బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: దేశంలో మొదటిసారి RTPCR mobil lab ప్రారంభం, ICMR గ్రీన్ సిగ్నల్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. దేశంలోనే మొట్టమొదటిసారి ICMR అనుమతితో ఆర్ టీపీసీఆర్ (RTPCR) మొబైల్ ల్యాబ్ ను బెంగళూరు సిటీలో ప్రారంభించారు. బుధవారం బెంగళూరులోని ఐఐఎస్ క్యాంపస్ లో ఆర్ టీపీసీఆర్ మొబైల్ ల్యాబ్ ను ప్రారంభించి నగరంలో వివిద ప్రాంతాల్లోని కంటోన్మెంట్ జోన్లలో కరోనా వైరస్ పరీక్షలు చెయ్యడానికి సిద్దం అయ్యారు.

Lockdown: కోలీవుడ్ నటీమణులతో గెస్ట్ హౌస్ లో బిగ్ షాట్ రొమాన్స్, చేసింది చాలు పదనాయనా, అరెస్టు !Lockdown: కోలీవుడ్ నటీమణులతో గెస్ట్ హౌస్ లో బిగ్ షాట్ రొమాన్స్, చేసింది చాలు పదనాయనా, అరెస్టు !

 బెంగళూరులో భోణి

బెంగళూరులో భోణి

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తాండవం చేస్తున్న విషయం తెలిసిందే. భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, మరణాల రేటు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు శక్తివంచన లేకుండా పని చేస్తున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా దేశంలో మొట్టమొదటిసారి బెంగళూరులో RTPCR మొబైల్ ల్యాబ్ ను బుధవారం ప్రారంభించారు.

ICMR గ్రీన్ సిగ్నల్

ICMR గ్రీన్ సిగ్నల్

దేశంలో మొట్టమొదటి ఆర్ టీపీసీఆర్ మొబైల్ ల్యాబ్ ను ప్రారంభించడానికి ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. బెంగళూరులో బుధవారం కర్ణాటక వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ ఐఐఎస్ క్యాంపస్ లో కోవిడ్ -19 ఆర్ టీపీసీఆర్ మొబైల్ ల్యాబ్ ను ప్రారంభించారు. ఇదే సమయంలో కోవిడ్ -19 మొబైల్ ల్యాబ్ పనితీరును మంత్రి డాక్టర్ సుధాకర్ క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.

 9, 000 మందికి పరీక్షలు

9, 000 మందికి పరీక్షలు


ఆర్ టీపీసీఆర్ కోవిడ్ 19 మొబైల్ ల్యాబ్ లో పరీక్షలు చేసుకున్న తరువాత కేవలం నాలుగు గంటల సమయంలో పరీక్షల ఫలితాలు రానున్నాయి. అదే విధంగా మొబైల్ పరీక్షా కేంద్రంలో ప్రతిరోజు 400 మందికి కోవిడ్ -19 పరీక్షలు చెయ్యడానికి అవకాశం ఉందని మంత్రి డాక్టర్ సుధాకర్, వైద్యశాఖ అధికారులు తెలిపారు. నెలకు 9, 000 మందికి ఈ మొబైల్ ల్యాబ్ లో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించడానికి అవకాశం ఉందని మంత్రి డాక్టర్ సుధాకర్ వివరించారు.

Recommended Video

Telangana లో కరోనా ఉప్పెన, 2013 మందికి పాజిటివ్ | Telangana Corona Update || Oneindia Telugu
బెంగళూరు టార్గెట్

బెంగళూరు టార్గెట్

బెంగళూరు నగరంలో విపరీతంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. బెంగళూరు నగరంలోని అన్ని కంటోన్మెంట్ జోన్లలో కోవిడ్ -19 మొబైల్ ల్యాబ్ ద్వారా ప్రజలకు పరీక్షలు నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి డాక్టర్ సుధాకర్, రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ సచ్చిదానంద మీడియాకు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐఐఎస్ సీ డైరెక్టర్లు, వైద్యశాఖ అధికారులు, కోవిడ్ -19 ఇన్ చార్జ్ అధికారులు పాల్గొన్నారు.

English summary
Coronavirus: A mobile RTPCR is inaugurated by Medical Education Minister Dr.K.Sudhakar in Bengaluru on Wednesday. This is a first of its kind and nation’s only ICMR approved RTPCR Covid lab capable of conducting 9,000 tests per month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X