CBI Shock: తెల్లవారక ముందే మాజీ మంత్రికి సినిమా, బీజేపీ లీడర్ హత్య కేసు, కేంద్ర మంత్రి, మాజీ సీఎం!
బెంగళూరు/ హుబ్బళి/ ధారవాడ: బీజేపీ నాయకుడి దారుణ హత్య కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. జిల్లాపంచాయితీ సభ్యుడిని కిరాతకంగా హత్య చేయించిన కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రిపై పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి సోదరుడిని విచారణ చేసిన సీబీఐ అధికారులు అతను ఇచ్చిన సమాచారం మేరకు మాజీ మంత్రిని అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర మంత్రి, మాజీ సీఎం పదేపదే కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి బీజేపీ నాయుడిని హత్య చేయించాడని ఆరోపణలు చేస్తున్న సమయంలోనే సీబీఐ అధికారులు తెల్లవారక ముందే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
Illegal affair: ఆంటీ నర్సు, 108 డ్రైవర్, మంచమేసి దుప్పటేసి మల్లెపూలు, అంబులెన్స్ ఏసీ ఆన్!

బీజేపీ లీడర్ దారుణ హత్య
కర్ణాటకలోని ధారవాడ జిల్లా పంచాయితీ సభ్యుడు యోగేష్ గౌడ బీజేపీలో చురుకైన నాయకుడిగా పని చేశారు. కర్ణాటక మాజీ సీఎం జగదీష్ శెట్టర్, ప్రస్తుత కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్య అనుచరుడిగా యోగేష్ గౌడ గుర్తింపు తెచ్చుకున్నారు. 2016 జూన్ 15వ తేదీన జిల్లా పంచాయితీ సభ్యుడిగా ఉన్న యోగేష్ గౌడ దారుణ హత్యకు గురైనాడు. వేటకొడవళ్లు, కత్తులతో యోగేష్ గౌడను అతికిరాతకంగా నరికి చంపేశారు.

కాంగ్రెస్ మాజీ మంత్రి
2016లో కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులే యోగేష్ గౌడను దారుణంగా హత్య చేయించారని అప్పట్లో బీజేపీ నాయకులు ఆరోపించారు. అప్పటి కర్ణాటక మంత్రి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన వినయ్ కులకర్ణి రెచ్చగొట్టడం వలనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యోగేష్ గౌడను హత్య చేశారని మాజీ సీఎం జగదీష్ శెట్టర్, ప్రస్తుత కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పదేపదే ఆరోపిస్తూ వచ్చారు.

సీబీఐ ఎంట్రీతో షాక్
ధారవాడలోని బారాకోట్రీ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, ప్రస్తుతం ధారవాడ గ్రామీణ శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే అయిన వినయ్ కులకర్ణి అక్కడే నివాసం ఉంటున్నారు. గురువారం వేకువ జామున సీబీఐ అధికారులు ధారవాడలోని కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి వినయ్ కులకర్ణి ఇంటి తలుపులు తట్టారు. మీతో చాలా పని ఉందని, మా వెంటరండి అంటూ వినయ్ కులకర్ణిని ధారవాడ ఉప విభాగం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారణ చేస్తున్నారు.

అసలు ఏం జరిగింది ?
కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి వినయ్ కులకర్ణి సోదరుడు విజయ్ కులకర్ణిని కొన్ని నెలల క్రితం సీబీఐ అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించారు. ఆ సందర్బంలో విజయ్ కులకర్ణి చెప్పిన పూర్తి సమాచారాన్ని సీబీఐ అధికారులు రికార్డు చేసుకున్నారు. బీజేపీ నేత యోగేష్ గౌడను మాజీ మంత్రి వినయ్ కులకర్ణినే హత్య చేయించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.

బీజేపీ రూలింగ్ తో సీన్ రివర్స్
కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత యోగేష్ గౌడ హత్య కేసును సీబీఐకి అప్పగించారు. యోగేష్ గౌడ హత్య కేసు సీబీఐకి అప్పగించిన తరువాత కాంగ్రెస్ మాజీ మంత్రి వినయ్ కులకర్ణి బీజేపీలో చేరడానికి అనేక ప్రయత్నాలు చేశారని, అయితే కమలం నాయకులు మాత్రం అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలిసింది. మొత్తం మీద బీజేపీ నాయకుడి హత్య కేసులో మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు హడలిపోతున్నారు.