Girl: ఇంటి ముందే కూతుర్ని నరికి చంపిన తండ్రి, ఏం జరిగిందో ?, దర్జాగా చెక్కేసేశాడు!
బెంగళూరు/ రాయచూరు: కని పెంచిన కన్నతండ్రి చేతిలో దారుణ హత్యకు గురౌతానని ఆ అమ్మాయి అసలు ఊహించి ఉండదు. అమ్మాయి ఇంటి ముందు పని చేసుకుంటోంది. బయట నుంచి వచ్చిన తండ్రి కూతురిని చూసిన వెంటనే రగిలిపోయాడు. ఇంటి ముందు పని చేసుకుంటున్న కూతురిని దారుణంగా నరికి చంపేసిన తండ్రి దర్జాగా అక్కడి నుంచి వెళ్లిపోవడం కలకలం రేపింది.
Wife: నా మొగుడు పచ్చి కామాంధుడు, నేను తట్టుకోలేను, కోడిపులుసు టెక్నిక్‌తో చంపేసిన భార్య!
భార్య, కూతురు
కర్ణాటకలోని రాయచూరు జిల్లా లింగసనూరు తాలుకా యరజంతి ప్రాంతంలో తిమ్మయ్య అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. తిమ్మయ్యకు భార్య రాజమ్మ, మోనమ్మ (14) అనే కుమార్తె ఉంది. సోమవారం ఉదయం తిమ్మయ్య, రాజమ్మ పని మీద బయటకు వెళ్లారు. ఇంట్లో కుమార్తె మోనమ్మ ఉంది.
ఒక్కడే వెళ్లాడు
తల్లిదండ్రులు బయటకు వెళ్లడంతో కొంత సేపు ఇంట్లో ఉన్న మోనమ్మ తరువాత వంట చేసిన పాత్రలు శుభ్రం చెయ్యడానికి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇంటి ముందు పాత్రలు పెట్టుకుని మోనమ్మ వాటిని శుభ్రం చేస్తోంది. అదే సమయంలో మోనమ్మ తండ్రి తిమ్మయ్య ఒక్కడే ఇంటికి వెళ్లాడు.
కూతుర్ని నరికి చంపేసిన తండ్రి
ఇంటి ముందు మోనమ్మ తలవంచుకుని పాత్రలు శుభ్రం చేసుకుంటోంది. అదే సమయంలో ఇంటి లోపల నుంచి పదునైన కొడవలి తీసుకుని వచ్చిన తిమ్మయ్య తలవంచుకుని తన పని తాను చేసుకుంటున్న కూతురు మోనమ్మను అతి కిరాతకంగా నరికి చంపేసి అక్కడి నుంచి దర్జాగా వెళ్లిపోయాడు.
దర్జాగా చెక్కేశాడు
కన్న తండ్రి కుమార్తెను దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది. అయితే కూతురిని తిమ్మయ్య అంత దారుణంగా ఎందుకు చంపాడో తెలియడం లేదని లింగసనూరు పోలీసులు అంటున్నారు. తిమ్మయ్య కోసం గాలిస్తున్నామని, అతను చిక్కితే అసలు విషయం తెలుస్తోందని లింగసనూరు పోలీసులు తెలిపారు.