బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bengaluru riots: మేక తల రూ. 500, ఎమ్మెల్యే మేనల్లుడి తల నరికితే రూ. 51 లక్షలు, బంపర్ ఆఫర్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ మీరట్/ ఉత్తరప్రదేశ్: బెంగళూరులో అల్లర్లు జరగడానికి, హింస చెలరేగడానికి కారణం అయ్యాడని, ఎమ్మెల్యే మేనల్లుడి తల నరికి తెస్తే రూ. 51 లక్షల బహుమానంగా ఇస్తానని ఓ మత పెద్ద, నాయకుడు బహిరంగంగా బంపర్ ఆఫర్ ఇచ్చాడు. పోలేరమ్మ గుడి దగ్గర మేక తల రూ. 500, పోటేలు తల రూ. 700 అంటూ ఎలా బహిరంగంగా వేలం వేస్తారో అలాగే బెంగళూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడి తలను ఓ నాయకుడు ఏకంగా రూ. 51 లక్షలకు వేలానికి పెట్టాడు. ఎమ్మెల్యే మేనల్లుడి తల నరికి నా ముందుకు ఎవరు తీసుకు వస్తారో వాళ్లకు అక్షరాలా రూ. 51 లక్షలు ఇస్తానని ఆ నాయకుడు బంపర్ ఆఫర్ ఇస్తున్న వీడియో బయటకు రావడంతో దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

lockdown: కింద మొగుడు, పైన ప్రియుడు, హైటెక్ వ్యభిచారం కోసం సీక్రెట్ రూమ్, సినిమా స్కెచ్, రివర్స్!lockdown: కింద మొగుడు, పైన ప్రియుడు, హైటెక్ వ్యభిచారం కోసం సీక్రెట్ రూమ్, సినిమా స్కెచ్, రివర్స్!

వాడొక్కడే మొగోడా...... తలనరికితే రూ. 51 లక్షలు ఇస్తా

వాడొక్కడే మొగోడా...... తలనరికితే రూ. 51 లక్షలు ఇస్తా

బెంగళూరు సిటీలో గత మంగళవారం రాత్రి అల్లర్లకు కారణం అయ్యాడని ఆరోపిస్తూ పులకేశీనగర నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్ ను అరెస్టు చేశామని బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ కమల్ పంత్ ప్రకటించారు. ఎమ్మేల్లే మేనల్లుడు నవీన్ ఒక్కడే మొగోడా ? వాడి తల నరికి తీసుకువచ్చి నాకు ఇవ్వండి, నవీన్ తల తెచ్చిన వాళ్లకు అక్షరాల రూ. 51 లక్షలు బహుమానంగా ఇస్తానని ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కు చెందిన ముస్లీం మతపెద్ద, ప్రముఖ వ్యాపారి షహజీబ్ రిజ్వి వివాదాదస్పద వ్యాఖ్యలు చేశాడు.

ఫోస్ బుక్ పోస్టు తెచ్చిన తంటా

ఫోస్ బుక్ పోస్టు తెచ్చిన తంటా


కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్ ఓ వర్గం దేవుడిని కించపరిచి ఫేస్ బుక్ లో పోస్టు చేసి ఆ పోస్టును షేర్ చేశాడని ఆరోపిస్తూ గత మంగళవారం రాత్రి ఓ వర్గం వాళ్లు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి ఇంటితో పాటు కనపడిన వాహనాలు, అంబులెన్స్ లు, బైక్ లు, కార్లు, పోలీసు జీపులపై పెట్రోల్ బాంబులు వేసి కాల్చి బూడిద చేశారు. బెంగళూరులో హింసను అరికట్టడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో అల్లర్లకు పాల్పడిన వారిలో ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

మేక తల అనుకున్నాడా ?

మేక తల అనుకున్నాడా ?

మామూలుగా పోలేరమ్మ, గంగమ్మ గుడి దగ్గర బలి ఇచ్చిన మేకపోతులు, గోర్రెల తలలను వేలం వేస్తుంటారు. మేక తల రూ. 500, పోటేలు తల రూ. 600, బన్నూరు పోటేలు తల రూ. 700 ఇలా వేలం వేస్తుంటారు. అయితే ఉత్తరప్రదేశ్ లోని మీటర్ కు చెందిన మత పెద్ద, వ్యాపారి షహజీబ్ రిజ్వి మాత్రం బెంగళూరు సిటీ పోలీసులు అరెస్టు చేసిన ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్ తలను బహిరంగంగా వేలం వేశాడు. నవీన్ తల నరికి తెచ్చి నా ముందు పెట్టండి, మీకు రూ. 51 లక్షలు బహుమానంగా ఇస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చాడు.

లీడర్ రెచ్చగొట్టిన వీడియో వైరల్

లీడర్ రెచ్చగొట్టిన వీడియో వైరల్

ఎమ్మెల్యే మేనల్లుడు నవీన్ తల తెస్తే మీకు రూ. 51 లక్షలు బహుమానంగా ఇస్తానని షహజీబ్ రిజ్వి చెబుతున్న వీడియో విడుదల కావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నవీన్ ఫేస్ బుక్ లో మన దేవుడిని కించపరిచి పోస్టు చేశాడని, ముగ్గురు అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణం అయ్యాడని, అతని తల నరికి తనకు తెచ్చివ్వాలని షహజీబ్ రిజ్వి ఆవేశంగా చెబుతున్న వీడియో బయటకు రావడంతో కలకలం రేపింది.

Recommended Video

Bengaluru : 60 మంది పోలీసులకి గాయాలు.. ప్రజలు శాంతియుతంగా ఉండాలని పిలుపు!! || Oneindia Telugu
 అరెస్టు చేస్తే సరిపోతుందా ?

అరెస్టు చేస్తే సరిపోతుందా ?

నవీన్ చేసిన ఫేస్ బుక్ పోస్టు కారణంగా బెంగళూరులో అల్లర్లు జరిగాయని, ఇప్పటికే ఆ నగరంలో 144 సెక్షన్ అమలులో ఉందని, అలాంటి వ్యక్తి వలన దేశానికి ఏం ఉపయోగం లేదని మీరట్ వ్యాపారి షహజీబ్ రిజ్వి ఆరోపిస్తున్నాడు. నవీన్ తల నరికి తస్తే రూ. 51 లక్షలు ఇస్తానని బహిరంగంగా ప్రకటించిన షహజీబ్ రిజ్విని అరెస్టు చెయ్యాలని, అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని అనేక మంది డిమాండ్ చేస్తున్నారు. ప్రజలను రెచ్చగొట్టి మేకలు, గోర్రల తలలు వేలం వేసినట్లు ఓ యువకుడి తలకు వెల కట్టాడని, అతన్ని శిక్షించడానికి కోర్టులు, చట్టాలు ఉన్నాయనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని, వెంటనే రిజ్విని అరెస్టు చెయ్యాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

English summary
Bengaluru riots: A Muslim leader from Uttar Pradesh’s Meerut has announced a bounty of Rs 51 lakh on the head of Naveen, the nephew of Karnataka Congress MLA R Akhanda Srinivasmurthy for his Facebook post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X