బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరులో హింసాత్మక పరిస్థితులపై భగ్గుమంటోన్న పార్టీల నేతలు: అల్లరిమూకను వదలొద్దంటూ

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఉద్యాన నగరి బెంగళూరులో చోటు చేసుకున్న అల్లర్లు, హింసాత్మక పరిస్థితులపై రాజకీయాలకు అతీతంగా స్పందనలు వ్యక్తమౌతున్నాయి. దాడులు, హింసాత్మక సంఘటలను ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ప్రోత్సహించదని, వాటికి సానుకూలంగా వ్యాఖ్యానించబోదని వివిధ పార్టీల నేతలు స్పష్టం చేస్తున్నారు. అల్లర్లకు కారణమైన వారిని, దాడులకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని చెబుతున్నారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ నేతలు ఈ దాడుల పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అల్లరి మూకపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ముగ్గురి మరణానికి దారి తీసిన బెంగళూరు అల్లర్లు: నిందితుడి అరెస్ట్: ఫేస్‌బుక్ పోస్ట్: ఎవరంటే?ముగ్గురి మరణానికి దారి తీసిన బెంగళూరు అల్లర్లు: నిందితుడి అరెస్ట్: ఫేస్‌బుక్ పోస్ట్: ఎవరంటే?

కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస మూర్తి నివాసంపై దాడులకు పాల్పడిన అల్లరి మూకలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదల వద్దని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఎలాంటి హింసాత్మక పరిస్థితులకు తావు లేదని అన్నారు. ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోకూడని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం తగదని చెప్పారు. పోలీస్‌స్టేషన్‌పై దాడి చేయడం, విధి నిర్వహణలో పోలీసులపై ప్రాణాంతక దాడులకు పాల్పడటం సరికాదని అన్నారు. వారిని కఠినంగా శిక్షించాలని డీకే శివకుమార్ డిమాండ్ చేశారు.

Recommended Video

Bengaluru : 60 మంది పోలీసులకి గాయాలు.. ప్రజలు శాంతియుతంగా ఉండాలని పిలుపు!! || Oneindia Telugu
Bengaluru violence: Karnataka PCC President DK Shivakumar and BJP MP GVL condemn

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఈ ఘటనపై స్పందించారు. పోలీసులపై ప్రాణాంతక దాడులకు పాల్పడటం హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై రాళ్ల దాడులకు పాల్పడటం ఆటవిక సంస్కృతిని తలపిస్తోందని మండిపడ్డారు. డీజే హళ్లి, కేజీ హళ్లి పోలీస్ స్టేషన్లపై దాడులు చేయడం, పోలీసు వాహనాలకు తగులబెట్టడం అప్రజాస్వామికమని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిలో ఏ ఒక్కర్నీ వదలకూడదని డిమాండ్ చేశారు. దాడులకు పాల్పిడిన వారిపై కఠిన చర్యలను తీసుకోవాలని అన్నారు.

English summary
Bharatiya Janata Party Senior leader and Rajya Sabha member GVL Narasimha Rao say that we strongly condemn murderous assault on the police by violent mobs that attacked KG Halli and DJ Halli police stations last night injuring 60 police officials and vandalizing police stations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X