బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bengaluru riot: పేస్ బుక్ పోస్టు కారణమా ? పక్కా స్కెచ్: హోమ్ మంత్రి, షూట్ చెయ్యాలి, కేంద్ర మంత్రి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ బెళగావి/ ఉడిపి: బెంగళూరు జరిగిన గొడవలకు ఫేస్ బుక్ పోస్టు మాత్రమే కారణమా ?, ఒక్క ఫేస్ బుక్ పోస్టు చేసిన వెంటనే వందల మంది ఒకేసారి గుమికూడి విద్వంసం సృష్టించడానికి, హింసాత్మక సంఘటనలు సృష్టించడానికి అవకాశం ఉందా ? అంటూ కర్ణాటక హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత ఆరు నెలల్లో బెంగళూరులో ఈటైప్ గొడవలు జరగడం ఇది రెండోసారి, ఒక వర్గం వాళ్లే రెండుసార్లు హింసాత్మక సంఘటనలు జరగడానికి కారణం అయ్యారు. బెంగళూరులో ఎలాంటి చిన్న గొడవ జరిగిన జాతీయ స్థాయిలో పెద్ద వార్త అవుతోందని, అందువలనే కొందరు రెచ్చిపోయి సిలికాన్ సిటీకి చెడ్డపేరు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని అనేక మంది నాయకులు అంటున్నారు. బెంగళూరులో వాహనాలు తగలపెట్టి, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేసిన వాళ్లను కాల్చిపారేయాలని, రోడ్లో నెలబెట్టి షూట్ చెయ్యాలని కేంద్ర మంత్రి సురేష్ అంగడి ఆగ్రహాం వ్యక్తం చేశారు.

Bengaluru clash: మేము సినిమా చూడం, మీకు చూపిస్తాం, సీఎం వార్నింగ్, పోలీసులకు ఫుల్ పవర్స్!Bengaluru clash: మేము సినిమా చూడం, మీకు చూపిస్తాం, సీఎం వార్నింగ్, పోలీసులకు ఫుల్ పవర్స్!

ఫేస్ బుక్ పోస్టు పనేనా ?

ఫేస్ బుక్ పోస్టు పనేనా ?

బెంగళూరు జరిగిన గొడవలకు ఫేస్ బుక్ పోస్టు మాత్రమే కారణమా ?, ఒక్క ఫేస్ బుక్ పోస్టు చేసిన వెంటనే వందల మంది ఒకేసారి గుమికూడి విద్వంసం సృష్టించడానికి, హింసాత్మక సంఘటనలు సృష్టించడానికి అవకాశం ఉందా ?, వందల మంది చేతికి ఒకేసారి ఆయుధాలు, పెట్రోల్ ఎలా వచ్చింది, పోలీసు, ప్రైవేటు వాహనాలకు నిప్పంటించమని ఎవరు చెప్పారు ? అంటూ కర్ణాటక హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ బీజేపీ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నవారిని ప్రశ్నించారు.

కరోనా టైమ్ లో రెండోసారి రెచ్చిపోయారు

కరోనా టైమ్ లో రెండోసారి రెచ్చిపోయారు

మూడు నెలల ముందు ఇదే బెంగళూరు సిటీలోని పాదరాయణపురలో కరోనా వైరస్ వ్యాధి సోకిన అనుమానితులను ఆసుపత్రికి తరలించడానికి వెళ్లిన సమయంలో పోలీసులు, ఆరోగ్య శాఖ, బీబీఎంపీ అధికారులు, సిబ్బందిపై స్థానికులు దాడులు చేసి పెద్ద ఎత్తున హింస చెలరేగడానికి కారణం అయ్యారని కర్ణాటక హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ గుర్తు చేశారు. ఇప్పుడు రెండోసారి బెంగళూరులో రెచ్చిపోయారని హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.

 కర్ఫ్యూలో బైక్ ర్యాలీ చేస్తారా ?

కర్ఫ్యూలో బైక్ ర్యాలీ చేస్తారా ?

