Sadist: పెళ్లి కొడుక్కి బెంజ్ కారు, 5 కేజీ బంగారు, ఫస్ట్ నైట్ భరత్ రెడ్డి ఏం చేశాడంటే ? శోభనం చెట్టెక్కింది, కథ !
బెంగళూరు/హెచ్ఏఎల్: శ్రీమంతుల కుటంబాలకు చెందిన యువతి, యువకుడి పెళ్లి జరిగిపోయింది. పెళ్లి కుమార్తె బిగ్ షాట్ కావడంతో వారి అంతస్తుకు తగ్గట్లుగా అల్లుడ భరత్ రెడ్డికి టాప్ మోడల్ బెంజ్ కారు, కుమార్తెకు 5 కేజీల బంగారు నగలు ఇచ్చి కోట్ల రూపాయలు ఖర్చు చేసి గ్రాండ్ గా పెళ్లి చేశారు. అమ్మాయి ఇంట్లో ఫస్ట్ నైట్ కు ఏర్పాట్లు చేశారు. తొలిరాత్రికి భార్య గదిలో సిద్దంగా ఉంది. బయటకు వెళ్లిన పెళ్లి కొడుకు పీకలదాక మద్యం సేవించి ఫస్ట్ నైట్ రూమ్ లోకి వెళ్లాడు. ఫైస్ట్ నైట్ పెటాకులైయ్యింది. అక్కడ కట్ చేస్తే సెకండ్ నైట్ పెళ్లి కొడుకు ఇంట్లో. అక్కడ సేమ్ సీన్. తరువాత కథ కంచికి చేరుకుని అనేక మలుపులు తిరిగి చివరికి శ్రీమంతుల ఇంటి పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది.
Illegal affair: ఆంటీకి ఆ నలుగురు, ఒకడికి మండింది, మిల్క్ ట్యాంకర్ లా ఉందని ఒకటే ఫాలోయింగ్!

బిగ్ షాట్స్ ఇంట్లో పెళ్లి అదుర్స్
బెంగళూరులోని బాణసవాడిలో నివాసం ఉంటున్న బాబురెడ్డి కుమార్తె శ్రావణి, బెంగళూరులోని ఎల్ బీఎస్ నగర్ లో నివాసం ఉంటున్న లోకేష్ రెడ్డి కుమారుడు భరత్ అలియాస్ భరత్ రెడ్డిల పెళ్లి నిశ్చయం అయ్యింది. బాబురెడ్డి, లోకేష్ రెడ్డి ఇద్దరూ శ్రీమంతులు కావడంతో ఇరు కుటుంబాల్లో
పెళ్లిసందడి చాలా హడావిడిగా జరిగింది.

బెంజ్ కారు, 5 కేజీల బంగారు నగలు, రూ, కోట్లు ఖర్చు
కుటుంబ సభ్యులు నిర్ణయించిన ముహూర్తానికి నవంబర్ 29వ తేదీన గ్రాండ్ గా శ్రావణి, భరత్ ల పెళ్లి జరిగింది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెళ్లి జరిపించారు. తన అంతస్తుకు తగ్గట్లుగా బాబురెడ్డి అల్లుడు భరత్ రెడ్డికి టాప్ మోడల్ బెంజ్ కారు, కుమార్తెకు 5 కేజీల బంగారు నగలు, కోట్ల విలువైన ఆస్తి కట్నంగా ఇచ్చారని తెలిసింది.

ఫైస్ట్ నైట్ పండగ అనుకుంటే గంగజాతర
నవంబర్ 29వ తేదీ పెళ్లి జరిగిన రోజే బాణసవాడిలోని శ్రావణి ఇంట్లో ఫస్ట్ నైట్ కు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలిరాత్రికి భార్య శ్రావణి గదిలో సిద్దంగా ఉంది. బయటకు వెళ్లిన పెళ్లి కొడుకు భరత్ పీకలదాక మద్యం సేవించి ఫస్ట్ నైట్ రూమ్ లోకి వెళ్లాడు. నిలబడటానికి కూడా శక్తి లేకుండా భరత్ ఫస్ట్ నైట్ రూమ్ లోకి రావడంతో శ్రావణి షాక్ అయ్యింది. నిలబడే శక్తి లేని భర్తతో ఇప్పుడు ఫస్ట్ నైట్ చేసుకున్నా జీవితాంతం ఈ చీకటి రోజు గుర్తుండిపోతుందని భయంతో శ్రావణి భర్త భరత్ ను దగ్గరకు రూనివ్వకుండా దూరం పెట్టడంతో ఫైస్ట్ నైట్ పెటాకులైయ్యింది.

