Drug mafia: రాగిణికి ముచ్చటగా మూడురాత్రులు అక్కడే, రానురానుంటూనే, బ్రహ్మా ఏమిటి ఈ ఖర్మ!
బెంగళూరు/ ముంబాయి: డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయ్యి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న స్యాండిల్ వుడ్ బ్యూటీ, హనీ రాగిణి ద్వివేదికి మరోసారి చుక్కెదురైయ్యింది. తనకు డ్రగ్స్ గురించి ఏపాపం తెలీదని, బెయిల్ మంజూరు చెయ్యాలని నటి రాగిణి పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. రాగిణికి బెయిల్ ఇవ్వరాదని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గట్టిగా వాదించడంతో ఆమె బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. బెయిల్ రాకపోవడంతో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న నటి రాగిణి ద్వివేది కన్నీరు పెట్టుకుంటున్నదని తెలిసింది. బ్రాహ్మా ఏమిటి నాకు ఈ ఖర్మ అంటూ రాగిణి ఆవేదన చెందుతోందని సమాచారం.
Drugs racket: కంగనాకు షాక్, డ్రగ్స్ లింక్ పై విచారణ, సోనియా గాంధీని సీన్ లోకి లాగిన క్వీన్ !

బెయిల్ ఇస్తే ఇదే జరిగేది !
డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయిన స్యాండిల్ వుడ్ బ్యూటీ క్వీన్ తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని బుధవారం బెంగళూరులోని ప్రత్యేక కోర్టుకు మనవి చేశారు. డ్రగ్స్ కేసు విచారణలో ఉందని, ఇలాంటి సమయంలో నటి రాగిణికి బెయిల్ మంజూరు చేస్తే ఆమె జైలు నుంచి బయటకు వచ్చి సాక్షుల మీద, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ప్రభావం చూపిస్తుందని, దయచేసి బెయిల్ ఇవ్వకూడదని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు మనవి చేశారు.

మరో మూడు రోజులు గోవిందా గోవింద
నటి రాగిణి ద్వివేదికి బెయిల్ ఇవ్వకూడదని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోర్టుకు మనవి చేశారు. వాదనలు విన్న బెంగళూరు ప్రత్యేక కోర్టు నటి రాగిణికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించి విచారణ ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉంటున్న నటి రాగిణి ద్వివేది తనకు బెయిల్ రాలేదని తెలుసుకుని బోరన విలపిస్తున్నదని తెలిసింది.

పోలీసుల విచారణ పూర్తి ?
డ్రగ్స్ మాఫియాతో లింక్ పెట్టుకున్న స్యాండిల్ వుడ్ బ్యూటీ క్వీన్ రాగిణి ద్వివేదిని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. రాగిణి ద్వివేదిని 14 రోజుల పాటు రిమాండ్ కు తరలించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు రాగిణిని బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు.

హీరోయిన్ రాగిణికి ఎడాపెడా ఎదురుదెబ్బలు
నటి రాగిణి ద్వివేదికి అనారోగ్యంగా ఉందని, ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందడానికి అవకాశం ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాదులు కోర్టులో మనవి చేసినా కోర్టు అందుకు అంగీకరించలేదు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఆసుపత్రి ఉందని, నటి రాగిణి అక్కడ చికిత్స పొందవచ్చని కోర్టు సూచించింది. బయట నుంచి భోజనం తెప్పించుకోవడానికి నటి రాగిణి ప్రయత్నించింది. బయట కరోనా వైరస్ తాండవం చేస్తోంది, బయట నుంచి భోజనం తెప్పించుకోవడానికి తాము అనుమతి ఇవ్వమని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు స్యాండిల్ వుడ్ బ్యూటీ రాగిణి ద్వివేది కోరిక మీద నీళ్లు చల్లారు.

బ్రహ్మా ఏమిటి నాకు ఈ ఖర్మ !
పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో తయారు చేసిన భోజనం నటి రాగిణికి అందిస్తున్నారు. ఇంతకాలం ఏ వంటలు కావాంటే ఆవంటలు చేయించుకుని ఎడాపెడా ఆరగించిన నటి రాగిణి ద్వివేది డ్రగ్స్ కేసు దెబ్బకు జైల్లో చిప్పకూడు తినాల్సివచ్చింది. పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో రాత్రిపూట నిద్రపట్టక నటి రాగిణి రాత్రి పూర్తిగా జాగారం చేస్తోందని ఆమె సన్నిహితులు అంటున్నారు. మొత్తం మీద మరోమూడు రాత్రులు నటి రాగిణి బెంగళూరు సెంట్రల్ జైల్లోనే కాలం గడపాల్సి వస్తొంది.