పాదరాయణపుర అల్లర్లకు కారణం అయిన వారిని అప్పట్లో అరెస్టు చేస్తే వారు బెయిల్ మీద బయటకు వచ్చారు. పాదరాయణపురలో హింసాత్మక సంఘటనలు చేసుకోవడంతో అప్పట్లో రాత్రిపూట కర్ఫ్యూ, పగలు 144 సెక్షన్ అమలు చేశామని, ఆ సమయంలో గొడవలకు కారణం అయిన వాళ్లు బెయిల్ మీద బయటకు వచ్చి బైక్ ర్యాలీలు నిర్వహించారని, పోలీసుల ఆత్మగౌరవానికే వాళ్లు సవాళ్లు విసిరారని, ఇలాంటి సంఘటనలు చూస్తూ మా ప్రభుత్వం (బీజేపీ) ఊరుకోదని కర్ణాటక హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ అల్లరిమూకలను హెచ్చరించారు.

పక్కాప్లాన్ తో చేస్తున్నారు, నోడౌట్

పక్కాప్లాన్ తో చేస్తున్నారు, నోడౌట్

బెంగళూరులో ఎలాంటి చిన్న గొడవ జరిగినా జాతీయ స్థాయిలో పెద్ద వార్త అవుతోందని, ఇలాంటి సిలికాన్ సిటీలో ఏం చేసినా జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని కొందరు పక్కాప్లాన్ తోనే గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని, అలాంటి వాళ్లను చూసిచూడనట్లు వదిలేస్తామని భావిస్తే మీకే నష్టం అంటూ అల్లర్లకు కారణం అయిన వారిని కర్ణాటక హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ హెచ్చరించారు. బెంగళూరు ప్రజలు శాంతిని కోరుకుంటారని, కొందరు కావాలనే రాజకీయ స్వార్థం కోసం ప్రజలకు శాంతి లేకుండా చేస్తున్నారని హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ విచారం వ్యక్తం చేశారు.

 కాల్చిపారేయాలి: కేంద్ర మంత్రి అంగడి

కాల్చిపారేయాలి: కేంద్ర మంత్రి అంగడి

బెంగళూరు సిటీలోని డీజే హళ్ళి (దేవరజీవనహళ్ళి), కేజీ హళ్ళి (కాండుగొండనహళ్ళి)లో అల్లర్లకు కారణం అయిన వారు ఎవరైనా సరే నడిరోడ్డులో నిలబెట్టి కాల్చిపారేయాలని కేంద్ర మంత్రి సురేష్ అంగడి మండిపడ్డారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండటం ఇష్టం లేని కొందరు మీడియా, అమాయకులపై దాడులు చేస్తోందని, ఎలాగైనా బీజేపీ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని పదేపదే బెంగళూరులో గొడవలు సృష్టిస్తున్నారని కేంద్ర మంత్రి సురేష్ అంగడి బెళగావిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Recommended Video

Bengaluru : 60 మంది పోలీసులకి గాయాలు.. ప్రజలు శాంతియుతంగా ఉండాలని పిలుపు!! || Oneindia Telugu
ఆసుపత్రిలో అంబులెన్స్ లకు నిప్పంటిస్తారా !

ఆసుపత్రిలో అంబులెన్స్ లకు నిప్పంటిస్తారా !

పక్కాప్లాన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి ఇంటికి నిప్పంటించారని, పోలీసు వాహనాలు, ప్రైవేటు వాహనాలు, బీమ్స్ ఆసుపత్రి ముందు పార్క్ చేసిన అంబులెన్స్ లకు నిప్పంటించారని కేంద్ర మంత్రి సురేష్ అంగడి ఆరోపించారు. ఇలాంటి దోశద్రోహులను నడిరోడ్డులో నిలబెట్టి కాల్చి చంపినా పాపం లేదని, ఇలాంటి వాళ్లవలన ప్రజలు శాంతియుతంగా జీవించలేరని కేంద్ర మంత్రి సురేష్ అంగడి విచారం వ్యక్తం చేశారు. బెంగళూరు అల్లర్లకు కారణం అయినవారిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు మండిపడుతున్నారు.

English summary
Bengaluru violations: For the second time in six months, a riot was created in Bengaluru. The second time police have been attached. This is cast doubt on the performance of the Home Department. How did the mobsters get so involved? Home Minister Basavaraj Bommai said in a statement that the attack was planned on Facebook. Know more about Bengaluru riot. Central Minister Suresh Angadi Reaction On Bengaluru Violence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X