బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Congress meeting: లీకు వీరులు ఎవరో ? ఏడాది ముందు మాయం, నిద్రలేచిన నటి రమ్య, కుట్ర!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సంబంధించి విభేదాలు బయటపడిన నేపథ్యంలో సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) భేటీలో సీనియర్ నేతల మధ్య వాడివేడిగా చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి అంటిమున్నట్లు ఏడాదికి పైగా దూరంగా ఉంటున్న కర్ణాటక మాజీ ఎంపీ, బహుబాష నటి రమ్య సంవత్సరం తరువాత ఒక్కసారిగా తెరమీదకు వచ్చారు.

Recommended Video

Sonia Gandhi -'Will Step Down,Find A New Chief' Sonia Responds To Congress Leaders Letter

వంద సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంతర్గత సమాచారం సీడబ్ల్యూసీ నేతలకు తెలీకుండా ఎలా బయటకు వచ్చింది ? ఈ వివరాలు ఎవరు లీక్ చేశారు ? ఆ లీకు వీరులు ఎవరు ? అంటూ నటి రమ్య మండిపడ్డారు. ఇదేమైన చిన్న పిల్లల వ్యవహారామా ? చిన్నపిల్లల ఆటలా ? అంటూ నటి రమ్య కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలపై విరుచుకుపడ్డారు.

Public Park: లేడీ పోలీసు, చుట్టూ ఆరు మంది పోలీసులు, ఏం జరిగిందంటే ?: ఒకే దెబ్బకు ఆరు వికెట్లు!Public Park: లేడీ పోలీసు, చుట్టూ ఆరు మంది పోలీసులు, ఏం జరిగిందంటే ?: ఒకే దెబ్బకు ఆరు వికెట్లు!

రాహుల్ గాంధీ ఫైర్!

రాహుల్ గాంధీ ఫైర్!

యూపీఏ చైరపర్సన్ సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాసిన లేఖ విషయంలో రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. బీజేపీతో కుమ్మక్కు అయిన కొందరు నేతలే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు ? అంటూ రాహుల్ గాంధీ సొంత పార్టీలోని కొందరు సీనియర్ నేతలపై విమర్శలు చేశారని ఆరోపణలు వచ్చాయి.

లీకు వీరులు ఎవరు?

లీకు వీరులు ఎవరు?

కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యహారాల గురించి, సీడబ్ల్యూసీ నేతలు సోనియా గాంధీకి రాసిన లేఖలు ఎవరు మీడియాకు విడుదల చేశారు ? అనే విషయంపై ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. CWC నాయకుల రాసిన లేఖలు ఎవరు మీడియాకు విడుదల చేశారు ? ఆ లీకు వీరులు ఎవరు ? అని ప్రముఖ నటి, మాజీ ఎంపీ (కర్ణాటకలోని మండ్య) రమ్య అలియాస్ దివ్యా స్పందన సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన లీకు వీరులను ప్రశ్నించారు.

షాక్ కు గురైనా తెలుసా!

షాక్ కు గురైనా తెలుసా!

కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన వివరాలు మీడియాకు లీక్ చెయ్యడమే కాకుండా CWC సమావేశంలో నిమిష నిమిషానికి ఏం జరుగుతుందో ? అనే విషయం పూసగుచ్చినట్లు కొందరు మీడియాకు, ప్రత్యర్థ పార్టీలకు సమాచారం ఇస్తున్నారని నటి రమ్య ఆరోపించారు. ఈ విషయాలు అన్ని తెలిసి తాను ఆశ్చర్యానికి గురైనానని నటి రమ్య మండిపడుతున్నారు.

ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడు

ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడు

కాంగ్రెస్ పార్టీలోని కొందరు పెద్దల తీరుపై బ్యూటీ రమ్య తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇంటి దొంగలను ఆ ఈశ్వరుడు (శివుడు) కూడా కనిపెట్టలేరని నటి రమ్య పెద్దలు చెప్పిన సామెతను గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జిత్ వాలా సైతం నటి రమ్యలాగే సొంత పార్టీ నేతల తీరుపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

2019 మేలో మాయం అయిన రమ్య

2019 మేలో మాయం అయిన రమ్య

గత లోక్ సభ ఎన్నికల సందర్బంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా వ్యవహారాలు అన్నీ నటి రమ్యనే చూసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జ్ గా ఉన్న నటి రమ్య తరువాత ఆ పార్టీకి రానురాను దూరం అయ్యారు. ఫేస్ బుక్, వాట్సాప్ తో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారిక వాట్సాప్ గ్రూప్ తో సహ సోషల్ మీడియాలోని అన్ని అకౌంట్లు క్లోజ్ చేసి ఒక్కసారిగా దూరం అయిన నటి రమ్య 2019 మే నెలలో మాయం అయిపోయింది.

రాజకీయాలు, నటనకు గుడ్ బై

రాజకీయాలు, నటనకు గుడ్ బై

గత లోక్ సభ ఎన్నికల్లో 543 నియోజక వర్గాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కేవలం 52 స్థానాల్లో విజయం సాధించడంతో నటి రమ్య కాంగ్రెస్ పార్టీలో అడ్రస్ లేకుండా పోయారు. అయితే ఇప్పుడు సొంత పార్టీ నేతలపై రాహుల్ గాంధీ మండిపడుతున్న సమయంలో నటి రమ్య ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చారు. తన రాజకీయ జీవితం ఎప్పుడో ముగిసిందని, ఇక ముందు తాను సినిమాల్లో కూడా నటించనని కొంతకాలం క్రితం నటి రమ్య ది ప్రింట్ మీడియాకు ఇంటర్వూ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.

English summary
Congress: Former MP, Former Congress media chief Divya Spandana accused the dissident leaders of leaking not just the letter but also the discussions occurring during the ongoing CWC meet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X