CM seat: సీఎం కుర్చి సేఫ్ గా ఉంటుందా ?, అమిత్ షా ఎంట్రీతో ? ఏసీలో కూడా సీఎంకు చెమటలు!
బెంగళూరు/న్యూఢిల్లీ: ముఖ్యమంత్రిగా తనకున్న పదవి కాలం పూర్తి చెయ్యాలని ఆశపడుతున్న సీఎం ఆశల మీద కొందరు మంత్రులు, సీనియర్ నాయకులు నీళ్లు చల్లుతున్నారు. సీఎంను మార్చేస్తున్నారని, అందుకే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మన రాష్ట్రానికి వచ్చారని కొందరు బీజేపీ నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా బెంగళూరు చేరుకోవడంతో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ని మార్చి వందశాతం హిందూ మార్క్ ఉన్న నాయకుడిని సీఎం చేస్తారని కర్ణాటకలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
రెండు రోజుల ముందు బీజేపీ సీనియర్ నాయకుడు, గతంలో సీఎం రేసులో ఉన్న బీఎల్. సంతోష్ ఇటీవల ఓ కన్నడ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూ కూడా బీజేపీ నాయకులను అయోమయంలో పడేసింది. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఆపరేషన్ కమల పేరుతో ఆ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న బీఎస్ యడియూరప్పకు వయసు మీదపడింది అనే చిన్న సాకుతో ఆయన్ను సీఎం పదవి నుంచి తప్పించారు. ఇప్పుడు అమిత్ షా బెంగళూరులో మకాం వేసిన సందర్బంగా మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్. యడియూరప్ప కూడా తెరమీదకు రావడంతో కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
Revenge:
రెండో
భార్యతో
భర్త
ఎంజాయ్,
15
ఏళ్లకు
మొదటి
భార్యను
చూడాలని
వెళ్లి
?,
నరికి
చంపిన
కొడుకు!

కర్ణాటక బీజేపీ హైకమాండ్ లెక్కలే వేరప్ప
దేశంలో బీజేపీ రాజకీయాలు వేరు. కర్ణాటకలో బీజేపీ రాజకీయాలు వేరు. దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా బీజేపీ హైకమాండ్ చెప్పినట్లు అందరూ నాయకులు నడుచుకుంటారు. అది బీజేపీ లెక్కలు. అయితే కర్ణాటకలో బీజేపీ మాత్రం ఆ రాష్ట్రంలో బీజేపీ నాయకుల మీద ఆదారపడవలసి ఉంటుంది. ఎందుకంటే కర్ణాటకలో కొందరు బీజేపీ నాయకులు ఆ వర్గంలో బలమైన నాయకులు కావడమే అందుకు కారణం. అందుకే బీజేపీ హైకమాండ్ కర్ణాటక రాజకీయాల్లో ఇంతకాలం ఆచితూచి అడుగులు వేసింది.

బీజేపీ ప్రభుత్వం రావడానికి అప్ప కారణం
కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఆపరేషన్ కమల పేరుతో ఆ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న బీఎస్ యడియూరప్పకు వయసు మీదపడింది అనే చిన్న సాకుతో ఆయన్ను సీఎం పదవి నుంచి తప్పించారు. కర్ణాటకలో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని బీఎస్. యడియూరప్ప కూప్పకూల్చి ఆయన సీఎం అయిన విషయం తెలిసిందే.

సీఎంకు షాక్ ఇచ్చిన సీనియర్ నాయకులు
కర్ణాటక ముఖ్యమంత్రి తనకున్న పదవి కాలం పూర్తి చెయ్యాలని ఆశపడుతున్న సీఎం బసవరాజ్ బొమ్మయ్ ఆశల మీద కొందరు మంత్రులు, సీనియర్ నాయకులు నీళ్లు చల్లుతున్నారు. సీఎం బసవరాజ్ బొమ్మయ్ ని పదవి నుంచి తప్పిస్తున్నారని, మరో నాయకుడిని సీఎం చేస్తున్నారని, అందుకే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మన రాష్ట్రానికి వచ్చారని కొందరు బీజేపీ నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు.

బెంగళూరులో అమిత్ షా
కేంద్ర హోమ్ మంత్రి, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బెంగళూరులో మకాం వేశారు. అమిత్ షాను బీజేపీ సీనియర్ నేతలు చాలా మంది కలుస్తున్నారు. ఇటీవల కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు పరిశీలించడానికి, నాయకత్వంలో మార్పులు, చేర్పులు చెయ్యడానికి అమిత్ షా బెంగళూరు వచ్చారని కొందరు బీజేపీ నాయకులు అంటున్నారు.

యడియూరప్ప ఎంట్రీ
వయసు మీదపడిందని సీఎం పదవి నుంచి తప్పించే సమయంలో బీఎస్. యడియూరప్ప ఆయన సూచించిన బసవరాజ్ బొమ్మయ్ ని ముఖ్యమంత్రిని చేసిన బీజేపీ హైకమాండ్ అప్పటి నుంచి కర్ణాటక రాజకీయాల మీద కన్ను వేసింది. బసవరాజ్ బొమ్మయ్ ముఖ్యమంత్రిగా 10 నెలల పూర్తి చేసిన సందర్బంగా అమిత్ షా బెంగళూరు రాకతో కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి.

అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయని ?
ఇదే సమయంలో తాను అమిత్ షాను కలిసి కర్ణాటకలో జరుగుతున్న రాజకీయాల గురించి చర్చిస్తానని బీఎస్. యడియూరప్ప అంటున్నారు. వచ్చే సంవత్సరం కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్బంగా బీజేపీ హైకమాండ్ కర్ణాటక మీద ప్రత్యేకంగా శ్రద్ద పెట్టింది.

సీఎంను మార్చరు.... ఆయనే కొనసాగుతారు
ఈసారి కూడా కర్ణాటకలో అధికారంలోకి రావాలని బీజేపీ హైకమాండ్ అనేక ప్రయత్నాలు చేస్తోంది. అయితే బసవరాజ్ బొమ్మయ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, ఆయన నాయకత్వాన్ని ఇప్పట్లో మార్చే ప్రసక్తే లేదని మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప అంటున్నారు.