బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Drugs case: సుప్రీం కోర్టును ఆశ్రయించిన బ్యూటీ రాగిణి, ఏం చేసినా లాభం లేదని చివరి ప్రయత్నం, పాపం!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ న్యూఢిల్లీ: బెంగళూరు డ్రగ్స్ కేసులో చిక్కుకుని సెంట్రల్ జైలుపాలైన స్యాండిల్ వుడ్ బ్యూటీ రాగిణి అలియాస్ రాగిణి ద్వివేది ఇక లాభం లేదని చివరి ప్రయత్నంగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ప్రత్యేక కోర్టులు, కర్ణాటక హైకోర్టులో బెయిల్ మంజూరు కాకపోవడంతో ఎలాగైనా జైలు నుంచి బయటకు రావాలని రాగిణి ఇప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రాగిణి డ్రగ్స్ సేవించినట్లు, డ్రగ్స్ సరఫరా చేసేవారితో ఆమెకు లింక్ ఉన్నట్లు మా దగ్గర సాక్షాలు ఉన్నాయని ఇంతకాలం వాదిస్తూ వచ్చిన బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సుప్రీం కోర్టులో రాగిణికి బెయిల్ మంజూరు కాకుండా కౌంటర్ వేసే అవకాశం ఉందని తెలిసింది.

Beautiful wife: ఎవరు వాళ్లు ? ఎందుకొస్తున్నారు ?, భార్య గొంతు ఉల్లిపాయ కోసినట్లు కోసేసిన భర్త!Beautiful wife: ఎవరు వాళ్లు ? ఎందుకొస్తున్నారు ?, భార్య గొంతు ఉల్లిపాయ కోసినట్లు కోసేసిన భర్త!

ఆ రోజు రాగిణి టైమ్ బ్యాడ్

ఆ రోజు రాగిణి టైమ్ బ్యాడ్

బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో బహుబాష నటి, స్యాండిల్ వుడ్ హనీ బేబి రాగిణిని సెప్టెంబర్ 4వ తేదీన బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (CCB) అరెస్టు చేశారు. బెంగళూరు నగర శివార్లలోని యలహంకలోని రాగిణి ఇంటిలో సోదాలు చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమె మొబైల్ ఫోన్ లు సీజ్ చేశారు. రాగిణి బెడ్ రూమ్ లో పోలీసులు గంజాయితో నింపిన సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ రోజు నుంచి రాగిణిద్వివేదిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అనేకసార్లు విచారణ చేశారు.

అప్పుడే బెయిల్ కోసం ప్రయత్నం

అప్పుడే బెయిల్ కోసం ప్రయత్నం

సెప్టెంబర్ 14వ తేదీ నటి రాగిణి ద్వివేది పోలీసు కస్టడీ గడుపు పూర్తి కావడంతో ఆమెను బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు పంపించారు. తరువాత ఈ డ్రగ్స్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను అమాయకురాలు, తనకు బెయిల్ మంజూరు చెయ్యాలి అంటూ రాగిణి ఆమె తరపు న్యాయవాదులతో బెంగళూరులోని ఎన్ డీపీఎస్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. నటి రాగిణికి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని, ఆమె డ్రగ్స్ సేవించినట్లు మా దగ్గర సాక్షాలు ఉన్నాయని, ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని, ఆమెకు బెయిల్ మంజూరు చెయ్యకూడదని బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోర్టులో మనవి చేశారు.

ఏపాపం తెలీదు..... డ్రగ్స్ అంటేనే తెలీదు

ఏపాపం తెలీదు..... డ్రగ్స్ అంటేనే తెలీదు

నాకు ఏపాపం తెలీదు, ఈ డ్రగ్స్ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నాకు బెయిల్ ఇవ్వండి అంటూ రాగిణి కోర్టును ఆశ్రయించింది. అయితే రాగిణికి ఈ పాపంతో సంబంధం ఉంది, బెయిల్ ఇవ్వకండి అంటూ బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బెంగళూరు ప్రత్యేక కోర్టుకు మనవి చేశారు. రాగిణికి బెయిల్ ఇవ్వడానికి ప్రత్యేక కోర్టు నిరాకరించింది. అప్పటి నుంచి రాగిణ ద్వివేది బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకే పరిమితం అయ్యింది.

హైకోర్టులో ఎదురుదెబ్బ

హైకోర్టులో ఎదురుదెబ్బ

బెంగళూరు డ్రగ్స్ కేసులో స్యాండిల్ వుడ్ హీరోయిన్ రాగిణితో పాటు బహుబాష నటి సంజనా కూడా అరెస్టు అయ్యింది. నటి రాగిణికి బెయిల్ ఇవ్వడానికి ప్రత్యేక కోర్టు నిరాకరించడంతో ఆమె కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. రాగిణితో పాటు సంజనా, ఇదే కేసులో అరెస్టు అయిన కొందరు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. నవంబర్ 3వ తేదీన రాగిణికి బెయిల్ ఇవ్వడానికి కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. బెంగళూరు డ్రగ్స్ కేసులో ఏ ఒక్కరికి ఇంత వరకు బెయిల్ మంజూరు కాలేదు. దసరా, దీపావళి పండగ కూడా స్యాండిల్ వుడ్ బ్యూటీలు సంజనా, రాగిణిలను సెంట్రల్ జైల్లోనే జరిగిపోయింది.

 రాగిణి @ 30 years?

రాగిణి @ 30 years?

స్యాండిల్ వుడ్ హీరోయిన్ నటి రాగిణి ద్వివేది (30)కి బెయిల్ మంజూరు చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రాగిణికి 30 ఏళ్లు అని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు. డ్రగ్స్ కేసుకు, రాగిణి ఎలాంటి సంబంధం లేదని, ఆమెను కావాలనే కొందరు ఈ కేసులో ఇరికించారని, ఆమెకు బెయిల్ మంజూరు చెయ్యాలని కుటుంబ సభ్యులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 4వ తేదీకి రాగిణి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది.

బెయిల్ కోసం క్యూ

బెయిల్ కోసం క్యూ

ఇంతకాలం డ్రగ్స్ కేసుతో రాగిణికి సంబంధాలు ఉన్నాయని చెబుతూ వస్తున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సుప్రీం కోర్టులో ఎలాంటి పిటిషన్ దాఖలు చేస్తారో ? అని విషయం వేచి చూడాలి. అయితే డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన సంజనా గల్రాని కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. రాగిణి, సంజనాలకు బెయిల్ వస్తే ఈ కేసులో అరెస్టు అయిన మిగిలిన నిందితులు కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించడానికి సిద్దం అవుతున్నారని తెలిసింది.

English summary
Drugs case: Actress Ragini Dwivedi field special leave petition (SLP) in Supreme Court challenging Karnataka high court order that rejected her bail petition. Ragini Dwivedi arrested by the Bengaluru CCB police in drugs case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X