బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

CET exams: పరీక్షలు రాసిన కరోనా పాజిటివ్ విద్యార్థులు, ఫుల్ హ్యాపీ, నో కాంప్రమైజ్, ఆంధ్రా, తెలంగాణ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ బళ్లారి: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి తాండవం చేస్తున్న సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకుని CET పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాధిని లెక్క చెయ్యకుండా వేలాది మంది విద్యార్థలు సీఇటీ పరీక్షలకు హాజరయ్యారు. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన విద్యార్థులు సైతం సీఇటీ పరీక్షలు రాయడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులు సైతం సీఇటీ పరీక్షలు రాసి హ్యాపీగా వెళ్లారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నో కాంప్రమైజ్ అంటూ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించింది. ఇతర విద్యార్థులకు కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నది.

I'M NOT HIM: టెక్కీ స్కెచ్, 30 సార్లు సినిమా చూసి 20 మందికి రసగుల్లా పెట్టాడు, జీవితాన్నే!I'M NOT HIM: టెక్కీ స్కెచ్, 30 సార్లు సినిమా చూసి 20 మందికి రసగుల్లా పెట్టాడు, జీవితాన్నే!

సీఇటీ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్

సీఇటీ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్

కర్ణాటకలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు లక్షకు పైగా పెరిగిపోయినా లెక్క చెయ్యని ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన తేదీల్లోనే KCET పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యార్థుల భవిష్యత్తుతో కూడుకోవడంతో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గురువారం (జులై 30వ తేది) బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని అన్ని జిల్లాల్లో సీఇటీ పరీక్షలు ప్రారంభం అయ్యాయి.

ఆంధ్రా, తెలంగాణ విద్యార్థులు

ఆంధ్రా, తెలంగాణ విద్యార్థులు

కర్ణాటకలో గురువారం ప్రారంభం అయిన సీఇటీ పరీక్షలకు కర్ణాటకతో పాటు దేశంలోని ఇతర రాస్ట్రాలకు చెందిన విద్యార్థులు హాజరైనారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం బెంగళూరులో పోటీపడి సీఇటీ పరీక్షలు రాయడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాల విద్యార్థులు వేల సంఖ్యలు హాజరౌతుంటారు. ఎప్పటిలాగే గురువారం ప్రారంభం అయిన సీఇటీ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు హాజరైనారు.

 విద్యార్థులకు కరోనా పాజిటివ్

విద్యార్థులకు కరోనా పాజిటివ్

కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో సీఇటీ పరీక్షలు రాసే విద్యార్థులు కరోనా బారినపడ్డారు. కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా, వారి వలన ఇతర విద్యార్థులకు ఇబ్బందులు ఎదురుకాకుండా బళ్లారి జిల్లాధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. గురువారం బళ్లారి జిల్లాలో కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులు గురువారం సీఇటీ పరీక్షలకు హాజరై సంతోషంగా పరీక్షలు రాసి హమ్మయ్యా అంటూ ఊపిరిపీల్చుకున్నారు.

 మెడికల్ కాలేజ్ లో పరీక్షలు

మెడికల్ కాలేజ్ లో పరీక్షలు

బళ్లారి జిల్లాలో కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులు బళ్లారి ప్రభుత్వ డెంటల్ మెడికల్ కాలేజ్ లో సీఇటీ పరీక్షలు రాయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులకు పీపీఇ కిట్ లు, మాస్క్ లు వేసి అన్ని జాగ్రత్తలు తీసుకున్న తరువాత వారు పరీక్షలు రాయడానికి అధికారులు అవకాశం కల్పించారు.

అంబులెన్స్ లో హ్యాపీగా వచ్చి పరీక్షలు !

అంబులెన్స్ లో హ్యాపీగా వచ్చి పరీక్షలు !

బళ్లారి, సిరిగుప్ప, హడగలి ప్రాంతాలకు చెందిన ఆరు మంది కరోనా పాజిటివ్ విద్యార్థులను అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రత్యేక అంబులెన్స్ ల్లో పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తరువాత కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థుల కారణంగా ఇతరులకు వైరస్ వ్యాపించకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం మీద కరోనా పాజిటివ్ వచ్చినా విద్యార్థులు సీఇటీ పరీక్షలు రాయడానికి ప్రభుత్వం అవకాశం కల్పించడంతో ఆ విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి, అధికారులకు చేతులు ఎత్తి మొక్కుతున్నారు.

English summary
Coronavirus: COVID -19 positive students will write CET exam in Ballari district. Ballari district administration will provide PPE kit, mask for the students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X