బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Drug Mafia: రియా చక్రవర్తి దారిలో బ్యూటీ సంజనా, బెయిల్ కోసం హైకోర్టులో అర్జీ, జైల్లో పాపం హీరోయిన్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ ముంబాయి: బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయిన బహూబాష నటి, స్యాండిల్ వుడ్ బ్యూటీ సంజనా గల్రానీ బెయిల్ కోసం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యి జైల్లో కాలం గడుపుతున్న సంజనాకు బెయిల్ ఇవ్వడానికి ప్రత్యేక కోర్టు నిరాకరించింది. బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి ఎలా పై కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకుని జైలు నుంచి విడుదలై ఇంటికి వెళ్లిందో అలాగే తాను జైలు నుంచి బయటకు రావాలని నటి సంజనా డిసైడ్ అయ్యింది. ప్రత్యేక కోర్టులో తనకు బెయిల్ రాదని భావించిన ప్రముఖ హీరోయిన్ సంజనా గల్రానీ శుక్రవారం బెంగళూరులోని కర్ణాటకలో హైకోర్టులో బెయిల్ కోసం అర్జీ సమర్పించింది.

Khiladi wife: కొవ్వు కరిగించాలని భార్య జిమ్ కు, జిమ్ మాస్టర్ కు ఫ్రూట్ జ్యూస్, భర్తకు ఖాళీ గ్లాస్!Khiladi wife: కొవ్వు కరిగించాలని భార్య జిమ్ కు, జిమ్ మాస్టర్ కు ఫ్రూట్ జ్యూస్, భర్తకు ఖాళీ గ్లాస్!

 సంజనా దిమ్మతిరిగిపోయింది

సంజనా దిమ్మతిరిగిపోయింది

బెంగళూరు డ్రగ్స్ మాఫియా దెబ్బకు స్యాండిల్ వుడ్ సెలబ్రిటీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బహుబాష నటి రాగిణి ద్వివేదిని అరెస్టు చేసిన బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (CCB) మరో బ్యూటీ క్వీన్, బహుబాష నటి సంజనా గల్రానీ అలియాస్ సంజనాకు వెంటనే0 షాక్ ఇచ్చారు. సెప్టెంబర్ 8వ తేదీ బెంగళూరులోని ఇందిరానగర్ లోని సంజనా ఫ్లాట్ లోకి ఎంట్రీ ఇచ్చిన సీసీబీ పోలీసులు ఆమె మొబైల్ ఫోన్లు సీజ్ చేసి ఆమె బీఎంబడ్ల్యూ కారు స్వాధీనం చేసుకుని ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేసి తరువాత అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన వీరేష్ ఖన్నా, రాహుల్ ఇచ్చిన సమాచారం మేరకు కోర్టు అనుమతితో నటి సంజనాకు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు.

 దేవుడు వరం ఇచ్చినా పూజారి కరుణించలేదు

దేవుడు వరం ఇచ్చినా పూజారి కరుణించలేదు

బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యూటీక్వీన్ సంజనా గల్రానీ తాను ఏ తప్పు చెయ్యలేదని, తనకు డ్రగ్స్ దందాకు ఎలాంటి సంబంధం లేదని పోలీసుల విచారణలో చెప్పింది. బెంగళూరులో డ్రగ్స్ కేసు అనేక మలుపులు తిరిగింది. ఐదు రోజుల పాటు సంజనాను విచారణ చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు పంపించారు.

 వీరేన్ ఖన్నా ఎఫెక్ట్ !

వీరేన్ ఖన్నా ఎఫెక్ట్ !

డ్రగ్స్ మాఫియా కేసుకు సంబంధించి వీరేన్ ఖన్నా అనే వ్యాపారిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ, బెంగళూరులోని వీరేన్ ఖన్నా ఇంటిలో పోలీసులు కొన్ని సాక్షాలు సేకరించారు. ఇదే సమయంలో నటి సంజనా క్లోజ్ ఫ్రెండ్ రాహుల్ ను అరెస్టు చేశారు. రాహుల్, వీరేన్ ఖన్నా ఇచ్చిన సమాచారం మేరకు నటి సంజనా జైలుపాలైనారని తెలిసింది.

 ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన సంజనా

ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన సంజనా

సంజనా జైలుకు వెళ్లకముందు మీడియా మీద తీవ్రస్థాయిలో శివతాండవం చేసింది. స్యాండిల్ వుడ్ కు డ్రగ్స్ దందాకు సంబంధం ఉందని మీరు చెప్పకండి, అన్నీ మీరే ఊహించుకుంటున్నారు, డ్రగ్స్ దందాలో నన్ను లాగకండి మీకు దండం పెడుతాను అంటూ హీరోయిన్ సంజనా మీడియాకు మనవి చేసింది. డ్రగ్స్ దందాకు తనకు సంబంధం ఉందని మీరు పదేపదే ప్రశ్నిస్తే తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటా అంటూ హీరోయిన్ సంజనా మీడియాను బెదిరించింది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను సైతం ఇలాగే ప్రశ్నలతో వేధింపులకు గురి చెయ్యడంతో అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని సంజనా జైలుకు వెళ్లకముందు ఆరోపణలు చేసింది. సుశాంత్ సింగ్ కు పట్టిన గతే నాకు పట్టాలని మీరు కోరుకుంటున్నారా ? అంటూ ఆ సందర్బంలో నటి సంజనా మీడియాపై ఎదురుదాడికి దిగింది.

 సెప్టెంబర్ 16 తేదీ జైల్లోకి ఎంట్రీ

సెప్టెంబర్ 16 తేదీ జైల్లోకి ఎంట్రీ

బెంగళూరు డ్రగ్స్ దందా కేసులో అరెస్టు అయిన నటి సంజనా గల్రానీకి బెయిల్ మంజూరు కాకపోవడంతో సెప్టెంబర్ 16వ తేదీ నుంచి పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉంటున్నది. అప్పటి నుంచి అనేకసార్లు నటి సంజనా బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సెప్టెంబర్ 28వ తేదీన మరోసారి బెంగళూరులోని ఎన్ టీపీఎస్ ప్రత్యేక కోర్టు నటి సంజనాతో పాటు మరో నటి రాగిణి ద్వివేదికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఎన్ టీపీఎస్ కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో శుక్రవారం నటి సంజనా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది.

 ఈడీ అధికారుల విచారణ

ఈడీ అధికారుల విచారణ

బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన నటి రాగిణి, సంజనాలకు అనేక కష్టాలు ఎదరైనాయి. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న నటి సంజనా, రాగిణిని ఈడీ అధికారులు అదే జైల్లోనే ఐదు రోజుల పాటు విచారణ చేసి వివరాలు సేకరించారు. సినిమాల్లో నటిస్తూ వీరు ఎంత డబ్బు, ఆస్తులు సంపాధించారు ? డ్రగ్స్ దందాతో లింక్ లు పెట్టుకుని అక్రమంగా ఏమైనా ఆస్తులు సంపాధించారా ? అనే కోణంలో ఇటీవల ఐదు రోజుల పాటు ఈడీ అధికారులు సంజనా గల్రానీ, రాగిణి ద్వివేదిలను విచారణ చేసి వివరాలు సేకరించారు.

English summary
Drug Mafia: Sanjana Galrani has moved the Karnataka high court seeking bail in connection with the drug case. A special Narcotics Drugs and Psychotropic Substances (NDPS) court rejected the bail application.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X