బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కట్టలు తెంచుకున్న ఉద్యోగుల ఆగ్రహం.. మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌పై దాడి..పెను విధ్వంసం..

|
Google Oneindia TeluguNews

ఆ కంపెనీ ఉద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.. నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించట్లేదన్న కారణంతో ఒక్కసారిగా వందల మంది ఉద్యోగులు తిరగబడ్డారు. కర్రలు,రాడ్లతో కంపెనీ అద్దాలు,ఫర్నీచర్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. కంపెనీ వాహనాలకు నిప్పు పెట్టారు. కంపెనీ నేమ్ బోర్డును కూడా తగలబెట్టారు. ఒకరకంగా అక్కడ పెను విధ్వంసమే సృష్టించారు. కర్ణాటక కోలార్ జిల్లాలోని నర్సాపురలో ఉన్న విస్ట్రాన్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌లో జరిగిన ఈ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది.

అసలేం జరిగింది...

అసలేం జరిగింది...

తైవాన్‌కి చెందిన విస్ట్రాన్ కంపెనీ ఐఫోన్ విడి భాగాలను తయారుచేస్తుంది. నర్సాపురలో ఉన్న విస్ట్రాన్ ప్లాంట్‌లో వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గత 4 నెలలుగా సంస్థ వీరికి వేతనాలు చెల్లించట్లేదు. దీనిపై ఎన్నిసార్లు యాజమాన్యంతో మాట్లాడిన లాభం లేకపోయింది. ఈ నేపథ్యంలో శనివారం(డిసెంబర్ 12) కంపెనీ ఉద్యోగులంతా ప్లాంట్ ముందు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో కంపెనీ ప్రతినిధులు ఉద్యోగులతో మాట్లాడే ప్రయత్నం చేయగా ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఉద్యోగులు కర్రలు,రాడ్లతో ప్లాంట్‌ను ధ్వంసం చేశారు. కంపెనీ వాహనాలకు నిప్పు పెట్టారు.

దాడిని ఖండించిన డిప్యూటీ సీఎం...

దాడిని ఖండించిన డిప్యూటీ సీఎం...

ఘటనపై సమాచారం అందగానే పోలీసులు అక్కడికి చేరుకుని ఉద్యోగులపై లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు సమాచారం. కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వత్ నారాయణ్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. సమస్యల పరిష్కారానికి వేదికలున్నాయని... చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. విస్ట్రాన్ ప్లాంట్ రాజేష్ ఈ ఘటనపై మాట్లాడుతూ... ఉద్యోగులంతా తెల్లవారుజామున 5.30గం. సమయంలో ఒకచోట చేరినట్లు చెప్పాడు. కొంతమంది తమకు నెలల తరబడి వేతనాలు రావట్లేదని,మరికొంత మంది వేతనాలు సకాలంలో చెల్లించట్లేదని,ఇంకొందరు సరైన వేతనం చెల్లించట్లేదని.. ఇలా రకరకాలుగా చర్చించుకున్నట్లు తెలిపాడు. చివరకు అంతా కలిసి ప్లాంట్‌పై దాడికి పాల్పడ్డారని చెప్పాడు.

అన్యాయం జరుగుతోందంటున్న ఉద్యోగులు..


కొంతమంది ఉద్యోగులు మాట్లాడుతూ... ప్లాంట్‌లో తమతో ప్రతీరోజూ 12గంటలు పనిచేయించుకుంటున్నారని చెప్పారు. అయితే రికార్డుల్లో మాత్రం 7-8గంటలు మాత్రమే పనిచేస్తున్నట్లు పేర్కొంటున్నారని తెలిపారు. 12గంటలు పనిచేస్తే తమకు ఇచ్చేది రూ.200-రూ.300 మాత్రమే అన్నారు. అది కూడా సకాలంలో ఇవ్వట్లేదని... 4 నెలల నుంచి వేతనాలు ఇవ్వడమే మానేశారని ఆరోపించారు.ఓ కార్మిక సంఘం నాయకుడు ఈ ఘటనపై మాట్లాడుతూ.. విస్ట్రాన్‌ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌లో పనిచేస్తున్నవారిలో ఎక్కువమంది కాంట్రాక్టు ఉద్యోగులేనని చెప్పారు. వారికి సకాలంలో వేతనాలు చెల్లించట్లేదని... పైగా ఏవేవో కారణాలతో ఎక్కువగా కోతలు పెడుతున్నారని చెప్పారు.

English summary
Violence broke out at a Taiwanese technology giant's plant near Bengaluru after some employees, reportedly angry over salaries, vandalised the facility's premises today morning. While the company, Wistron Corporation, is yet to respond to incident, the Karnataka government strongly condemned it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X