భర్త ఇంట్లో సెకండ్ నైట్
మొదటి రోజు భర్త భరత్ ఇలా పీకలదాక మద్యం సేవించి వచ్చాడని శ్రావణి ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. పెళ్లి చేసుకున్నానని ఖుషీలో అలా తాగి వచ్చి ఉంటాడని, రెండు రోజులు పోతే సర్దుకుంటాయని కుటుంబ సభ్యులు శ్రావణికి సర్ది చెప్పారు. అక్టోబర్ 30వ తేదీన భరత్ ఇంటికి పెళ్లి కుమార్తె శ్రావణిని పిలుచుకుని వెళ్లి అక్కడ శోభనానికి ఏర్పాట్లు చేశారు. సెకండ్ నైట్ మళ్లీ పెళ్లి కొడుకు భరత్ పీకలదాక మద్యం సేవించి బెడ్ రూమ్ లోకి వెళ్లడంతో శ్రావణి దిమ్మతిరిగిపోయింది.

శోభనం జరగలేదు కానీ రాత్రి రచ్చరచ్చ
ఆరోజు రాత్రి శ్రావణి, భరత్ లో శోభనం జరగలేదు. ఏం ఖర్మరా బాబు అంటూ శ్రావణి భర్తను దూరం పెట్టింది. ఆరోజు మద్యం మత్తులో ఉన్న పెళ్లి కొడుకు భరత్ భార్యతో శ్రావణితో గొడవ పెట్టుకున్నాడు. నువ్వు తాగి వచ్చావని, నేను నీతో ఇప్పుడు సంసారం చెయ్యలేనని శ్రావణి గట్టిగా చెప్పింది. గొడవ పెద్దది కావడంతో భరత్ తల్లిదండ్రులు లోకేష్ రెడ్డి, కమలమ్మ జోక్యం చేసుకున్నారు. నువ్వు మా కొడుకు చెప్పినట్లు వినాలి అంతే, నీకు ఇకముందు అన్నీ మేమే, నువ్వు ఇక్కడ ఉండాలి అంటూ భరత్ తల్లిదండ్రులు శ్రావణికి వార్నింగ్ ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి.

దెయ్యం పట్టిందని మంత్రాలు తంత్రాలు
పెళ్లి జరిగిన రోజు నుంచి శ్రావణి, భరత్ ల మద్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పెళ్లి జరిగిన వెంటనే ఈ విషయాలు తన తల్లిదండ్రులకు తెలిస్తే వాళ్లు భాదపడుతారని కొంతకాలం శ్రావణి మౌనంగా ఉండిపోయింది. శ్రావణి భర్త భరత్ ను దూరం పెట్టడంతో అతని తల్లి కమలమ్మ ఓ మంత్రగత్తెను పిలుచుకుని వెళ్లి నవంబర్ 17వ తేదీన ఇంట్లో కొడలిని కట్టేసి క్షుద్రపూజలు చేయించింది. తరువాత శ్రావణిని ఎదురు తిరగడంతో భర్త భరత్ ఇనుప రాడ్ తీసుకుని భార్య శ్రావణి మీద దాడి చేసి గాయపరిచి ఓ రూమ్ లో బంధించారని తెలిసింది.

తాగుబోతు భర్త అరెస్టు
నాలుగు రోజుల క్రితం శ్రావణి అక్కాబావ ఆమె ఇంటికి వెళ్లడంతో విషయం వెలుగు చూసింది. శ్రావణి శరీరం మీద తీవ్రగాయాలు కావడంతో ఆమెను బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. తన భర్త భరత్, అత్తమామలు లోకేష్ రెడ్డి, కమలమ్మ తనను చిత్రహింసలకు గురి చేశారని శ్రావణి ఫిర్యాదు మేరకు హెచ్ఏఎల్ పోలీసులు కేసు నమోదు చేశారు. తాగుబోతు భర్త భరత్ ను పోలీసులు అరెస్టు చేశారు. శ్రావణికి చిత్రహింసలు పెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అత్తమామలు లోకేష్ రెడ్డి, కమలమ్మలను ఇంకా అరెస్టు చెయ్యలేదని, కేసు విచారణలో ఉందని హెచ్ఏఎల్ పోలీసులు తెలిపారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెళ్లి చేసిన కుమార్తె జీవితం రెండు నెలలు కాకముందే ఇలా కావడంతో ఆమె తల్లిదండ్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.