Public Park: లేడీ పోలీసు, చుట్టూ ఆరు మంది పోలీసులు, ఏం జరిగిందంటే ?: ఒకే దెబ్బకు ఆరు వికెట్లు!
బెంగళూరు/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID-19) దెబ్బకు ప్రపంచ దేశాలు గడగడలాడుతున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రపంచ దేశాలకు ఇంత వరకు సరైన ఔషదాలు అందుబాటులో లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. భౌతిక దూరం పాటించడం, ముఖాలకు మాస్క్ లు వేసుకోవడం, ప్రతినిత్యం చేతులు, శరీరం శుభ్రంగా పెట్టుకోవడం ఒక్కటే కరోనా వైరస్ కు విరుగుడుకు మందు అని స్పష్టంగా వెలుగు చూసింది. దేశవ్యాప్తంగా ముఖాలకు మాస్క్ లు లేకుండా ఎవరైనా రోడ్ల మీద కనపడితే భారీ మొత్తంలో జరిమానా వసూలు చేస్తున్న పోలీసులు ఆ నియమాలు గాలికి వదిలేశారు. పార్క్ లో అరడజను మంది పోలీసులు ఓ లేడీ పోలీసును మద్యలో పెట్టుకుని కాలం వెళ్లదీశారు. అటువైపు వెళ్లిన లేడీ డీసీపీ విషయం గుర్తించడంతో ఆరు మంది ఉద్యోగాలు వెంటనే ఊడిపోయాయి. ఆ పోలీసులు ప్రస్తుతం ఎలాంటి పనులు చెయ్యడానికి అవకాశం లేకుండా పోయింది. పార్క్ లో అసలు ఆ పోలీసులు ఏం చేశారంటే ?.
Illegal love: అక్రమ సంబంధం, ప్రియుడితో భార్య స్కెచ్, ఫ్రెండ్స్ తో భర్త రివర్స్ స్కెచ్, క్లైమాక్స్!

వైద్యులు, పోలీసులు దేవుళ్లు
భారతదేశంలో కరోనా వైరస్ తాండవం చెయ్యడం మొదలుపెట్టినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ద కార్మికులు, పోలీసులు ప్రాణాలు లెక్క చెయ్యకుండా ప్రజల కోసం పని చేస్తున్నారని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. ఇక లాక్ డౌన్ అమలు చేసిన సమయంలో, కరోనాను అరికట్టే విషయంలో పోలీసులు ప్రముఖ పాత్ర పోషించారని ప్రభుత్వాలు వారిని అభినందిస్తున్నాయి.

మాస్క్ లేకుండా కనపడితే సీన్ సిడేల్
కరోనా వైరస్ దెబ్బతో బయటకు వచ్చే వారు ఎవరైనా సరే కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు మనవి చేస్తూనే ఉన్నాయి. లాక్ డౌన్ సమయంలో కూడా ఏదైనా అత్యవసర పనులు ఉంటేనే ఇంటి నుంచి బయటకు రావాలని, అయితే మాస్క్ కచ్చితంగా వేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ లేకుండా ఎవరైనా బయటకు వస్తే స్థానిక పోలీసులు వారికి బెండ్ తీసిన సందర్బాలు మనం ఏన్నో చేశాము.

పోలీసులకు కరోనా డిస్కౌంట్ ఇచ్చిందా ?
మాస్క్ లు లేకుండా ఎవరైనా సామాన్య ప్రజలు రోడ్ల మీద కనపడితే స్థానిక పోలీసులతో పాటు కార్పోరేషన్, మునిసిపాలిటీ, నగర పంచాయితీలకు చెందిన ఆరోగ్య శాఖ అధికారులు భారీ మొత్తంలో ఫైన్ వసూలు చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ముఖాలకు మాస్క్ లు వేసుకోకుండా విధులకు హాజరౌతున్నారని అనేక ఆరోపణలు ఉన్నాయి. కరోనా వైరస్ ఏమైనా పోలీసులకు డిస్కౌంట్ ఇచ్చిందా ? అంటూ ఇప్పటికే అనేక మంది నెటిజన్లు సోషల్ మీడియాలో విరుచుకుపడిన విషయం తెలిసిందే.

