• search
 • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Drug Case: సంజనాను సంకనాకించిన వార్నింగ్ లెటర్, నో బెయిల్, అయ్యా.... ఆలోచించండి, ఇదీ కథ!

|

బెంగళూరు/ ముంబాయి: డ్రగ్స్ దందా కేసులో అరెస్టు అయ్యి జైల్లో ఉన్న స్యాండిల్ వుడ్ క్వీన్, బహుబాష నటి సంజనా గల్రానీకి సినిమా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి, తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని నటి సంజనా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు వాయిదా వేసింది.

సంజనా మేడమ్ కు బెయిల్ ఇవ్వాలని ఏకంగా కోర్టుకు, బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ కార్యాలయాలకు బాంబులు పెట్టి పేల్చేస్తాం అంటూ బెదిరింపు లేఖలు వచ్చాయని, ఇలాంటి సమయంలో బెయిల్ ఇస్తారా, సంజనాకు, నిందితులకు లింక్ ఏమిటి ? అనే విషయం తేలాలి, అయ్యా ఆలోచించండి అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయమూర్తికి మనవి చేశారు. సంజనాకు బెయిల్ ఇవ్వడానికి పీపీ అభ్యంతరం వ్యక్తం చెయ్యడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.

Video viral: 150 మందిలో రేప్ సీన్, ఎడిటింగ్ లో ఎగిరింది, నెట్ లో ఫర్ సేల్, నటి ఆత్మహత్యాయత్నం!Video viral: 150 మందిలో రేప్ సీన్, ఎడిటింగ్ లో ఎగిరింది, నెట్ లో ఫర్ సేల్, నటి ఆత్మహత్యాయత్నం!

 సంజనా సినిమా 42 డేస్ నాటౌట్

సంజనా సినిమా 42 డేస్ నాటౌట్

బెంగళూరు డ్రగ్స్ దందా కేసులో స్యాండిల్ వుడ్ బ్యూటీ క్వీన్ సంజనా గల్రానీని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సెప్టెంబర్ 8వ తేదీన అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాలతో నటి సంజనాను బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి నటి సంజనా బెయిల్ తీసుకుని జైలు నుంచి బయటకు రావాలని నేటి వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పటికే సంజనా అరెస్టు అయ్యి జైలుకు వెళ్లి 41 రోజులు పూర్తి అయ్యింది. సంజనా కంటే ముందు స్యాండిల్ వుడ్ హనీ బ్యూటీ రాగిణి ద్వివేది కూడా డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యి అదే పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో కాలం గడుపుతూ ఉంది.

కొంప ముంచిన లెటర్

కొంప ముంచిన లెటర్

బెంగళూరులో సిటీ సివిల్ కోర్టులోని CCH 36వ కోర్టుకు సోమవారం కర్ణాటకలోని తుమకూరు జిల్లా నుంచి ఓ పార్శిల్ కవర్ పోస్టులో వచ్చింది. నటి రాగిణి, నటి సంజనాలు అమాయకులు, వాళ్లు ఏ తప్పు చెయ్యలేదు, అనవసరంగా ఇద్దరినీ అరెస్టు చేసి జైల్లో పెట్టారు, వెంటనే వారిద్దరికి బెయిల్ ఇవ్వండి, లేదా బెయిల్ రావడానికి సహకరించండి, ఈ కవర్ లో బాంబు ఉంది జాగ్రత్త ? అంటూ న్యాయమూర్తి జస్టిస్ సీనప్పను బెదిరిస్తూ లేఖ రాయడం కలకలం రేపింది. నిందితులు కోర్టుకు పంపించిన పార్శిల్ కవర్ లో డిటోనేటర్ ఉండటంతో కోర్టు, పోలీసులు సీరియస్ అయ్యారు.

