• search
 • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Honeytrap: నాజూకు అమ్మాయిలు, కావలసినంత కండ, లావు పొడువు ఆంటీలు, మీడియా ముసుగులో డీల్!

|

బెంగళూరు/ బెళగావి: కావలసినంత కండ, కలర్, నాజూకు నడుము, లావు, పొడువు ఇలా వయ్యారంగా ఉన్న అమ్మాయిలు, ఆంటీలను అడ్డం పెట్టుకుని మూడు వీడియో కెమెరాలు చేతిలో పట్టుకుని మేము మీడియా అంటూ బాగా డబ్బు ఉన్న వాళ్లను బ్లాక్ మెయిల్ చేస్తున్న ముఠా గుట్టురట్టు అయ్యింది. లాక్ డౌన్ లో శ్రీమంతులు ఖాళీగా ఉన్నారని, వారి టేస్ట్ కు తగ్గట్టుగా అమ్మాయిలు, ఆంటీలతో వల వేయించి రాసలీలలు సాగిస్తున్న సమయంలో రహస్యంగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చెయ్యడం పనిగా పెట్టుకున్నారు. కరోనా లేదు తొక్కలేదు మీరు ఎంజాయ్ చెయ్యండి సార్ అంటూ విలాసవంతమైన హోటల్స్ లో ఈ దాందాలు జరిపిస్తున్న ఆంటీల బ్యాచ్ అడ్డంగా బుక్కైయ్యింది.

Lockdown: కోలీవుడ్ నటీమణులతో గెస్ట్ హౌస్ లో బిగ్ షాట్ రొమాన్స్, చేసింది చాలు పదనాయనా, అరెస్టు !

రెండు రాష్ట్రాల సరిహద్దు

రెండు రాష్ట్రాల సరిహద్దు

కర్ణాటక- మహారాష్ట్ర సరిహద్దులో బెళగావి మహానగరం ఉంది. బెళగావి సిటీలో శ్రీమంతులతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ఫ్యాక్టరీల యజమాలను నివాసం ఉంటున్నారు. మహారాష్ట్ర- కర్ణాటక బార్డర్ లో ఉన్న బెళగావిలో కన్నడిగులతో పాటు మరాఠీలు లక్షల మంది నివాసం ఉంటున్నారు. పేరుకు కర్ణాటకలో బెళగావి ఉన్నా అక్కడ కన్నడ, మరాఠీ బాషలు సరిసమానంగా మాట్లాడుతుంటారు.

 సూపర్ ఫిగర్స్, అందుబాటులో ఆంటీలు !

సూపర్ ఫిగర్స్, అందుబాటులో ఆంటీలు !

బెళగావి సిటీకి చెందిన రఘనాథ్ దూమాళ, సదాశివ చిప్పలకట్టి అనే కాలాంతకులు శ్రీమంతులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల వివరాలు సేకరించారు. వారిలో అమ్మాయిలు, మద్యం వ్యసనం ఉన్న వారిని లిస్ట్ ఔట్ చేశారు. అంతే వారి ఫోన్ నెంబర్లు సేకరించిన రఘనాథ్, సదాశివ సార్ మీరు లాక్ డౌన్ లో ఖాళీగా ఉన్నారు కదా, ఏమైనా ఎంజాయ్ చేసే ఆలోచన ఉందా ? అంటూ మాటలు కలిపారు.

నాజూకు నడుము, కావలసినంత కండ

నాజూకు నడుము, కావలసినంత కండ

నాజూకు అమ్మాయిలు, కావలసినంత కండ, లావు, పొడవు, ఎర్రగా బుర్రగా ఉన్న అమ్మాయిలు, ఆంటీలు ఇలా మీకు ఏ వయసు వాళ్లు కావాలో చెప్పండి, గుట్టుచప్పుడు కాకుండా హోటల్స్, రిసార్టులు, గెస్ట్ హౌస్ లకు పంపిస్తాం, పోలీసులతో మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మేము చూసుకుంటాం, మమ్మల్ని నమ్మండి అంటూ వారికి మాయమాటలు చెబుతున్న రఘనాథ్, సదాశివ తదితరులు వేల రూపాయలకు డీల్ మాట్లాడుకుంటున్నారు.

