Drug mafia: మాజీ మాఫీయా డాన్ ఇంట్లో సోదాలు, క్రైమ్ బ్రాంచ్ అదుపులో రాయ్ , డ్రగ్స్ దందాతో లింక్స్!
బెంగళూరు/ ముంబాయి/ న్యూఢిల్లీ: బెంగళూరు డ్రగ్స్ మాఫియా, స్యాండిల్ వుడ్ డ్రగ్ దందా కేసులు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే స్యాండిల్ వుడ్ బ్యూటీ క్వీన్స్ రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ తదితరులు అరెస్టు అయ్యి జైలు పాలైనారు. ఇదే కేసులో ఇప్పుడు మాజీ మాఫియా డాన్ దివంగత ముత్తప్ప రాయ్ కొడుకుపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పంజా విసిరారు.
డ్రగ్స్ మాఫియాతో లింక్ లు పెట్టుకున్నాడని, పోలీసులను, ప్రభుత్వాన్ని మోసం చేశాడని ఆరోపిస్తూ మాజీ మాఫీయా డాన్ ముత్తప్ప రాయ్ కు చెందిన బెంగళూరులోని ఇల్లు, బెంగళూరు సిటీ సమీపంలోని మరో బంగ్లా, ఫామ్ హౌస్ లో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోదాలు చేస్తున్నారు. మాజీ మాఫీయా డాన్ ముత్తప్ప రాయ్ కొడుకు రిక్కీ రాయ్ ని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Boss wife: బాస్ భార్యతో లింక్, పనోడికి ప్రతిరోజూ పండగే, బెడ్ రూమ్, వాష్ రూమ్, 100 వీడియోలతో, పాపం!
రిక్కీ రాయ్ కి క్రైమ్ బ్రాంచ్ నోటీసులు
మాజీ మాఫీయా డాన్ ముత్తప్ప రాయ్ ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ముత్తప్ప రాయ్ కి బెంగళూరు నగర శివార్లలోని బిడిది సమీపంలో కొన్ని ఎకరాల స్థలంలో అతి పెద్ద బంగ్లా ఉంది. ఇదే చోట ముత్తప్ప రాయ్ కుమారుడు రిక్కీ రాయ్ ఉంటున్నాడు. బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రిక్కీ రాయ్ కు నోటీసులు జారీ చేశారు.
క్రైమ్ బ్రాంచ్ ఎంట్రీతో కలకలం
బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో ఇప్పటికే స్యాండిల్ వుడ్ బ్యూటీలు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ, రవిశంకర్, వివేక్ ఖన్నా తదితరులు అరెస్టు అయ్యి జైల్లో ఉన్నారు. ఇదే డ్రగ్స్ కేసులోని మరికొందరు నిందితులు ఇప్పటి వరకు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. బెంగళూరు డ్రగ్స్ దందా కేసుకు సంబంధించి విచారణ చేస్తున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు కోర్టు అనుమతితో ముత్తప్ప రాయ్ కి చెందిన బిడిది సమీపంలోని ఇంటిలో, బెంగళూరులో శ్రీమంతులు నివాసం ఉండే సదాశివనగర్ లోని మరో ఇంటిలో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు.
రాయ్ కి లింక్ లు
బెంగళూరు డ్రగ్స్ మాఫియా, స్యాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యి జైల్లో ఉన్న నిందితులు, తప్పించుకుని తిరుగుతున్న నిందితులతో మాజీ మాఫియా డాన్ ముత్తప్ప రాయ్ కొడుకు రిక్కీ రాయ్ సంబంధాలు పెట్టుకున్నాడని మాకు సమాచారం ఉందని, అందుకే వారి ఇళ్లలో సోదాలు చేశామని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ (CCB) విభాగం జాయింట్ పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ స్పష్టం చేశారు.
రిక్కీ రాయ్ కి ఏం సంబంధం అంటే!
ప్రముఖ పార్టీకి చెందిన దివంగత నాయకుడి కుమారుడు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆ వ్యక్తితో పాటు డ్రగ్స్ దందా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరికి రిక్కీ రాయ్ ఆశ్రయం ఇచ్చాడని, వారు పోలీసులకు చిక్కకుండా ఇతను సహకరిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయని, ఈ కేసులో అరెస్టు అయ్యి జైల్లో ఉన్నవారితో ఇతనికి లింక్ లు ఉన్నాయని, అందుకే సోదాలు చేశామని జాయింట్ పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ అన్నారు.
ఇంకా డిసైడ్ కాలేదు
ప్రస్తుతానికి ముత్తప్ప రాయ్ కొడుకు రిక్కీ రాయ్ కి సంబంధించి అతడు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో సోదాలు మాత్రమే చేస్తున్నామని, రిక్కీ రాయ్ ని ఇంకా అరెస్టు చెయ్యలేదని, అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ జాయింట్ పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ క్లారిటీ ఇచ్చారు. అయితే రిక్కీ రాయ్ ని అరెస్టు చేశారని కొన్ని టీవీ చానల్స్ లో వార్తలు ప్రసారం అయ్యాయి. మైసూరు రోడ్డులో ముత్తప్ప రాయ్ కి చెందిన పెద్ద ఫామ్ హౌస్ ఉంది. ఆ ప్రాంతాన్ని పరిశీలించి విచారణ చెయ్యడానికి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మాజీ మాఫియా డాన్ ముత్తప్ప రాయ్ కొడుకు రిక్కీ రాయ్ ని తీసుకెళ్లారని సమాచారం.