బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bengaluru riots: పొలిటికల్ వార్, జేడీఎస్ టాప్ లీడర్ అరెస్టు, 310 నాటౌట్, టిప్పు టైగర్ వికెట్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ మంగళూరు/ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కలకలం రేపిన బెంగళూరు అల్లర్లు, హింసాచార సంఘటనల కేసులో పోలిటికల్ లీడర్స్ అరెస్టులు పెద్ద దూమరం రేపుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ లేడీ కార్పోరేటర్ భర్తను అరెస్టు చేసిన బెంగళూరు సీసీబీ పోలీసులు తాజాగా జేడీఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, టిప్పు టైగర్ ట్రస్టు చీఫ్ ను అరెస్టు చెయ్యడంతో రాజకీయ పార్టీ నాయకులు ఉలిక్కిపడ్డారు. ప్రతినిత్యం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మీద అరోపణలు చేస్తూ వచ్చిన జేడీఎస్ లీడర్ తాజాగా నవీన్ అరెస్టు చెయ్యాలని కేసు నమోదు చేసిన వారి లిస్టులో ఆయన పేరు ఉందని పోలీసు అధికారులు అంటున్నారు. బెంగళూరు అలర్లకు సంబంధించి ఇప్పటి వరకు 52 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసిన పోలీసు అధికారులు మొత్తం 310 మందిని అరెస్టు చేశారు. అరెస్టుల సంఖ్యల ఇంకా పెరిగే అవకాశం ఉందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

Criminal wife: భర్తకు బెడ్ రూమ్ స్కెచ్, హత్యకు రూ. లక్షలు డీల్, కెమెరామెన్ గణేష్ తో గాయిత్రి, ష్!Criminal wife: భర్తకు బెడ్ రూమ్ స్కెచ్, హత్యకు రూ. లక్షలు డీల్, కెమెరామెన్ గణేష్ తో గాయిత్రి, ష్!

ఎమ్మెల్యేతో పొలిటికల్ వార్

ఎమ్మెల్యేతో పొలిటికల్ వార్

బెంగళూరు సిటీలోని పులకేశీనగర్ శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తికి రాజకీయంగా చాల మంది ప్రత్యర్థులు ఉన్నారు. పులకేశీనగర్ నియోజకవర్గం జేడీఎస్ పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ వాజీద్ పాషా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తికి రాజకీయ ప్రత్యర్థి. చాన్స్ చిక్కిప్పుడు ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి మీద అబ్దుల్ వాజీద్ పాషా విమర్శలు చేస్తూనే ఉన్నాడు.

 టిప్పు టైగర్ చీఫ్

టిప్పు టైగర్ చీఫ్

పులకేశీనగర నియోజక వర్గం జేడీస్ పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ వాజిద్ పాషా టిప్పు టైగర్ అల్ఫాత్ ట్రస్టు అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. తమ దేవుడిని కించరిచి ఫేస్ బుక్ లో అభ్యంతరకరంగా పోస్టు చేశాడని ఆరోపిస్తూ గత మంగళవారం రాత్రి డీజే హళ్ళి, కేజీ హళ్ళి ప్రాంతంలో ఓ వర్గం వారు అల్లర్లకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఫేస్ బుక్ లో పోస్టు చేసింది ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్ అంటూ అల్లరిమూకలు రెచ్చిపోయారు.

పోలీసులకే సవాల్

పోలీసులకే సవాల్

ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి ఇంటితో పాటు వందలాది ప్రైవేటు, పోలీసు వాహనాలు, బీమ్స్ ఆసుపత్రి ముందు పార్క్ చేసిన అంబులెన్స్ లకు అల్లరిమూకలు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. నవీన్ ను వెంటనే అరెస్టు చెయ్యాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో జేడీఎస్ లీడర్ అబ్దుల్ వాజీద్ పాషా ఉన్నారు. నవీన్ ను అరెస్టు చెయ్యడానికి రెండు గంటలు సమయం కావాలని పోలీసులు మనవి చేసిన సమయంలో లేదు వెంటనే నవీన్ ను అరెస్టు చెయ్యాలని, ఆ దమ్ము మీకుందా ? లేదా ? అంటూ రెచ్చిపోయిన వారిలో అబ్దుల్ వాజీద్ ముందు వరుసలో ఉన్నాడని పోలీసులు అంటున్నారు.

పొలిటికల్ లీడర్ పై రివర్స్ కేసు, అర్దరాత్రి !

పొలిటికల్ లీడర్ పై రివర్స్ కేసు, అర్దరాత్రి !


ఇటీవల జేడీఎస్ పార్టీ నాయకుడు అబ్దుల్ వాజీద్ పాషా ఆయన ఫేస్ బుక్ లో పులకేశీనగర ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి కనపడం లేదు అంటూ వివాదాస్పద పోస్టు చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి అనుచరులు జేడీఎస్ పార్టీ నేత అబ్దుల్ వాజీద్ పాషా మీద ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు అయ్యింది. జేడీఎస్ పార్టీ లీడర్ అబ్దుల్ వాజీద్ పాషాను ఆదివారం రాత్రి అరెస్టు చేశామని బెంగళూరు పోలీసు అధికారులు స్పష్టం చేశారు.

 బెంగళూరు 310 నాటౌట్

బెంగళూరు 310 నాటౌట్


బెంగళూరు సిటీలోని డీజే హళ్ళి, కేజీ హళ్ళి, కావల్ భైరసంద్ర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లకు సంబంధించి పోలీసు అధికారులు ఇప్పటి వరకు 52 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ లేడీ కార్పోరేటర్ భర్త, జేడీఎస్ లీడర్ అబ్దుల్ వాజీద్ పాషాతో సహ మొత్తం 310 మందిని అరెస్టు చేశారు. అయితే ఈ అల్లర్ల కేసులకు సంబంధించి ఇంకా కొందరు అరెస్టు అయ్యే అవకాశం ఉందని, ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.

 నేటితో నవీన్ కస్టడీ పూర్తి

నేటితో నవీన్ కస్టడీ పూర్తి

ఓ వర్గం దేవుడిని కించపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్ ఫోస్ బుక్ లో పోస్టు చేసి దానిని అనేక మందికి షేర్ చేశాడని ఆరోపిస్తూ ఇప్పటికే నమోదైన కేసులో అతన్ని అరెస్టు చేశారు. సోమవారంతో నవీన్ పోలీసు కస్టడీ గడువు పూర్తి అవుతోంది. సోమవారం నవీన్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరుస్తామని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Bengaluru riots: Bengaluru police arrested Abdul Wajeed Pasha KM in connection with the Bengaluru violence case. Pasha JD(S) president of Pulikeshi Nagar assembly seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X