బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

BJP VS Congress: గ్రామ పంచాయితీ ఎన్నికలు, నువ్వా ?, నేనా ?, 1, 17, 383 మంది పోటీ, దేవుడా?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ మైసూరు/ బళ్లారి: కర్ణాటకలో లోకల్ వార్ (స్థానిక సంస్థల ఎన్నికలు) మొదలైనాయి. కర్ణాటకలో మంగళవారం ఉదయం ప్రశాంతంగా గ్రామ పంచాయితీ ఎన్నికల పోలింగ్ మొదలైయ్యింది. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని కర్ణాటకలో అధికారంలో ఉన్న BJP, ప్రధాన ప్రతిపక్షం అయిన Congress పార్టీతో పాటు JDS, స్వతంత్ర పార్టీ అభ్యర్థులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు అనేక జాగ్రత్తలు తీసుకుని ఓటర్లు అన్ని జాగ్రత్తలతో ఓటు వెయ్యడానికి చర్యలు తీసుకుంటున్నారు. పోటీలో 1, 17, 383 మంది నిలబడటంతో ఎన్నికల పోలింగ్ ఉత్కంఠగా జరుగుతోంది.

Sadist: పెళ్లి కొడుక్కి బెంజ్ కారు, 5 కేజీ బంగారు, ఫస్ట్ నైట్ భరత్ రెడ్డి ఏం చేశాడంటే ? శోభనం చెట్టెక్కింది, కథ !Sadist: పెళ్లి కొడుక్కి బెంజ్ కారు, 5 కేజీ బంగారు, ఫస్ట్ నైట్ భరత్ రెడ్డి ఏం చేశాడంటే ? శోభనం చెట్టెక్కింది, కథ !

ఒకటో సారి షురూ

ఒకటో సారి షురూ

కర్ణాటకలో రెండు విడతల్లో 5, 716 గ్రామ పంచాయితీల ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 22వ తేదీ మంగళవారం ఉదయం ప్రారంభం అయ్యింది. డిసెంబర్ 27వ తేదీన రెండో విడత గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల అధికారులు ఇప్పటికే సర్వం సిద్దం చేశారు. డిసెంబర్ 30వ తేదీన ఎన్నికల ఫలితాలు వెళ్లడించనున్నారు.

నువ్వా ? నేనా ..తేల్చుకుందాం

నువ్వా ? నేనా ..తేల్చుకుందాం

కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది. కర్ణాటకలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ కూడా గ్రామ పంచాయితీ ఎన్నికల్లో తన సత్తా చూపించుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తోంది. అధికారంలో ఉన్న బీజేపీ సైతం అధిక స్థానాల్లో విజయం సాధించాలని ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను రంగంలోకి దింపింది. ఇక జేడీఎస్ పార్టీ కూడా గ్రామ పంచాయితీ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తోంది.

బరిలో 1, 17, 383 మంది.... దేవుడా !

బరిలో 1, 17, 383 మంది.... దేవుడా !

*. కర్ణాటకలో మొత్తం రెండు విడతల్లో 5, 716 గ్రామ పంచాయితీ ఎన్నికలు జరుగుతున్నాయి.

*. మంగళవారం మొదటి విడతలో 3, 019 గ్రామ పంచాయితీ ఎన్నికల పోలింగ్ మొదలైయ్యింది.

*. మొదటి విడత పోలింగ్ సందర్బంగా 23, 625 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

*. మొదటి విడత ఎన్నికల పోలింగ్ సందర్బంగా 1, 41, 750 మంది ఎన్నికల అధికారులు, పోలింగ్ సిబ్బందిని నియమించారు

*. మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికల్లో మొత్తం 1, 17, 383 మంది పోటీలో నిలిచారు.

*. మొదటి విడత పోలింగ్ సందర్బంగా 1, 53, 84, 509 మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

*. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో 432 గ్రామ పంచాయితీలకు ఇప్పటి వరకు ఎవ్వరూ నామినేషన్లు వెయ్యకపోవడంతో అక్క ఎన్నికలు జరగడం లేదు.

ఎన్నికలు లేకుండానే 4, 377 మంది విజయం

ఎన్నికలు లేకుండానే 4, 377 మంది విజయం

మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికల్లో 117 తాలుకాల్లోని 3, 019 గ్రామ పంచాయితీల్లో 48, 048 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీదర్ జిల్లాలో మాత్రం ఇవీఎంలు ఉపయోగిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. మంగళవారం 43, 238 వార్డుల్లో పోలింగ్ ప్రశాంతంగా మొదలైయ్యింది. అయితే 4, 377 వార్డుల్లో స్థానిక అభ్యర్థులు ఎలాంటి ఎన్నికలు జరగకుండానే, పోటీ లేకుండా ఇనామినేషన్ పద్దతిలో విజయం సాధించడంతో ఆ నాయకులు, వారి అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు.

English summary
Bengaluru: Karnataka Gram Panchayat Election 2020 Phase 1 Voting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X