Illegal affair: ప్రియుడితో లేచిపోయిన నలుగురు పిల్లల తల్లి, భార్య మీద పగతో ?, శవాలు పెట్టుకుని భర్త!
బెంగళూరు/ కలబురిగి: మూడు సంవత్సరాలు ప్రేమించుకున్న యువతి, యువకుడు తరువాత లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడంతో నలుగురు పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తరువాత భార్య, భర్తల కుటుంబ సభ్యులు కలిసిపోయారు. భర్తతో సంతోషంగా కాపురం చేస్తున్న భార్య ఓ యువకుడితో పరిచయం పెంచుకుని అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న భర్త అతని భార్యను చితకబాదేశాడు.
తన లవర్ ను కలవడానికి భర్త అడ్డుపడుతున్నాడని రగిలిపోయిన భార్య ఆమె నలుగురు పిల్లలను గాలికి వదిలేసి ఆమె ప్రియుడితో కలిసి పారిపోయింది. భార్య ప్రియుడితో పారిపోయిందని రగిలిపోయిన భర్త అతని ఇద్దరు పిల్లలను చంపేశాడు. సొంత ఆటోలో సీటు కింద శవాలు పెట్టి పైన సీటు వేసుకుని ఊరంతా ప్రయాణికులను కుర్చోబెట్టుకుని బాడుగలు తిప్పాడు. ఆటో నుంచి దుర్వాసన రావడం, ఆటో నుంచి రక్తం కారడంతో ప్రయాణికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.

లవ్ మ్యారేజ్
కర్ణాటకలోని కలబురిగి నగరంలోని రాజీవ్ గాంధీ నగర్ లో లక్ష్మీకాంత్ అలియాస్ కాంతా (36) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 14 సంవత్సరాల క్రితం లక్ష్మీకాంతా, అంజలి అనే యువతి ప్రేమించుకున్నారు. మూడు సంవత్సరాలు ప్రేమించుకున్న లక్ష్మీకాంతా, అంజలి తరువాత లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న లక్ష్మీకాంతా, అంజలి దంపతులు సంతోషంగా కాపురం చేశారు.

ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య
లక్ష్మీకాంతా, అంజలి దంపతులకు నలుగురు పిల్లలు పుట్టారు. సోనీ (11), మయూరి (10) అనే ఇద్దరు కుమార్తెలతో పాటు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత లక్ష్మీకాంతా, అంజలి కుటుంబ సభ్యులు కలిసిపోయారు. భర్త లక్ష్మీకాంతాతో సంతోషంగా కాపురం చేస్తున్న అతని భార్య అంజలి ఓ యువకుడితో పరిచయం పెంచుకుంది.

ప్రియుడితో ఎంజాయ్ చేసిన భార్య
యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న అంజలి అతనితో ఎంజాయ్ చేసింది. లక్ష్మీకాంత ఆటో డ్రైవర్ కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు అతను ఎక్కువగా బయట ఉంటున్నాడు. భర్త లక్ష్మీకాంత బయట ఉంటే అతని భార్య అంజలి ప్రియుడితో ఎంజాయ్ చేసింది. భార్య అంజలి అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న లక్ష్మీకాంతా అతని భార్యను చితకబాదేశాడు.

ప్రియుడితో పారిపోయిన భార్య
తన లవర్ ను కలవడానికి భర్త లక్ష్మీకాంతా అడ్డుపడుతున్నాడని రగిలిపోయిన అతని భార్య అంజలి ఆమె నలుగురు పిల్లలను గాలికి వదిలేసి నాలుగు నెలల క్రితం ఆమె ప్రియుడితో పారిపోయింది. అంజలి ప్రియుడితో పారిపోయిన తరువాత నలుగురు పిల్లలు వాళ్ల అమ్మమ్మ ఇంటిలో ఉంటున్నారు.

భార్య మీద కోపంతో ఇద్దరు కూతుర్లను చంపేశాడు
భార్య అంజలి ప్రియుడితో పారిపోవడంతో లక్ష్మీకాంతా మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. అమ్మమ్మ ఇంటిలో ఉంటున్న కుమార్తెలు సోనీ, మయూరిని ఆటోలో పిలుచుకుని వచ్చిన లక్ష్మీకాంతా ఇద్దరు కూతుర్లను చంపేసి అతని ఆటో సీటు కింద ఇద్దరి శవాలు దాచిపెట్టాడు. లక్ష్మీకాంతా అతని సొంత ఆటోలో సీటు కింద ఇద్దరు కూతుర్ల శవాలు పెట్టి పైన సీటు వేసుకుని ఊరంతా ప్రయాణికులను కుర్చోబెట్టుకుని బాడుగలు తిప్పాడు.


ఆటోలో దుర్వాసన వస్తున్నా పట్టించుకోలేదు
లక్ష్మీకాంతా ఆటోలో నుంచి దుర్వాసన రావడం, ఆటోలో నుంచి రక్తం కారడంతో ప్రయాణికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆటోలో పరిశీలించగా సీటు కింద సోనీ, మయూరి శవలు బయటపడటం కలకలం రేపింది. భార్య అంజలి మీద కోపంతో తన కుమార్తెలను తానే హత్య చేశానని లక్ష్మీకాంత అంగీకరించడం కలకలం రేపింది.