Condition: లవర్స్ పెళ్లికి అందరూ గ్రీన్ సిగ్నల్, సినిమా స్టైల్లో కండీషన్, లాడ్జ్ లో లవర్స్ ఒకే ఫ్యాన్ కు !
బెంగళూరు/మైసూరు/చామరాజనగర్: ఒకే ఊరిలో నివాసం ఉంటున్న యువతి, యువకుడు చిన్నప్పటి నుంచి కలసిమెలసి తిరుగుతున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం యువతి, యువకుడు ప్రేమలో పడ్డారు. ఒకేఊరికి వాళ్లు కావడం, చిన్నప్పటి నుంచి ఇద్దరిని ఇరు కుటంబాలు చూస్తూ ఉండటంతో వారి పెళ్లికి కుటుంబ సభ్యులు పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. పెళ్లికి రెండు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అయితే ప్రియురాలి తండ్రి కాబోయే అల్లుడిని పిలిపించి ఓ కండీషన్ పెట్టాడు. నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నేను చెప్పిన పని పూర్తి చెయ్యాలని, అప్పుడే మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. ప్రియురాలి తండ్రి సినిమా స్టైల్ కోరికను తీర్చడానికి ప్రియుడు అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే కాబోచే మామ పెట్టిన కండీషన్ లో సక్సస్ కాలేకపోయిన ప్రియుడు మీరు చెప్పినట్లు నేనే చేస్తానని, అయితే కొంత సమయం పడుతోందని, అంతకు ముందే మా పెళ్లి చెయ్యాలని కాబోయే మామ కాళ్లు పట్టుకున్నాడు. అయితే ప్రియురాలి తండ్రి మాత్రం నేను మోనార్క్ ని, నన్ను ఎవ్వరూ మోసం చెయ్యలేరు అంటూ అతని పట్టువదల్లేదు. ప్రియురాలి తండ్రి కోరిక తీర్చలేక ప్రియుడు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చివరికి లాడ్జ్ లోకి వెళ్లిన ప్రేమికులు ఒకే ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

ప్రేమికులు
కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేట తాలుకాలోని బోమ్మాలపురం గ్రామంలో సతీష్ (21), వరలక్ష్మి (20) అనే యువతి, యువకుడు నివాసం ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి సతీష్, వరలక్ష్మి కలిసి చదువుకున్నారు. ఒకేఊరి వాళ్లు కావడం, ఒకే కులం కావడంతో వరలక్ష్మి, సతీష్ ప్రేమలో పడ్డారు.

నాలుగు సంవత్సరాల నుంచి ఎంజాయ్
గత నాలుగు సంవత్సరాల నుంచి వరలక్ష్మి, సతీష్ ప్రేమించుకుంటున్నారు. బీకాం పూర్తి చేసిన సతీష్ పోలీసు ఉద్యోగం సంపాధించాలని పరీక్షలు రాయడానికి సిద్దం అవుతున్నాడు. చామరాజనగర్ లోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో వరలక్ష్మి నర్సింగ్ విద్యాభ్యాసం చేస్తోంది. ఎలాగైనా వరలక్ష్మిని పెళ్లి చేసుకుని జీవితాంతం సంతోషంగా ఉండాలని సతీష్ అనుకున్నాడు.

పెళ్లికి సినిమా స్టైల్లో కండీషన్ పెట్టిన ప్రియురాలి తండ్రి
సతీష్, వరలక్ష్మి ఒకేఊరికి వాళ్లు కావడం, చిన్నప్పటి నుంచి ఇద్దరిని ఇరు కుటంబాలు చూస్తూ ఉండటంతో వారి పెళ్లికి కుటుంబ సభ్యులు పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. సతీష్, వరలక్ష్మి పెళ్లికి రెండు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అయితే ప్రియురాలు వరలక్ష్మి తండ్రి కాబోయే అల్లుడు సతీష్ ను పిలిపించి సినిమా స్టైల్లో ఓ కండీషన్ పెట్టాడు.

