపై దాడి చేసిన వారిని, పోలీసు వాహనాలు ధ్వంసం చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, మీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నామని కర్ణాటక హోమ్ శాఖ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ బెంగళూరు పోలీసు అధికారులకు చెప్పారు. బెంగళూరులో అల్లర్లకు కారణం అయిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి తాను ఏ విచారణకైనా సిద్దంగా ఉన్నానని, ప్రజలు శాంతియుతంగా ఉండాలని అంటున్నారు. ఇప్పటికే అల్లర్లకు కారణం అయిన ఫేస్ బుక్ లో వివాదాస్పద పోస్టు చేసిన ఎమ్మెల్యే మేనల్లుడు నవీన్ ను పోలీసులు అరెస్టు చేశారు.

lockdown: కింద మొగుడు, పైన ప్రియుడు, హైటెక్ వ్యభిచారం కోసం సీక్రెట్ రూమ్, సినిమా స్కెచ్, రివర్స్!lockdown: కింద మొగుడు, పైన ప్రియుడు, హైటెక్ వ్యభిచారం కోసం సీక్రెట్ రూమ్, సినిమా స్కెచ్, రివర్స్!

 సీఎం, హోమ్ మంత్రి సీరియస్

సీఎం, హోమ్ మంత్రి సీరియస్

బెంగళూరులోని కేజీ హళ్లి, డీజేపీ హళ్ళి ప్రాంతాలు అసలే సున్నితమైన ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో అర్దరాత్రి దాటిన తరువాత అల్లరిమూకలు రెచ్చిపోవడం, 100 మందికి పైగా పోలీసులకు గాయాలు కావడంతో, పోలీసుల కాల్పుల్లో ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోవడం చకచకా జరిగిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప, హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ వెంటనే బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ కమల్ పంత్ తో పాటు అన్ని సీనియర్ పోలీసు అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

ఎవరైనా ఇలా చేస్తారా ?

ఎవరైనా ఇలా చేస్తారా ?

పోలీసు అధికారుల సమావేశంలో సీఎం బీఎస్. యడియూరప్ప అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి ఇంటికి నిప్పంటించి ద్వంసం చెయ్యడం, పోలీసులపై దాడి చేసి ప్రభుత్వ వాహనాలను ద్వంసం చెయ్యడాన్ని సీఎం బీఎస్. యడియూరప్ప, హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ తీవ్రస్థాయిలో ఖండించారు. ఎవరైనా చట్టాన్ని ఇలా చేతుల్లోకి తీసుకుని ప్రవర్తిస్తారా ? అసలు వాళ్లు ఏమనుకుంటున్నారు ? అని సీఎం బీఎస్. యడియూరప్ప మండిపడ్డారని సమాచారం.

 సినిమా చూస్తామా? మీమ్మల్ని వదలం: సీఎం వార్నింగ్

సినిమా చూస్తామా? మీమ్మల్ని వదలం: సీఎం వార్నింగ్


అర్దరాత్రి మీరు సినిమా స్టైల్లో అల్లర్లు సృష్టిస్తే మేము సినిమా చూసినట్లు చూసి సైలెంట్ గా ఉండిపోతాం అనుకుంటున్నారా ? తప్పు చేసినవాళ్లు ఎవరైనా సరే, వదిలిపెట్టం, చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని సీఎం బీఎస్. యడియూరప్ప అల్లరిమూకలను హెచ్చరించారు. ఇదే సమయంలో ప్రజలు వదంతులు నమ్మి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని సీఎం బీఎస్. యడీయూరప్ప స్థానిక ప్రజలకు మనవి చేశారు.

పోలీసులకు ఫుల్ పవర్స్

పోలీసులకు ఫుల్ పవర్స్


బెంగళూరులోని కావేరీలో సీఎం బీఎస్. యడియూర్ప, హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ తో జరిగిన సమావేశంలో కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్, బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ కమల్ పంత్ తో పాటు సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఇలాంటి హింసను ప్రభుత్వం ప్రోత్సహించదని, సమగ్ర విచారణ జరిపి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మీకు పూర్తి అధికారాలు ఇస్తున్నామని సీఎం బీఎస్. యడియూరప్ప, హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ పోలీసు అధికారులకు చెప్పారని తెలిసింది.

Recommended Video

Bengaluru : 60 మంది పోలీసులకి గాయాలు.. ప్రజలు శాంతియుతంగా ఉండాలని పిలుపు!! || Oneindia Telugu
చిక్కాడు కదా, ఏం చెప్పాడు ?

చిక్కాడు కదా, ఏం చెప్పాడు ?

ఇదే సమయంలో ప్రజలను శాంతియుతంగా ఉండటానికి పోలీసులు చర్యలు తీసుకోవాలసి సీఎం బీఎస్. యడియూరప్ప సూచించారని సమాచారం. ఫేస్ బుక్ లో వివాదాస్పద పోస్టు చేసి అల్లర్లకు కారణం అయిన నవీన్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. బెంగళూరులో గొడవలకు కారణం అయిన నవీన్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి రక్తసంబధికుడు కావడంతో అటు ఎమ్మెల్యే అనుచరుల మీద పోలీసులు నిఘా వేశారు.

 కేంద్ర మంత్రి షాక్

కేంద్ర మంత్రి షాక్

బెంగళూరులోని సున్నితమైన ప్రాంతాలైన డీజే హళ్ళి, కేజీ హళ్ళి ప్రాంతాల్లో అర్దరాత్రి కొందరు అల్లరిమూకలు రెచ్చిపోవడం వలన సామన్య ప్రజలు భయంతో బతుకుతున్నారని, అసలే కరోనా వైరస్ తాండవం చేస్తున్న సమయంలో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని కేంద్ర మంత్రి డీవీ. సదానందగౌడ విచారం వ్యక్తం చేశారు. బెంగళూరులో అల్లర్లకు కారణం అయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక సీనియర్ మంత్రి సీటీ. రవి ప్రభుత్వానికి మనవి చేశారు.

English summary
Bengaluru: DJ Halli and KG Halli Clash, Karnataka CM BS Yediyurappa said he has instructed the officers to take strict action against culprits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X