Girlfriend: అక్క మొగుడితో మరదలు, ఫస్ట్ ఎస్కేప్, ఎంజాయ్, కట్ చేస్తే కిడ్నాప్, లేడీ రివర్స్ తో!
బెంగళూరు: కుటుంబ సభ్యులు సెట్ చేసిన యువతిని వివాహం చేసుకున్న భర్త అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యాపారం చేస్తున్న భర్త డబ్బులు బాగా సంపాధిస్తున్నాడు. భార్యతో కలిసి అత్తారింటికి వెళ్లి వస్తున్న భర్తకు అతని మరదలి మీద కన్నుపడింది. అక్క మొగుడితో ఎక్కువ చనువు పెంచుకున్న యువతి ఆమె బావతో రాసుకునిపూసుకుని తిరిగింది. పెళ్లి వయసుకు వచ్చిన కత్తిలాంటి మరదలు మీద ముందు నుంచి మోజు పడుతున్న బావ ఆమెను వలలో వేసుకున్నాడు.
అక్క మొగుడితో ప్రేమలో పడిన మరదలు అతనితో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగింది. విషయం తెలుసుకున్న భార్య ఆమె భర్తను, చెల్లిని మందలించింది. కొంతకాలం క్రితం భర్త అతని భార్యకు హ్యాండ్ ఇచ్చి మరదలిని లేపుకుని వెళ్లిపోయి పెళ్లి కాకుండానే వేరే ప్రాంతంలో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టారు. కొంతకాలం తరువాత బావను, అతని మరదలిని పట్టుకుని వచ్చి రాజీ పంచాయితీలు చేసిన పెద్దలు నీ కారణంగా నీ అక్క జీవితం నాశనం అవుతోందని, ఇద్దరు పిల్లలు అనాథలు అవుతారని చెల్లెలికి బుద్దిమాటలు చెప్పారు.
యువతి ఇక్కడే ఉంటే తేడాలు వచ్చేస్తాయని ఆమెను ఐటీ హబ్ లోని పెద్దనాన్న ఇంటికి పంపించేశారు. అక్కడికి వెళ్లిన బావ మరదలిని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు. అక్క జీవితం నాశనం అవుతుందని ఆలస్యంగా తెలుసుకున్న యువతి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. అంతే బావ, అతని బంధువులు కలిసి మరదిలిని కిడ్నాప్ చెయ్యడం, పోలీసులు రంగంలోకి దిగడం, మరదలు రివర్స్ కావడంతో కథ రసవత్తరంగా మారింది.
Illegal affair: భర్త ఫ్రెండ్ తో భార్య ?, ఓపిక నసించిపోయిన భర్త ఏం చేశాడంటే, శుభం కార్డు!

పెళ్లి చేసిన పెద్దలు
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని కుణిగల్ తాలుకాలోని హెబ్బూరులో దేవరాజ్ అలియాస్ దేవా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 8 సంవత్సరాల క్రితం దేవరాజ్ సొంతఊరు సమీపంలోని గ్రామంలో నివాసం ఉంటున్న సరిత (పేరు మార్చడం జరిగింది) అనే యుతితో దేవరాజ్ వివాహం జరిగింది.

బాగా సంపాధిస్తున్న బావ
కుటుంబ సభ్యులు సెట్ చేసిన సరితను వివాహం చేసుకున్న దేవరాజ్ అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. దేవరాజ్, సరిత దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సొంతంగా కోళ్ల ఫామ్ పెట్టుకున్న దేవరాజ్ పరిసర ప్రాంతాల్లోని చికెన్ షాపులకు కోళ్లు సరఫరా చేసే వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం చేస్తున్న దేవరాజ్ భర్త డబ్బులు బాగా సంపాధిస్తున్నాడు.

రాసుకుని పూసుకుని తిరిగేసిన బావ, మరదలు
భార్య సరితతో కలిసి అత్తారింటికి వెళ్లి వస్తున్న దేవరాజ్ అతని 20 ఏళ్ల వయసు ఉన్న మరదలు స్వప్నా (పేరు మార్చడం జరిగింది) మీద కన్నుపడింది. అక్క సరిత మొగుడు దేవరాజ్ తో ఎక్కువ చనువు పెంచుకున్న మరదలు స్వప్నా ఆమె బావతో రాసుకునిపూసుకుని తిరిగింది.

చెల్లికి వార్నింగ్ ఇచ్చిన అక్క
పెళ్లి వయసుకు వచ్చిన కత్తిలాంటి మరదలు స్వప్నా మీద ముందు నుంచి మోజు పడుతున్న బావ దేవరాజ్ ఆమెను వలలో వేసుకున్నాడు. అక్క మొగుడు దేవరాజ్ తో ప్రేమలో పడిన మరదలు స్వప్నా అతనితో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగింది. విషయం తెలుసుకున్న సరతి ఆమె భర్త దేవరాజ్ ను, సొంత చెల్లెలు స్వప్నాను మీరు పద్దతి మార్చుకోవాలని మందలించింది.