పార్క్ లో లేడీ పోలీసు, పక్కలో పంచపాండవులు
ఐటీ, బీటీ సంస్థల దేశరాజధాని బెంగళూరు సిటీలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు ఆడిందే ఆటపాడిందే పాటగా తయారైయ్యిందని చాలాసార్లు ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి బెంగళూరు సిటీలో కొన్ని ప్రాంతాల్లో పోలీసులు ముఖాలకు మాస్క్ లు వేసుకోకుండా విధులు నిర్వహిస్తున్నారని, వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో బెంగళూరు సిటీలోని జాలహళ్ళిలోని సాహిత్యకోటే సర్కిల్ సమీపంలోని పార్క్ లో ఓ లేడీ పోలీసు, చుట్టూ మరో ఐదు మంది పోలీసులు మకాం వేశారు.

పబ్లిక్ పార్క్ లో ఏం జరిగింది ?
బెంగళూరు సిటీలోని గంగమ్మనగుడి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఏఏస్ఐ మంజునాథ్ నాయక్, హోడ్ కానిస్టేబుల్ నాగరాజు, లేడీ పోలీసు సుజనా, కానిస్టేబుల్స్ మదుసూధన్, పద్మనాథ్, విశ్వనాథ్ ఉద్యోగాలు చేస్తున్నారు. మీరు ట్రాఫిక్ సిగ్నల్స్ లో విధులు నిర్వహించాలని, ఎవరైనా ముఖాలకు మాస్క్ లు లేకుండా సంచరిస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకుని ఫైన్ వసూలు చెయ్యాలని పై అధికారులు సూచించారు. అయితే లేడీ కానిస్టుబుల్ సుజనాతో కలిసి ఏఎస్ఐ, మిగిలిన పోలీసులు పార్క్ లో మాకం వేసి ముఖాలకు మాస్క్ లు కూడా వేసుకోకుండా మీటింగ్ పెట్టి జోకులు వేసుకుని జల్సాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

అసలే లేడీ డీసీపీ, ఉద్యోగాలు ఊడిపోయాయి
పబ్లిక్ పార్క్ లో లేడీ పోలీసు సుజనాతో సాటి పోలీసులు మాస్క్ లు వేసుకోకుండా మీటింగ్ పెట్టిన విషయం బెంగళూరు పశ్చిమ ట్రాఫిక్ విభాగం డీసీపీ సౌమ్యలతకు తెలిసింది. పార్క్ వైపు వెళ్లిన డీసీపీ సౌమ్యలత విషయం గుర్తించారు. వెంటనే ఏఎస్ఐ మంజునాథ్ నాయక్, హోడ్ కానిస్టేబుల్ నాగరాజు, లేడీ పోలీసు సుజనా, కానిస్టేబుల్స్ మదుసూధన్, పద్మనాథ్, విశ్వనాథ్ లు ముఖాలకు మాస్క్ లు వేసుకోకుండా విధులు దుర్వినియోగం చేసి పబ్లిక్ పార్క్ లో మీటింగ్ పెట్టారని వెలుగు చూడటంతో అరడజను మందిని సస్పెండ్ చేశారు.

వ్యాపారాలు చేస్తే అంతే కథ
ప్రభుత్వ నియమాలు గాలికి వదిలేసి విధులు దుర్వినియోగం చేసి సస్పెండ్ అయిన ఏఎస్ఐ మంజునాథ్ నాయక్, హోడ్ కానిస్టేబుల్ నాగరాజు, లేడీ పోలీసు సుజనా, కానిస్టేబుల్స్ మదుసూధన్, పద్మనాథ్, విశ్వనాథ్ లు అధికారులు ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి పనులు చెయ్యడానికి అవకాశం లేకుండా పోయింది. ప్రైవేటు ఉద్యోగాలు చేసినా, వ్యాపారలావాదేవీలు, వడ్డి వ్యాపారాలు తదితర ఎలాంటి పనులు చేసినా శాస్వతంగా ఉద్యోగాలు ఊడిపోతాయని అధికారులు హెచ్చరించారని తెలిసింది. ఉద్యోగాలు చెయ్యకుండా, ముఖాలకు మాస్క్ లు వేసుకోకుండా పార్క్ లో లేడీ కానిస్టేబుల్ తో మీటింగ్ పెట్టిన పోలీసులు సాటి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటానికి ప్రయత్నించారని, వారికి తగిన శాస్తి జరిగిందని ప్రజలు అంటున్నారు.