 మంచి రసపట్టులో ఉంటే వీడియోలు

మంచి రసపట్టులో ఉంటే వీడియోలు

అమ్మాయిలు, ఆంటీల పిచ్చి ఉన్న బాగా బలిసిన కొందరు శ్రీమంతులు రఘనాథ్, సదాశివతో డీల్ మాట్లాడుకుని విలాసవంతమైన హోటల్స్, రిసార్టులు, గెస్ట్ హౌస్ లకు అమ్మాయిలను పిలిపించుకుంటున్నారు. తరువాత మద్యం సేవించి అమ్మాయిలు, వివాహిత మహిళలతో ఎంజాయ్ చేశారు. మంచి రసపట్టులో ఉన్న సమమంలో రహస్య కెమెరాలతో వారి దగ్గరకు వెళ్లిన మహిళలు, అమ్మాయిలతోనే రాసలీలల వీడియోలు తీయించారు.

రూ. లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్

రూ. లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్

బాగా పేరు ప్రతిష్టలు ఉన్న శ్రీమంతుల రాసలీలల వీడియోలు తీసిన తరువాత మేము ఫ్రైమ్ న్యూస్ కన్నడ మీడియా వాళ్లు మాట్లాడుతున్నాం, మీరు అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు మాకు చిక్కాయి. మేము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వాటిని మీడియాలో ప్రసారం చేస్తాం, తరువాత మీ పరువు పోయి ఆత్మహత్యలు చేసుకుంటారు, మీ కాపురాలు కూలిపోతాయి, మీ వ్యాపారాలు దెబ్బతింటాయి అంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

 సంగీత, గౌరి, మంజుల గ్యాంగ్

సంగీత, గౌరి, మంజుల గ్యాంగ్

బెళగావికి చెందిన బసవరాజు అనే వ్యాపారి వీరి వలలోపడి విలవిలలాడిపోయాడు. బసవరాజ్ ను రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చెయ్యడంతో చివరికి రూ. 5 లక్షలకు బేరం కుదిరింది. బాధితుడు బసవరాజ్ బెళగావి ఏసీపీ నారాయణ భరమనికి ఫిర్యాదు చేసి లబోదిబో అన్నాడు. బెళగావిలోని ఓ ప్రముఖ హోటల్ లో బసవరాజ్ నుంచి వగలాడీలు సంగీత, మంజుల, గౌరి అనే ముగ్గురు మహిళలు రూ. 5 లక్షలు తీసుకోవడానికి వెళ్లారు .అదే సమయంలో ఏసీపీ నారాయణ, ఇన్స్ పెక్టర్ గడ్డేశ్వర్ తదితరులు దాడి చేసి మంజుల, సంగీత, గౌరీలను అదుపులోకి తీసుకున్నారు.

  Ap Assembly Election 2019 : జ‌గ‌న్ ముఖ్యమంత్రిగా.. ప్ర‌మాణ స్వీకార ముహూర్తం ఖరారు..!! || Oneindia
  మీడియా ముసుగులో డీల్

  మీడియా ముసుగులో డీల్

  సంగీత, మంజుల, గౌరీలు ఇచ్చిన సమాచారం మేరకు రఘనాథ్ సదాశివలను పోలీసులు అరెస్టు చేశారు. ఐదు మంది దగ్గర ఫ్రైమ్ న్యూస్ కన్నడ యూట్యాబ్ మీడియా ఐడీ కార్డులు ఉన్నాయని ఏసీపీ నారాయణ మీడియాకు చెప్పారు. అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్న శ్రీమంతుల రాసలీలల వీడియోలు తీస్తున్న ఈ ఐదు మంది తరువాత వారిని బ్లాక్ మెయిల్ చేసి లక్షల రూపాయాలు లాక్కొని ఎంజాయ్ చేస్తున్నారని ఏసీపీ నారాయణ అన్నారు. ఈ గ్యాంగ్ వలలో పడిన కొందరు ఎక్కడ పరువు పోతుందో అని ఫిర్యాదు చెయ్యడంలేదని, వీళ్లు ఎంతమందిని హనీట్రాప్ తో మోసం చేశారు అని ఆరా తీస్తున్నామని ఏసీపీ నారాయణ మీడియాకు చెప్పారు. నిందితుల నుంచి నకిలీ మీడియా ఐడీ కార్డులు, మొబైల్స్ స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు.

  English summary
  Honeytrap: Five People have been arrested in Belagavi, including three women who were blackmailing in the Honeytrap model.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X