బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Farmers protest: లీడర్స్ రచ్చరచ్చ, మోదీ పలావ్ చేసి పంచేశారు, రెడ్డి ఫైర్, అరెస్టు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్నదాతల వ్యక్తం చేసిన నిరసన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వివాదాస్పదమైన మూడు వ్యవసాయ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా చేపట్టిన నిరసన కార్యక్రమం రసవత్తరంగా మారింది.

కేంద్ర ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ బెంగళూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చెయ్యడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. 'మోదీ పలావ్ ' తయారు చేసిన కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ప్రజలకు ఫ్రీగా పంచిపెట్టి కేంద్ర ప్రభుత్వం తీరు పలావ్ లాగా ఉందని ఎద్దేవచేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బెంగళూరులో పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ను పోలీసులు అరెస్టు చేశారు.

Friends: ఒకే రూమ్ లో లేడీ పోలీస్, కానిస్టేబుల్, అదే పనేనా, 22 ఏళ్లకు హైకోర్టు సంచలన తీర్పు!Friends: ఒకే రూమ్ లో లేడీ పోలీస్, కానిస్టేబుల్, అదే పనేనా, 22 ఏళ్లకు హైకోర్టు సంచలన తీర్పు!

రామలింగా రెడ్డి

రామలింగా రెడ్డి

కర్ణాటక మాజీ మంత్రి, బెంగళూరు సిటీలోని బీటీఎం లేఔట్ నియోజక వర్గం ఎమ్మెల్యే, కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామలింగా రెడ్డి ఆధ్వర్యంలో బెంగళూరులోని గాంధీభవన్ ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ లీడర్స్ డిమాండ్ చేశారు.

మోదీ పలావ్ చేసిన కాంగ్రెస్ లీడర్స్

మోదీ పలావ్ చేసిన కాంగ్రెస్ లీడర్స్

మోదీ హఠావో దేశ్ బచావో, బీజేపీ డౌన్ డౌన్, నరేంద్ర మోదీ డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ నినాదాలు చేశారు. గాంధీ భవన్ ముందు వంట పాత్రలు పెట్టి అక్కడే పలావ్ తయారు చేసిన రామలింగా రెడ్డి తదితరులు ఆ పలావ్ కు మోదీ పలావ్ అని నామకరణం చేసి అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు అటు వైపు సంచరిస్తున్న ప్రజలకు ఫ్రీగా పంచిపెట్టారు.

మోదీ, అమిత్ షా, నిర్మలమ్మ ఫోటోలు

మోదీ, అమిత్ షా, నిర్మలమ్మ ఫోటోలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి హోమ్ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ వ్యంగ చిత్రాలు, ఫోటోలు తయారు చేసి నిరసన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో అన్నదాలతో పాటు సామాన్య ప్రజలు జీవితాలు నాశనం అవుతున్నాయని కర్ణాటక మాజీ మంత్రి రామలింగా రెడ్డి ఆరోపించారు.

ఎగిసిపడుతున్న పెట్రోల్, గ్యాస్ ధరలు

ఎగిసిపడుతున్న పెట్రోల్, గ్యాస్ ధరలు

కేంద్రంలో యూపీఏ సర్కారు అధికారంలో ఉన్న సమయంలో భారతదేశంలో పెట్రోల్ ధర లీటర్ రూ. 65, గ్యాస్ ధర రూ. 350 ఉందని మాజీ మంత్రి రామలింగా రెడ్డి గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతినిత్యం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, ప్రస్తుతం వాటి ధరలు ఎంత ఉన్నాయో ఇప్పుడు తాను కొత్తగా ప్రజలకు చెప్పనవసరం లేదని మాజీ మంత్రి రామలింగా రెడ్డి ఎద్దేవ చేశారు.

కాంగ్రెస్ లీడర్స్ ఫైర్..... అరెస్టు

కాంగ్రెస్ లీడర్స్ ఫైర్..... అరెస్టు

కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేసిన కొత్త వ్యవసాయ చట్టాలు ఉపసంహరించుకునే వరకు తాము రైతులకు మద్దతు తెలుపుతూ ఇలాగే నిరసనలు వ్యక్తం చేస్తామని, వెంటనే కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ లీడర్స్ డిమాండ్ చేశారు. చక్కా జామ్ కు మద్దతుగా బెంగళూరులోని యలహంక పోలీస్ స్టేషన్ ముందు భాగంలో, నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనకు దిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

English summary
Farmers protest: Police detained agitators who were protesting outside bengaluru Yelahanka police station against farm laws.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X