అక్క మొగుడితో లేచిపోయిన చెల్లెలు
కొంతకాలం క్రితం దేవరాజ్ అతని భార్య సరితకు హ్యాండ్ ఇచ్చి మరదలు స్వప్నాను లేపుకుని వెళ్లిపోయి పెళ్లి కాకుండానే వేరే ప్రాంతంలో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టారు. మా కూతురు కనపడటం లేదని స్వప్నా కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. కొంతకాలం తరువాత బావ దేవరాజ్ ను, అతని మరదలు స్వప్నాను పోలీసులు పట్టుకుని వచ్చారు. రాజీ పంచాయితీలు చేసిన పెద్దలు నీ కారణంగా నీ అక్క జీవితం నాశనం అవుతోందని, ఇద్దరు పిల్లలు అనాథలు అవుతారని చెల్లెలికి బుద్దిమాటలు చెప్పారు.

బెంగళూరుకు మరదలు షిఫ్ట్
సొంతఊర్లో సరిత ఉంటే ఆమె బావ దేవరాజ్ ఎక్కువగా వచ్చి వెలుతున్నాడని భయపడిన ఆమె కుటుంబ సభ్యులు బెంగళూరులోని కొడిగేహళ్ళిలో నివాసం ఉంటున్న పెద్దనాన్న ఇంటికి స్వప్నాను పంపించారు. కొంతకాలం నుంచి బెంగళూరులో పెద్దనాన్న ఇంట్లో ఉంటున్న స్వప్నా నా కారణంగా నా అక్క జీవితం ఎందుకు నాశనం కావాలని ఆలోచించి ఆమె బావ దేవరాజ్ కు దూరం అయ్యింది.

మరదలు మనుసు మార్చాలని బావ ప్రయత్నాలు
ఇంట్లోనే ఉంటూ బోర్ కొట్టడంతో విసిగిపోయిన స్వప్నా పెద్దనాన్న ఇంటి సమీపంలోని రాయల్ మార్టలో 15 రోజుల క్రితమే ఉద్యోగంలో చేరింది. తన మరదలు తనకు కాకుండా పోతుందని ఇంతకాలం రగిలిపోతున్న దేవరాజ్ కు స్వప్నా ఉద్యోగంలో చేరిన విషయం తెలిసింది. బెంగళూరు వచ్చిన దేవరాజ్ అతని మరదలు స్వప్నాను పెళ్లి చేసుకోవాలని అనేక ప్రయత్నాలు చేశాడు.

రగిలిపోయిన బావ..... మరదలిని కిడ్నాప్ చేశాడు
అయితే స్వప్నా మాత్రం జరిగిందేదో జరిగిపోయింది, ఇక నీ జీవితం నీది, నా జీవితం నాది అంటూ ఎదురు తిరిగింది. రాత్రి రాయల్ మాల్ లో ఉద్యోగం ముగించుకుని ఇంటికి బయలుదేరిన మరదలిని దేవరాజ్, అతని బంధువులు నవీన్, కుమార్ కలిసి కారులో కిడ్నాప్ చేశారు. అదే రోజు రాత్రి స్వప్నాను బలవంతంగా పిలుచుకుని బెంగళూరు నుంచి కారులో తుమకూరు వెళ్లిపోయారు.

రంగంలోకి దిగిన బెంగళూరు పోలీసులు
మరదలిని తుమకూరు పిలుచుకుని వెళ్లిన దేవరాజ్ తరువాత ఆమెను సకలేశపురకు పిలుచుకుని వెళ్లి రెండు రోజులు అక్కడే ఉన్నాడు. తరువాత ఆమెను మరో ప్రాంతానికి తీసుకెళ్లాడు. స్వప్నాను ఆమె బావ కిడ్నాప్ చేశాడని ఆమె కుటుంబ సభ్యులు బెంగళూరులోని కోడిగేహళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.

మరదలు రివర్స్ కావడంతో జైలుపాలైన బావ
కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగి దేవరాజ్, అతని బంధువులు నవీన్, కుమార్ ను అరెస్టు చేసి వారి కారు సీజ్ చేశారు. బాధితురాలిని కుటుంబ సభ్యులకు అప్పగించామని, ముగ్గురిని అరెస్టు చేసి జైలుకు పంపించామని కోడిగేహళ్ళి పోలీసులు చెప్పారు. మరదిలి మోజులో పడిన జైలుపాలైన భర్త దేవరాజ్ నాకు వద్దని అతని భార్య కూడా రివర్స్ అయ్యిందని సమాచారం.