• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Gold scam: అమ్మాయిలు, ఆంటీలు టార్గెట్, హైటెక్ సెక్స్ స్కామ్, మొబైల్ లో కొత్త ట్విస్ట్, బొమ్మ సూపర్!

|

బెంగళూరు/ మైసూరు/ మండ్య: బ్యాంకులో బంగారం కుదువ పెడితే 20 % నుంచి 40 % వడ్డీ చెల్లిస్తామని ప్రజలకు కుచ్చుటోపి పెట్టిన కేసు కొత్త మలుపు తిరిగింది. ప్రజల బంగారంతో గోల్ మాల్ చేసి రూ. 20 కోట్లకు పైగా మింగేసిన కింగ్ పిన్ మహిళను లొంగదీసుకుని వారితో సెక్స్ స్కామ్ కు తెరలేపాడని వెలుగు చూసింది.

గోల్డ్ స్కామ్ ప్రధాన నిందితుడి సెక్స్ సీడీలు, ఆడియో సాక్షాలు తెర మీదకు రావడంతో బాధిత మహిళలతో పాటు పోలీసులు షాక్ కు గురైనారు. ప్రపంచ ప్రసిద్ది చెందిన రాచనగరి సమీపంలో ఈ హైటెక్ సెక్స్ స్కామ్ దందాకు కేంద్ర బింధువు అయ్యిందని గుర్తించిన పోలీసులు ఒక్కొ విషయం బయటకు లాగుతున్నారు.

Video call: విదేశాల్లో భర్త, భార్యతో ఆ విషయంలో గొడవ, వీడియో కాల్, గుడ్ బై చెప్పి లైవ్ లో ఆత్మహత్య!Video call: విదేశాల్లో భర్త, భార్యతో ఆ విషయంలో గొడవ, వీడియో కాల్, గుడ్ బై చెప్పి లైవ్ లో ఆత్మహత్య!

అందమైన అమ్మాయిలు, ఆంటీలు టార్గెట్

అందమైన అమ్మాయిలు, ఆంటీలు టార్గెట్

కర్ణాటకలోని మండ్య పట్టణం (బహుబాష నటి సుమలతా అంబరీష్ ఎంపీగా ఉన్న మండ్య నియోజక వర్గం)లో బంగారు నగలు కుదవ పెట్టిన వాళ్లకు 20 శాతం నుంచి 40 శాతం వడ్డీ ఇస్తామని పలువురు మహిళలకు మాయమాటలు చెప్పారు. బ్యాంకులో మీరు బంగారు నగలు కుదవ పెడితే తక్కువ వడ్డీ వస్తుందని, మా దగ్గర బంగారు నగలు కుదువ పెట్టండి, భారీ మొత్తంలో వడ్డీ తీసుకోండి అంటూ కొందరు మహిళలను రంగంలోకి దింపారు. ఈ విధంగా కొన్ని వందల మంది నుంచి సుమారు రూ. కోట్ల రూపాయల బంగారు నగలు లూటీ చేశారు. బాధితుల్లో అందమైన యువతులు, మహిళలుఉన్నారు.

స్కెచ్ అదిరిపోయింది

స్కెచ్ అదిరిపోయింది

మండ్యలో ఓ హిజ్రా ఫిర్యాదు చెయ్యడంతో కోట్ల రూపాయాల గోల్డ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. మండ్యలో జరిగిన భారీ గోల్డ్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు సోమశేఖర్ అలియాస్ సోము అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. సోమశేఖర్. మండ్యలోని ఫెడ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ కలిసి మహిళల దగ్గర సుమారు 4. 5 కేజీల బంగారు నగలు తీసుకుని వారికి అధిక శాతం వడ్డీ ఇస్తామని కుచ్చుటోపి పెట్టారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మండ్యలోని ప్రముఖ వ్యాపారవేత్త, ఎంతో పలుకుబడి కలిగిన వ్యక్తి కోడలు పూజాతో ఎంజాయ్ చెయ్యడానికి సోమశేఖర్ ఈ గోల్డ్ స్కామ్ స్కెచ్ వేశాడని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. పూజా బిగ్ షాట్ కోడలు మాత్రమే కాదు, ప్రధాన నిందితుడు సోము స్నేహితుడి భార్య కావడంతో కేసు కొత్త మలుపు తిరిగింది.

ఫ్రెండ్ అంటూనే అతనికి ?

ఫ్రెండ్ అంటూనే అతనికి ?

మండ్యకు చెందిన ఓ బిగ్ షాట్ కొడుకు నిఖిల్ కు, పూజా అనే యువతికి కొన్ని సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. నిఖిల్ గోల్డ్ స్కామ్ నిందితుడు సోముకు స్నేహితుడు. నిఖిల్ భార్య పూజాతో అక్రమ సంబంధం పెట్టుకున్న సోము గోల్డ్ స్కామ్ కీలక నిందితుడని పోలీసులు అన్నారు. నిఖిల్ కు నీళ్లుతాగిస్తున్న అతని భార్య పూజా సోముతో అక్రమ సంబంధం పెట్టుకుని బెంగళూరు, మంగళూరు, మైసూరుతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ఫైవ్ స్టార్ హోటల్స్, రిసార్టుల్లో వీకెండ్ పార్టీలతో ఎంజాయ్ చేస్తున్నారని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.