మామ కోరిక తీర్చాలని ప్రయత్నాలు
నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నేను చెప్పిన పని పూర్తి చెయ్యాలని, నువ్వు ప్రభుత్వ ఉద్యోగం సంపాధించిన తరువాత మా అమ్మాయి వరలక్ష్మిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని ఆమె తండ్రి ప్రియుడు సతీష్ కు చెప్పాడు. ప్రియురాలు వరలక్ష్మి తండ్రి సినిమా స్టైల్ కోరికను తీర్చడానికి ప్రియుడు సతీష్ అనేక ప్రయత్నాలు చేశాడు. పోలీసు ఉద్యోగం కాకపోయినా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాధించాలని అనేక ప్రయత్నాలు చేశాడు.

కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు
అయితే
కాబోచే
మామ
పెట్టిన
కండీషన్
లో
సక్సస్
కాలేకపోయిన
ప్రియుడు
సతీష్
మీరు
చెప్పినట్లు
నేనే
ప్రభుత్వ
ఉద్యోగం
సంపాధిస్తానని,
అయితే
కొంత
సమయం
పడుతోందని,
అంతకు
ముందే
మా
పెళ్లి
చెయ్యాలని,
కచ్చితంగా
ప్రభుత్వ
ఉద్యోగం
సంపాధించి
మీ
అమ్మాయిని
పువ్వుల్లో
పెట్టి
చూసుకుంటానని
సతీష్
అతనికి
కాబోయే
మామ
కాళ్లు
పట్టుకున్నాడు.

నేను మోనార్క్...... నన్ను ఎవ్వరూ మోసం చెయ్యలేరు
పెళ్లి జరిగిపోయిన తరువాత నువ్వు ప్రభుత్వ ఉద్యోగం సంపాధించకుంటే తరువాత నేను ఏమీ చెయ్యలేనని, ముందు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించు తరువాత పెళ్లి విషయం ఆలోచిద్దాం అంటూ వరలక్ష్మి తండ్రి ప్రియుడు సతీష్ కు తేల్చి చెప్పాడు. అయితే ప్రియురాలు వరలక్ష్మి తండ్రి మాత్రం నేను మోనార్క్ ని, నన్ను ఎవ్వరూ మోసం చెయ్యలేరు అంటూ అతని పట్టువదల్లేదు.

లాడ్జ్ లో ఒకే ఫ్యాన్ కు ఉరి వేసుకుని ప్రేమికుల ఆత్మహత్య
ప్రియురాలు వరలక్ష్మి తండ్రి కోరిక తీర్చలేక ప్రియుడు సతీష్ నానా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుని జీవించలేమని, ఆత్మహత్య చేసుకోవడమే మంచిదని ప్రేమికులు వరలక్ష్మి, సతీష్ డిసైడ్ అయ్యారు. మైసూరులోని ఓ లాడ్జ్ లో గది అద్దెకు తీసుకున్నారు. తరువాత వరలక్ష్మి ఆమె తల్లికి ఫోన్ చేసి కరోనా వైరస్ విషయంలో, ఒమిక్రాన్ వైరస్ విషయం మీరు జాగ్రత్తగా ఉండాలని, మీ ఆరోగ్యం కాపాడుకోవాలని ఫోన్ చేసి చెప్పింది. లాడ్జ్ లోకి వెళ్లిన ప్రేమికులు వరలక్ష్మి, సతీష్ ఒకే ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

ఊరందరి ఊహలు రివర్స్
వరలక్ష్మి
తండ్రి
సినిమా
స్టైల్లో
కండీషన్
పెట్టి
పెళ్లిని
అడ్డుకోవడంతో
ప్రేమికులు
ఆత్మహత్య
చేసుకోవడంతో
రెండు
కుటంబాలు
విషాదంలో
మునిగిపోయాయి.
గత
నాలుగు
సంవత్సరాల
నుంచి
వరలక్ష్మి,
సతీష్
కలిసిమెలసి
తిరుగుతున్నారు,
ఇద్దరూ
ప్రేమించుకుంటున్నారని
అందరికి
తెలుసు.
పెళ్లికి
ముందే
వరలక్ష్మి,
సతీష్
మూడునాలుగు
రోజులు
విహారయాత్రలకు
వెళ్లి
తిరిగి
వచ్చారు.
ఇద్దరూ
పెళ్లి
చేసుకుని
జీవితాంతం
సుఖంగా
ఉంటారని
గ్రామంలోని
అందరూ
ఊహించుకున్నారు,
అయితే
అందరి
అంచనాలు
తల్లకిందులు
కావడంతో
గ్రామస్తులు
షాక్
అయ్యారు.