తుమకూరు దెబ్బతో సంజనాకు రివర్స్ గేర్

తుమకూరు దెబ్బతో సంజనాకు రివర్స్ గేర్

కోర్టుకు వార్నింగ్ ఇచ్చిన కేసులో తుమకూరుకు చెందిన రాజశేఖర్, వేదాంత్, శివప్రకాష్, రమేష్ అనే నిందితులను మంగళవారం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుమకూరుకు చెందిన రాజశేఖర్, వేదాంత్, శివప్రకాష్, రమేష్ చాలా దగ్గర బంధువులు. రాజశేఖర్, వేదాంత్, శివప్రకాష్, రమేష్ ల మద్య ఆస్తి పంపకాలలో గొడవలు జరుగుతున్నాయి. వేదాంత్, శివప్రకాష్, రమేష్ లను ఎలాగైనా జైలుకు పంపించాలనే ఉద్దేశంతోనే వారి పేర్లతో రాజశేఖర్ కోర్టును, బెంగళూరు పోలీసు అధికారులను బెదిరిస్తూ లేఖలు రాశాడని పోలీసు అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. అయితే నిందితులను బెంగళూరు తీసుకు వచ్చి ఇంకా విచారణ చేస్తున్నారు.

సిటీ పోలీసు బాస్ కు వార్నింగ్

సిటీ పోలీసు బాస్ కు వార్నింగ్

స్యాండిల్ వుడ్ హీరోయిన్లు రాగిణి, నటి సంజనాల డ్రగ్స్ కేసు విచారణ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కమల్ పంత్, బెంగళూరు జాయింట్ పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్, అడిషనల్ పోలీసు కమిషనర్ కేపీ. రవికుమార్ తదితరులను బెదిరిస్తూ ఓ లేఖ పంపించారు. ఈ కేసుల విచారణ నుంచి తప్పుకోవాలని, నిందితులకు బెయిల్ ఇవ్వకపోతే కమీషనర్ కార్యాలయంలో పోలీసు అధికారుల కార్లలో బాంబులు పెట్టి పేల్చేస్తాం అంటూ బెదిరింపు లేఖలు రావడం కలకలం రేపింది. నిందితులు పోలీసులకు, న్యాయమూర్తులకు లంచాలు ఇస్తామని ఎరవేసి మరో పెద్ద తప్పు చేశారు.

ఇలాంటి టైమ్ లో బెయిల్ కోసం సంజనా

ఇలాంటి టైమ్ లో బెయిల్ కోసం సంజనా

పోలీసు అధికారులకు వచ్చిన బెదిరింపు లేఖల్లో ఎలాంటి పార్శిల్ లేదు. అయితే కోర్టుకు పంపించిన బెదిరింపు లేఖలో డిటోనేటర్ ఉండటం కలకలం రేపింది. ఈ రెండు కేసులు నమోదు చేసిన పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే టైమ్ లో నటి సంజనా తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించింది. ఈ డ్రగ్స్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి నటి సంజనా కోర్టుకు మనవి చేసింది.

అయ్యా..... ఆలోచించండి

అయ్యా..... ఆలోచించండి

కోర్టుకు, బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ కార్యాలయాలకు బాంబు బెదిరింపు లేఖలు వచ్చాయి, ఆ లేఖల్లో నటి సంజనా, రాగిణిలకు బెయిల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సమయంలో సంజనాకు బెయిల్ ఇస్తే పోలీసుల విచారణకు ఆటంకాలు ఎదురౌతాయని, దయచేసి మీరు ఆలోచించాలని, సంజనాకు బెయిల్ మంజూరు చెయ్యకూడదని పబ్లిక్ప్రాసిక్యూటర్ న్యాయమూర్తికి మనవి చేశారు.

  Ragini Dwivedi, Sanjjanaa Galrani Case Update | Oneindia Telugu
  సంజనాను సంకనాకించిన వార్నింగ్ లెటర్

  సంజనాను సంకనాకించిన వార్నింగ్ లెటర్

  నటి సంజనాకు బెయిల్ మంజూరు చెయ్యడానికి పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సంజనా బెయిల్ పిటిషన్ ను బెంగళూరు ప్రత్యేక కోర్టు ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది. బెయిల్ రాకపోవడంతో నటి సంజనా మరోసారి నిరాశకు గురైయ్యింది. మొత్తం మీద కోర్టుకు, పోలీసు అధికారులకు వార్నింగ్ ఇస్తూ లేఖలు రాయడంతో నటి సంజనాకు ఆశలను సంకనాకించేసిందని ఆమె అభిమానులు అంటున్నారు.

  English summary
  Drug Case: Actress Sanjana Galrani's bail application hearing postponed to October 22. Sanjana arrested by CCB on September 08.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X