ప్రియుడికి పూజ చేస్తున్న పూజా

ప్రియుడికి పూజ చేస్తున్న పూజా

సోము, ఆమె ప్రియురాలు పూజా ఫైవ్ స్టార్ హోటల్స్ లో ప్రతి వారం పిచ్చపాటిగా హైఫై లైఫ్ ఎంజాయ్ చేసి మూడు రోజుల తరువాత మళ్లీ మండ్య చేరుకుంటున్నారు. ప్రతివారం సోమూ, పూజాది ఇదే పని అని మండ్య నార్త్ పోలీసు అధికారులు గుర్తించారు. భర్త నిఖిల్ కు మస్కా కొడుతున్న అతని భార్య పూజా సోముతో అక్రమ సంబంధం పెట్టుకుంది. తన మామ పెద్ద వ్యాపారవేత్త అనే విషయం, ఆ కుటుంబానికి చాల పేరుప్రతిష్టలు ఉన్నాయి అనే విషయం గాలికి వదిలేసిన పూజా అక్రమ సంబంధం పెట్టుకున్న సోముతో కలిసి ఇతర ప్రాంతాలకు చెక్కేసి హైఫై పార్టీలు జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తోందని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.

సోము A1 పూజా A2

సోము A1 పూజా A2

అధిక శాతం వడ్డీ ఇస్తామని మహిళలను నమ్మించి ఇప్పటి వరకు సుమారు 5 కేజీల బంగారు నలగు తీసుకున్న సోము వాటిని రూ. 20 కోట్ల వరకు తాకట్టు పెట్టేసి వచ్చిన డబ్బుతో వివాహిత మహిళ పూజాతో కలిసి ఎంజాయ్ చేశాడని పోలీసు అధికారులు అంటున్నారు. నిఖిల్ ను గాలికి వదిలేసిన పూజా హైఫై లైఫ్ ఎంజాయ్ చెయ్యడానికి సోమును రెండో వివాహం చేసుకుందని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మండ్య గోల్డ్ స్కామ్ కేసులో A1 సోము, A2 పూజాను నిందితులుగా చేర్చామని, ఇంకా ఈ స్కామ్ లో ఉన్న నిందితుల వివరాలు కోసం కూపీలాగితే మరో షాకింగ్ హైటెక్ సెక్స్ స్కామ్ విషయం బయటకు వచ్చింది.

సోము సెక్స్ స్కామ్ స్కెచ్

సోము సెక్స్ స్కామ్ స్కెచ్


మండ్య గోల్డ్ స్కామ్ ప్రధాన నిందితుడు సోము అలియాస్ సోమశేఖర్ బంగారు నగలు కుదువ పెట్టడానికి వచ్చే అందమైన అమ్మాయిలు, ఆంటీలకు వలవేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. పోలీసుల విచారణ చేసే సమయంలో సోము మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సోము మొబైల్ లో అనేక మంది మహిళలు, ఆంటీలను సెక్స్ స్కామ్ దందాలోకి దించడానికి మాట్లాడిన సంభాషణలు చాలా ఉన్నాయని గుర్తించిన పోలీసులు షాక్ కు గురైనారు. మహిళలకు డబ్బు ఆశ చూపి హైటెక్ సెక్స్ స్కామ్ లోకి లాగారని పోలీసులు గుర్తించారు.

మైసూరు ఫామ్ హౌస్ లో దందా

మైసూరు ఫామ్ హౌస్ లో దందా

మహిళలను సెక్స్ స్కామ్ లోకి దించడానికి సోము కొందరు మహిళలతో మాట్లాడిన విషయాలు అతని మొబైల్ ఫోన్ లో రికార్డు అయ్యాయని పోలీసులు గుర్తించారు. మైసూరు నగరం సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో ఈ సెక్స్ దందా స్కామ్ కు కేంద్ర బింధువు అయ్యిందని పోలీసులు గుర్తించారు. మహిళల దగ్గర కేజీల కేజీల బంగారు నగలు లూటీ చేసిన సోము వారినే అడ్డం పెట్టుకుని సెక్స్ స్కామ్ లో దింపి మరో రకంగా డబ్బులు సంపాధించి ప్రియురాలు పూజాతో ఎంజాయ్ చేస్తున్నాడని పోలీసు అధికారులు అంటున్నారు. సెక్స్ స్కామ్ కు సంబంధించి సోము మొబైల్ లో ఆడియో సాక్షాలతో పాటు కొన్ని సీడీలు చిక్కాయని, ఈ దందాలో ఇంకా చాలా మంది ప్రముఖలు ఉన్నారనే అనుమానం ఉందని, అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని మండ్య జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Gold scam: Somashekhar, who is accused of gold fraud in Mandya, is also involved in a high-tech sex scandal in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X