Family: భార్య మీద అనుమానం, రోజూ టార్చర్, అర్దరాత్రి మద్యం మత్తులో భర్త ?, ఆసుపత్రిలో డ్రామాలు!
బెంగళూరు/మంగళూరు: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భార్య మీద అనుమానం పెంచుకున్న భర్త మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. మద్యం మత్తులో ఇంటికి వెలుతున్న భర్త అతని భార్యను పట్టుకుని చితకబాదుతున్నాడు. ఎప్పుడుపడితే అప్పుడు మద్యం సేవించి ఇంటికి వెలుతున్న భర్త చేతికి ఏదిచిక్కితే అది తీసుకుని భార్య మీద దాడి చేస్తున్నాడు.
రాత్రి మద్యం మత్తులో వెళ్లిన భర్త మొద్దుబారిన వస్తువుతో భార్య తల మీద దాడి చేశాడు. తన భార్య విషం తాగి కిందపడటంతో తీవ్రగాయాలైనాయని కొన్ని గంటల తరువాత భర్త ఆమెను ఆసుపత్రిలో చేర్పించాడు. చికిత్స విఫలమై భార్య చనిపోయింది. పోలీసుల విచారణలో మ్యాటర్ మొత్తం బయటకు రావడంతో భర్తకు సినిమా కనపడుతోంది.
Khiladi wife: ఉద్యోగం చేస్తున్న చోట భార్యకు ప్రియుడు, ఇంట్లో శవమైన మొగుడు, ఫోన్ కాల్స్ దెబ్బతో!

20 ఏళ్ల క్రితం పెళ్లి
కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని ఉళ్లాలలో జోసెఫ్ ఫ్రాన్సిస్ (54) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 20 ఏళ్ల క్రితం జోసెఫ్ ప్రాన్సిస్ కుటుంబ సభ్యులు సెట్ చేసిన సైమా (44) అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. జోసెఫ్ ఫ్రాన్సిస్, సైమా దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు.

భార్య మీద అనుమానం
కొన్ని సంవత్సరాల నుంచి జోసెఫ్ ఫ్రాన్సిస్, సైమా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భార్య సైమా మీద అనుమానం పెంచుకున్న జోసెఫ్ ప్రాన్సిస్ మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. మద్యం మత్తులో ఇంటికి వెలుతున్న జోసెఫ్ అతని భార్య సైమాను పట్టుకుని చితకబాదుతున్నాడు.

మద్యం మత్తులో ఆవేశంలో చితకబాదేశాడు
ఎప్పుడుపడితే అప్పుడు మద్యం సేవించి ఇంటికి వెలుతున్న జోసెఫ్ చేతికి ఏదిచిక్కితే అది తీసుకుని అతని భార్య సైమా మీద దాడి చేస్తున్నాడు. కుటుంబ సభ్యులు, బంధువులు బుద్దిమాటలు చెప్పినా జోసెఫ్ మాత్రం పద్దతి మార్చుకోలేదు. రాత్రి పీకలదాక మద్యం సేవించి లిక్కర్ మత్తులో ఇంటికి వెళ్లిన జోసెఫ్ మొద్దుబారిన వస్తువుతో అతని భార్య సైమా తల మీద దాడి చేశాడు.

భార్య విషం తాగిందని డ్రామాలు.... భర్తకు సినిమా చూపించిన పోలీసులు
తన భార్య సైమా విషం తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించి కిందపడటంతో తీవ్రగాయాలైనాయని కొన్ని గంటల తరువాత జోసెఫ్ ఆమెను ఆసుపత్రిలో చేర్పించాడు. చికిత్స విఫలమై సైమా చనిపోయింది. పోలీసుల విచారణలో జోసెఫ్ అతని భార్య సైమాను చంపేశాడు అనే మ్యాటర్ వెలుగు చూసింది. జోసెఫ్ ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచి న్యాయమూర్తి అనుమతితో అతన్ని కస్టడీకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. జోసెఫ్ అసలు మ్యాటర్ బయటకు రావడంతో అతనికి సినిమా కనపడుతోంది.