బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Cheating: పవన్ ముంచేశాడు, ఫేస్ బుక్ లైవ్ లో వీడియో, ఆత్మహత్య, ఎవ్వరినీ వదలద్దు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ యలహంక: ఫ్రెండ్స్ మోసం చేశారని యువకుడు ఆవేదనతో విసిగిపోయాడు. ఎంత చెప్పినా ఫ్రెండ్స్ మాత్రం మారలేదని, తన జీవితం నాశనం కావడానికి వాళ్లే కారణం అయ్యారని ఆ యువకుడు రగిలిపోయాడు. స్నేహితులను ఎదిరించే శక్తిలేకపోవడంతో ఫేస్ బుక్ లో లైవ్ వీడియోలో మాట్లాడిన ఆ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నా చావుకు నా క్లోజ్ ఫ్రెండ్ కారణం, నా చావుకు కారణం అయిన వాళ్లను ఎవ్వరిని వదిలిపెట్టకండి అంటూ ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడిన ఆ యువకుడు ఆవేదనతో చేతకాని వాడిని నేను అంటూ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

Illegal affair: పెళ్లానికి పులిహోరా, ఉంచుకున్న దానికి...... ?, భార్య బంగారం, డబ్బు!Illegal affair: పెళ్లానికి పులిహోరా, ఉంచుకున్న దానికి...... ?, భార్య బంగారం, డబ్బు!

మంజు మాయం

మంజు మాయం

బెంగళూరులోని కొత్తనూరు ప్రాంతంలో మంజునాథ్ (28) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని రోజుల నుంచి మంజునాథ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతని కోసం గాలించారు. మంజునాథ్ ఆచూకి చిక్కకపోవడంతో మంజునాథ్ కుటుంబ సభ్యులు ఫిబ్రవరి 26వ తేదీన కొత్తనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాగలూరు కాలేజ్ లో శవం

బాగలూరు కాలేజ్ లో శవం

పోలీసులు, కుటుంబ సభ్యులు మంజునాథ్ కోసం గాలించారు. బాగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలేజ్ క్యాంపస్ లో మంజునాథ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాగలూరు పోలీసులు పరిశీలించి వెంటనే కొత్తనూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఫేస్ బుక్ లైవ్ లో వీడియో

మంజునాథ్ ఆత్మహత్య చేసుకునే ముందు ఫేస్ బుక్ లో లైవ్ లో మాట్లాడుతూ ఓ వీడియో తీసి దానిని స్నేహితులు, బంధువులకు పంపించారు. తన ఆత్మహత్యకు తన క్లోజ్ ఫ్రెండ్ పవన్, అతని స్నేహితులు కారణం అని, వాళ్లను నమ్మినందుకు నన్ను నిలువునా ముంచేశారని, వాళ్లను ఎవ్వరినీ వదిలిపెట్టకూడదని, నా చావుకు వాళ్లే కారణం అని మంజునాథ్ ఆవేదనతో చెప్పి తరువాత ఆత్మహత్య చేసుకున్నాడు.

రూ. 11 లక్షలు డీలింగ్

రూ. 11 లక్షలు డీలింగ్

వీడియో చూసిన వెంటనే బంధువులు, స్నేహితులు మంజునాథ్ మొబైల్ కు ఫోన్ చేశారని, అప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఆత్మహత్య చేసుకున్న మంజునాథ్ అతని స్నేహితుడు పవన్ కు రూ. 11 లక్షలు ఇచ్చాడని ఆతను ఆత్మహత్య చేసుకునే ముందు ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడిన వీడియోలో రికార్డు అయ్యిందని పోలీసులు అన్నారు.

లాక్ డౌన్ ఎఫెక్ట్ + పవన్ దెబ్బ

లాక్ డౌన్ ఎఫెక్ట్ + పవన్ దెబ్బ

మంజునాథ్, పవన్ మరో ఇద్దరు గతంలో ఓ మొబైల్ షాప్ లో పని చేసేవాళ్లు. ఉద్యోగం చేస్తున్న నలుగురు స్నేహితులు తరువాత అందరూ కొన్నికొన్ని లక్షల రూపాయలు వేసుకుని సొంతంగా మొబైల్ షాప్ పెట్టారని పోలీసులు అన్నారు. మొబైల్ షాప్ పెట్టిన తరువాత లాక్ డౌన్ అమలు చేశారని, తరువాత మొబైల్ షాప్ మూసివేశారని పోలీసులు అన్నారు.

పవన్ నిలువునా ముంచేశాడు

పవన్ నిలువునా ముంచేశాడు

మొబైల్ షాప్ పవన్ పేరుతో ఉందని, మంజునాథ్ కు డబ్బులు ఇవ్వలేదని అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అన్నారు. మంజునాథ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న పవన్ తప్పించుకుని పరార్ కావడంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాగా డబ్బులు సంపాధించాలని స్నేహితుడిని నమ్ముకుని రూ. 11 లక్షలు ఇచ్చి మోసపోయిన మంజునాథ్ ఫేస్ బుక్ లో లైవ్ లో మాట్లాడి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

English summary
Cheating: A young man uploaded a live video on Facebook about a friend's cheating and committed suicide in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X