Counting center: ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో అధికారి మృతి, నిమిషాల్లో పైలోకాలకు, వాళ్ల టెన్షన్ తో!
బెంగళూరు/ మైసూరు: కర్ణాటకలో జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల ఫలితాల కోసం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల బయట చాలా టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ అభ్యర్థులు వారి అనుచరులు ఎంతో టెన్షన్ గా కౌంటింగ్ కేంద్రాల ముందు ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. ఇదే సమయంలో కౌంటింగ్ కేంద్రంలో విధుల్లో ఉన్న ఎన్నికల అధికారి గుండెపోటుతో నిమిషాల్లో ఆయన ప్రాణాలు వదలడంతో సాటి సిబ్బంది, ఎన్నికల అధికారులు షాక్ కు గురైనారు.
Astrologer: గురువు అంటూనే కూతురికి శిష్యుడు పంగనామాలు, మస్త్ మజా, వీడి స్కెచ్ తో షాక్, సర్వం!

ఎన్నికల కయ్యాలు... కారాలు... మిరియాలు
కర్ణాటకలో ఇటీవల రెండు విడతల్లో జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతుదారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, జేడీఎస్ లీడర్లతో పాటు కొన్ని వేల మంది స్వంతత్రపార్టీ అభ్యర్థులుగా పోటీ చేశారు. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పలు పార్టీల నేతలు అనేక ఎత్తులు వాటికి పైఎత్తులు వేసి ఎన్నికల్లో పోటీ చేశారు.

సీనియర్ అధికారి
కర్ణాటక పీడబ్ల్యూ శాఖలో బోరేగౌడ (52) ఏఇఇగా విధులు నిర్వహిస్తున్నారు. కర్ణాటకలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 30వ తేదీ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. పీడబ్ల్యూ శాఖలో ఏఇఇగా పని చేస్తున్న బోరేగౌడను కూడా ఎన్నికల కౌంటింగ్ విధులకు నియమించారు.

ఒక్కసారి గుండెపోటు
రాచనగరి మైసూరు జిల్లాలోని పిరియపట్టలోని ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో ఏఇఇ బోరేగౌడ బుధవారం ఉదయం విధులకు హాజరైనారు. బుధవారం ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయిన కొంత సేపటిలో కౌంటింగ్ హాల్ లో ఉన్న బోరేగౌడకు గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయారు. విషయం గుర్తించిన సాటి సిబ్బంది వెంటనే ఆయన్ను ఎన్నికల విధులు నిర్వహించడానికి ఉపయోగిస్తున్న వాహనంలో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

నిమిషాల్లో ప్రాణం పోయింది
కౌంటింగ్ కేంద్రం సమీపంలోని ఆసుపత్రికి వెళ్లే సమయానికే బోరేగౌడ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఎన్నికల పరిశీలకుడిగా విధులకు హాజరైనా సీనియర్ అధికారి బోరేగౌడ గుండెపోటుతో ప్రాణాలు వదలడంతో కొంత సమయం ఎన్నికల కౌంటింగ్ కు అంతరాయం ఏర్పడింది. అనంతరం ఆ కౌంటింగ్ కేంద్రంలో వేరే అధికారిని నియమించారు.