Illegal affair: భార్యను ఇంట్లో పెట్టి తాళం, మాట వినలేదని ఆంటీని తుపాకితో కాల్చి చంపిన అంకుల్!
బెంగళూరు/ కొడుగు/ మడికేరి : ఇంట్లో పెట్టి తాళం వేసినా ఆంటీ తన మాట వినడం లేదని అంకుల్ పగ పెంచుకున్నాడు. వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న తన భార్య తనను నిర్లక్షం చేస్తోందని భర్త రగిలిపోయాడు. ఇదే విషయంలో నిత్యం దంపతుల మద్య గొడవలు జరుగతున్నాయి. పండగ రోజు ఇంట్లో భార్యతో గొడవపడిన భర్త సహనం కోల్పోయి డబుల్ బ్యారెల్ తుపాకి తీసుకుని భార్యను ఒకే తూటతో కాల్చి చంపేశాడు. అనంతరం పోలీసులు, కేసుల భయంతో అదే తుపాకితో కాల్చుకోవడంతో భర్త చావుబతుకుల మద్య మృత్యువుతో పోరాటం చేస్తున్నాడు.
Sexual torcher: టెర్రాస్ పై ప్యాంట్ విప్పి .. ఛీ..ఛీ, షార్వా పిండేసిన పోలీసులు !

ముగ్గురు కుమార్తెలు
కర్ణాటకలోని కొడుగు జిల్లా మడికేరి సమీపంలోని సోమవారపేటకు చెందిన కాళప్ప, సుమిత్రా దంపతులు బెంగళూరు చేరుకుని బసవేశ్వర నగర్ లో నివాసం ఉంటున్నారు. కాళప్ప, సుమిత్రా దంపతుల ముగ్గురు కుమార్తెలు. ముగ్గురు కుమార్తెలకు వివాహం జరిగిపోవడంతో వారు వారివారి భర్తలతో కలిసి వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. కాళప్ప, సుమిత్రా దంపతులు ఇద్దరే బసవేశ్వరనగర్ లో నివాసం ఉంటున్నారు.

భార్యను ఇంట్లో పెట్టి తాళం వేస్తున్న భర్త
భార్య సుమిత్రా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని చాలా కాలం నుంచి కాళప్పకు అనుమానం ఉంది. ఇదే విషయంలో నిత్యం కాళప్ప, సుమిత్రా దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. ఉద్యోగానికి వెళ్లే సమయంలో కాళప్ప భార్యను ఇంట్లో పెట్టి బయట తాళం వేసి వెలుతున్నాడు. రాత్రి ఇంటికి చేరుకున్న తరువాతే కాళప్ప ఇంటి తాళం తీస్తున్నాడు. తనను ఎందుకు ఇంట్లో పెట్టి తాళం వేస్తున్నావు అంటూ సుమిత్రా భర్త కాళప్పతో గొడవపడేది. ముగ్గురు కుమార్తెలు కాళప్పకు నీ ప్రవర్తన మార్చుకోవాలని చెప్పిచెప్పి విసిగిపోయారు.

ఏటీఎం క్యాష్ వ్యాన్ సెక్యూరిటీ
బెంగళూరులోని ఏటీఎం కేంద్రాల్లో నగదు నిల్వ చేసే వాహనం (వ్యాన్)లో కాళప్ప సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఏటీఎం కేంద్రాలకు కోట్ల రూపాయలు వ్యాన్ లో తీసుకెలుతున్న సందర్బంగా కాళప్పకు డబుల్ బ్యారెల్ తుపాకి ఇచ్చారు. డబ్బును జాగ్రత్తగా చూసుకోవవడానికి కాళప్ప డబుల్ బ్యారెల్ గన్ చేతిలో పట్టుకుని వ్యాన్ లో వెళ్లి వస్లుంటాడు. అదే తుపాకి తీసుకుని కాళప్ప ఇంటికి వెలుతుంటాడు.

ఏందిరా నీ రామాయణం
దీపావళి పండుగ సందర్బంగా సుమిత్రా బెంగళూరులోనే నివాసం ఉంటున్న కుమార్తె ఇంటికి వెళ్లింది. కాళప్ప ఇంట్లోనే ఉన్నాడు. సోమవారం భార్య సుమిత్రా కుమార్తె ఇంటి నుంచి వచ్చిన వెంటనే కాళప్ప మళ్లీ భార్యతో గొడవపడ్డాడు. నేను బయటకు వెళ్లిన తరువాత నువ్వు ఎక్కడికిపోతున్నావు, నేను ఇంట్లో లేని సమయంలో ఎవరెవరు ఇక్కడికి వచ్చి ఇంటి తాళం తీసి లోపలికి వచ్చి వెలుతున్నారు ? అంటూ కాళప్ప పెద్దగా గొడవ చేశాడు. ఎవ్వరితో నేకు ఎలాంటి అక్రమ సంబంధం లేదని చెప్పినా కాళప్ప ఏ మాత్రం పట్టించుకోలేదు.

ఆంటీని కాల్చి పారేసిన అంకుల్
కాళప్ప, సుమిత్రాల మద్య గొడవ తారాస్థాయికి చేరింది. ఆ సమయంలో తన దగ్గర ఉన్న డబుల్ బ్యారెల్ గన్ తీసుకున్న కాళప్ప భార్యను గురి చూసి కాల్చడంతో ఒక్క బుల్లెట్ కే ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తరువాత పోలీసుల భయంతో కాళప్ప అదే తుపాకితో కాల్పుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తుపాకి కాల్పుల శభ్దం వినిపించడంతో స్థానికులు పోలీసులక సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరకుని రక్తపు మడుగులో పడి ఉన్న కాళప్పను ఆసుపత్రికి తరలించారు. భార్య సుమిత్రా శీలంపై అనుమానంతోనే కాళప్ప ఆమెను హత్య చేశాడని, కాళప్ప పరిస్థితి విషమంగా ఉందని బసవేశ్వరనగర్ పోలీసులు తెలిపారు.