బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: ఫేమస్ ప్రవేట్ ఆసుపత్రుల లైసెన్స్ లు రద్దు, ఐటీ సిటీలో ప్రజలతో గేమ్స్, దూల తీరింది!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని సిలికాన్ సిటి బెంగళూరు విలవిలలాడుతోంది. ఇప్పటికే బెంగళూరు సిటీలో 53, 324 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. కరోనా వైరస్ వ్యాధి సోకిన వారికి చికిత్స చేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వానికి హామీ ఇచ్చినా ఆ నియమాలు తుంగలో తొక్కేస్తున్నారు. కరోనా వైరస్ సోకిన వారికి బెడ్ లు ఖాళీ లేవని, మేము చికిత్స చెయ్యలేమని దర్బారు ప్రదర్శించిన బెంగళూరులోని 19 ప్రముఖ ఆసుపత్రుల లైసెన్స్ లను రద్దు చేశారు. ఒకప్పుడు బతికితే బెంగళూరులో బతకాలి అనే చెప్పిన వాళ్లు నేడు కరోనా దెబ్బకు బెంగళూరు వద్దు తొక్కవద్దు, బతికుంటే ఎక్కడుంటే అదే బెంగళూరు అంటూ పరుగు తీస్తున్నారు.

Honeytrap: నాజూకు అమ్మాయిలు, కావలసినంత కండ, లావు పొడువు ఆంటీలు, మీడియా ముసుగులో డీల్!Honeytrap: నాజూకు అమ్మాయిలు, కావలసినంత కండ, లావు పొడువు ఆంటీలు, మీడియా ముసుగులో డీల్!

బెంగళూరులో 53 వేల కరోనా పాజిటివ్ కేసులు

బెంగళూరులో 53 వేల కరోనా పాజిటివ్ కేసులు

ఐటీ, బీటీ సంస్థలకు ప్రపంచ ప్రసిద్ది చెందిన సిలికాన్ సిటీ బెంగళూరులో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక్క జులై నెలలోనే బెంగళూరు ప్రజలకు కరోనా వైరస్ సినిమా చూపించింది. ఈ దెబ్బతో బెంగళూరు సిటీలో శుక్రవారం వరకు 53, 324 కరోపా పాజిటివ్ కేసులు నమోదైనాయని అధికారులు ప్రకటించారు.

ప్రభుత్వానికి హామీ

ప్రభుత్వానికి హామీ

కర్ణాటక ప్రభుత్వం ఆదేశాల మేరకు బెంగళూరు సిటీలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లోని 50% పడకలు (బెడ్స్) కరోనా వైరస్ రోగులకు చికిత్స చెయ్యడానికి కేటాయించాలి. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు మాత్రమే కరోనా రోగుల నుంచి వసూలు చెయ్యాల్సి ఉంటుంది. ఇదే విషయంపై జులై మొదట్లో కర్ణాటక ప్రభుత్వం- ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఒప్పందం కుదుర్చుకుంది.

కరోనా రోగులతో గేమ్స్

కరోనా రోగులతో గేమ్స్

బెంగళూరు నగరంలో విపరీతంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ లక్షణాలు ఉన్న ప్రజలు ఎక్కడ మా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అనే భయంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం డబ్బులు సంపాధించాలనే దురాశతో బెడ్స్ ఖాళీగా లేవు, డాక్టర్లు అందుబాటులో లేరు, వైద్యులు సెలవుల్లో ఉన్నారు అంటూ సినిమా స్టోరీలు చెబుతున్నారని అనేక మంది ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు.

19 ఆసుపత్రుల లైసెన్స్ లు రద్దు !

19 ఆసుపత్రుల లైసెన్స్ లు రద్దు !

కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయంటూ వెలుతున్న ప్రజలకు ప్రైవేటు ఆసుపత్రులు చికిత్స చెయ్యడానికి నిరాకరిస్తున్నారని సమాచారం తెలుసుకున్న బృహత్ బెంగళూరు మహానగర పాలికె (BBMP) అధికారులు సీరియస్ అయ్యారు. ప్రజలు ఫిర్యాదులు చేసిన బెంగళూరు సౌత్ పరిధిలోని 19 ఆసుపత్రులను గుర్తించిన బీబీఎంపీ అధికారులు వాటి లైసెన్స్ లను తాత్కాలికంగా రద్దు చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల లైసెన్స్ లు రద్దు చేసినట్లు బ్యానర్లు ముద్రించి ఆసుపత్రుల ముందు ప్రదర్శిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల ముందు బ్యానర్లు చూస్తున్న ప్రజలు అక్కడ చికిత్స చేసుకోకుండా వేరే ఆసుపత్రులకు వెళ్లిపోతున్నారు.

Recommended Video

Rs.5,000 to Plasma Donors కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేస్తే.. రూ. 5 వేలు : ఏపీ సర్కార్
సీఎం చెప్పినా చీమకుట్టినట్లు లేదు

సీఎం చెప్పినా చీమకుట్టినట్లు లేదు

బెంగళూరు సిటీలోని ప్రైవేటు ఆసుపత్రులు 50 శాతం పడకలు కరోనా రోగులకు కేటాయించాలని, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు వసూలు చెయ్యాలని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యానికి మనవి చేశారు. సీఎం బీఎస్. యడియూరప్పతో జరిగిన మీటింగ్ లో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం అందుకు అంగీకరించారు. అయితే ప్రభుత్వ నియమాలు గాలికి వదిలేసి కరోనా వైరస్ చికిత్స సరైన సమయంలో అందించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆసుపత్రుల యాజమాన్యంపై బీబీఎంపీ అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించారు.

English summary
Coronavirus: BBMP cancelled the license of 19 private hospital in Bengaluru south for not reserve 50 per cent of bed for COVID -19 patients.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X