ప్రియుడు లండన్‌లో: ఆన్లైన్లో బిగ్‌బాస్ బ్యూటీ ఎంగేజ్మెంట్: ఫ్యాన్స్ బేజార్
బెంగళూరు: కన్నడ బిగ్‌బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ వైజయంతి వాసుదేవ్ అడిగ త్వరలో ఒకింటివారు కాబోతోన్నారు. ఆన్లైన్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వైజయంతి తన ప్రియుడిని పెళ్లాడనున్నారు. ఆయన పేరు సూరజ్. చాలాకాలంగా వైజయంతి వాసుదేవ్-సూరజ్ ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమకు రెండు కుటుంబాల తరఫున పెద్దలు అంగీకరించారు. త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోన్నారు. సూరజ్‌తో తన ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అదరగొడుతోన్న సుదీప్
కన్నడ బిగ్‌బాస్ రియాలిటీ షో కార్యక్రమానికి శాండిల్‌వుడ్ సూపర్ స్టార్ సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్నారు. అన్ని సీజన్లకూ ఆయనే హోస్ట్‌గా ఉంటూ వస్తోన్నారు. బిగ్‌బాస్ సీజన్ ఆరంభం నుంచీ అదరగొడుతున్నారు ఈ ఈగ ఫేమ్ విలన్. తనదైన హీరోయిజానికి హాస్యాన్ని జోడించి అద్బుతంగా సత్తా చాటుతున్నారు. ఎక్కడా బోర్ కొట్టనివ్వని హోస్టింగ్ సుదీప్ సొంతం. తెలుగులో అయిదు సీజన్లకే ముగ్గురు హోస్టులు ఛేంజ్ అయ్యారు. కన్నడలో మాత్రం సుదీప్ మొదటి నుంచీ స్టైలిష్‌గా దాన్ని నడిపిస్తున్నాడు.

వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ..
సీజన్ 8లో వైజయంతి వాసుదేవ్ అడిగ.. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ అయ్యారు. ప్రియాంక తిమ్మేశ్, వైజయంతి వాసుదేవ్ ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. మొదట్లో వైజయంతి మీద ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ పొందడంతో చివరి వరకూ ఆమె నిలుస్తారని అభిమానులు భావించారు. ఆమె మీద ఆశలు పెట్టుకున్నారు. దానికి భిన్నమైన ఫలితం కనిపించింది. వాస్తవ పరిస్థితులు డిఫరెంట్‌గా కనిపించాయి.

ఎక్కువ రోజులు కొనసాగలేక..
ఆమె వైజయంతి ఎక్కువ రోజులు బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగలేకపోయారు. బిగ్‌బాస్ హౌస్ వాతావరణానికి ఆమె ఏ మాత్రం కూడా అలవాటు పడలేకపోయారు. కెమెరా ముందు తాను నటించలేకపోతున్నానని, అలాగని- సహజంగా ఉండలేకపోతున్నానని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వైజయంతి విజ్ఞప్తి మేరకు బిగ్‌బాస్ ఆమెను వలంటీర్‌గా బయటికి పంపించేశారు. బిగ్‌బాస్ ఫైనల్ ఎపిసోడ్, విన్నర్‌ను ప్రకటించే కార్యక్రమానికి కూడా వైజయంతి అటెండ్ కాలేదు.

బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో నో ఫ్రెండ్షిప్..
బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అందరూ వచ్చినా.. ఆమె మాత్రం డుమ్మా కొట్టారు. బిగ్‌బాస్ కంటెస్టెంట్లు ఎవరితో కూడా ఆమె కలివిడిగా లేరనేది ఇక్కడ స్పష్టమౌతోంది. హౌస్మేట్స్ ఎవరితోనూ ఆమెకు పెద్దగా స్నేహం లేదని కన్నడ మీడియా చెబుతోంది. అందుకే ఈ ఎపిసోడ్‌కు రాలేదని అభిప్రాయపడుతోంది. వైజయంతి వాసుదేవ్.. రిజర్వ్‌గా ఉండే మనస్తత్వం అని, బిగ్‌బాస్ వంటి రియాలిటీ షోస్‌కు ఆమె సెట్ కారని అంటోంది మీడియా.

ఇన్‌స్టాలోనూ
ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన ఆస్క్ మీ ఎనీథింగ్- క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సందర్భంగా కూడా అభిమానులు బిగ్‌బాస్ హౌస్‌కు సంబంధించిన విషయాల గురించి ప్రశ్నించగా.. వాటికి సమాధానం ఇవ్వలేదు. ఆ ఒక్కటీ అడక్కండి అంటూ సమాధానం ఇచ్చారు. ఎలిమినేట్ కావడానికి ముందే బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎందుకు బయటికి వచ్చారంటూ అభిమానులు సంధించిన ప్రశ్నలకు ఆమె తన సమాధానాన్ని దాటవేశారు.

విన్నర్‌గా..
బిగ్‌బాస్ కన్నడ సీజన్ 8లో మంజు పావగడ విన్నర్‌గా నిలిచాడు. టెలివిజన్ షో మజా భారతతో అతను పాపులర్ అయ్యాడు. పలు టీవీ సీరియళ్లలో నటించాడు. ఫైనలిస్ట్‌గా నిలిచిన అరవింద్ కేపీ, దివ్య ఉరుడుగ, ప్రశాంత్ సంబర్గి, వైష్ణవీ గౌడతో పోటీ పడి అతను బిగ్‌బాస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రైజ్ మనీని సొంతం చేసుకుననాడు. అరవింద్ కేపీ, మంజు పావగడ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరికి అరవింద్ కేపీ రన్నరప్‌గా నిలిచాడు.