Illegal affair: భర్త ఎగ్ రైస్ వ్యాపారి, గుడ్డు పక్కింట్లో పెడుతున్నాడని రాగిముద్దతో చంపేసిన భార్య!
బెంగళూరు/ దావణగెరె: ఈ మద్యకాలంలో భర్తలను ఎలా హత్యలు చెయ్యాలి ? అంటూ భార్యలు, భార్యలను ఎలా లేపేయాలి ? అంటూ భర్తలు చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నారు. అక్రమ సంబంధం కారణంగా ఓ భార్య భర్తను అతి తెలివితే చంపేసింది. ఎగ్ రైస్ వ్యాపారం చేస్తున్న భర్త ప్రతిరోజూ వేలకు వేలరూపాయలు సంపాధిస్తూ ఆ డబ్బులు ప్రియురాలి ముఖాన తగలేస్తున్నాడని భార్య రగిలిపోయింది. తన ఇంటిలో పెట్టాల్సిన గుడ్డు పక్కింటి మహిళ ఇంట్లో పెడుతున్నాడని భార్య అసహనం పెంచుకుంది. అంతే రాగి ముద్దు, 10 నిద్రమాత్రలతో భర్త హత్యకు పక్కా స్కెచ్ వేసి అనుకున్న పనిముగించింది. అయితే అధికమాసంలో దేవుడు కరునించకపోవడంతో అమావాస్య రోజు భార్య పోలీసులకు అడ్డంగా చిక్కిపోయింది.
Illegal affair: రాత్రి కారులో ప్రియుడితో భార్య రొమాన్స్, భర్త వీడియో కాల్ చేశాడు, కట్ చేస్తే !

ఫేమస్ ఎగ్ రైస్ వ్యాపారి
కర్ణాటకలోని దావణగెరెలోని జగళూరు పట్టణంలో బిదరకెరె ప్రాంతంలో బసవరాజప్ప అలియాస్ ఎగ్ రైస్ బసవరాజ్, భాగ్యమ్మ అలియాస్ భాగ్య దంపతులు నివాసం ఉంటున్నారు. జగళూరులో బసవరాజ్ తో పాటు చాలా మంది ఎగ్ రైస్ వ్యాపారం చేస్తున్నారు. అయితే జగళూరులో ఎవరైనా ఎగ్ రైస్ తినాలంటే మొదట బసవరాజ్ హోటల్ కే ప్రాధాన్యత ఇస్తారు. రుచికరమైన ఎగ్ రైస్ చెయ్యడంలో బసవరాజ్ హోటల్ చాలా పేరు సంపాధించుకుంది.

ప్రతిరోజు రూ. వేలల్లో లాభాలు
ఎగ్ రైస్ వ్యాపారంలో తనకు తానే సాటి అని నిరూపించుకుని బసవరాజ్ ప్రతిరోజు వేల రూపాయల సంపాధిస్తున్నాడు. అయితే సంపాధించిన డబ్బులు చాలా వరకు భార్య భాగ్యకు బసవరాజ్ ఇవ్వడం లేదని తెలిసింది. తనకు ఎందుకు డబ్బులు ఇవ్వకుండా భర్త బసరాజ్ తెలివిగా తప్పించుకుంటున్నాడు ? అంటూ భార్య భాగ్య ఆరా తీసింది.

గుడ్డు వేరే ఇంట్లో పెడుతున్నాడా ?
బసవరాజ్ కు జగళూరులోనే కౌసల్య అనే మహిళతో అక్రమ సంబంధం ఉందని భార్య భాగ్యకు తెలిసింది. నా భర్త బసవరాజ్ నా ఇంట్లో గుడ్డు పెట్టకుండా కౌసల్య ఇంట్లో గుడ్డు పెడుతున్నాడని తెలుసుకున్న భార్య భాగ్య రగిలిపోయింది. రోజూ ఇంట్లో భర్త బసవరాజ్ అక్రమ సంబంధం విషయంలో భార్య భాగ్య గొడవపెట్టుకునేది. అయినా బసవరాజ్ మాత్రం రోజూ సంపాధిస్తున్న డబ్బులో సగ భాగం ప్రియురాలు కౌసల్యకు తగలేస్తున్నాడని తెలిసింది.

భర్తను లేపేస్తే ఓ పనైపోతుంది
తన భర్త బసవరాజ్ నడుపుతున్న హోటల్ కు మంచి పేరు ఉందని, తన భర్త చెప్పినమాట వినడం లేదని, అతన్ని చంపేస్తే హోటల్ లో వచ్చే లాభం మొత్తం తనకే వస్తుందని భాగ్య ఆలోచించింది. అంతే భాగ్యకు సన్నిహితంగా ఉంటున్న జగళూరులోని నింగనహళ్ళి నివాసి, తన భర్త హోటల్ లో పని చేస్తున్న అంజినప్పకు విషయం మొత్తం చెప్పి నా భర్తను చంపేయాలని స్కెచ్ వేసింది. అంజినప్ప అతని స్నేహితులైన చౌడప్ప, ఆటో డ్రైవర్ మారుతి కలిసి బసవరాజ్ ను చంపేయాలని నిర్ణయించారు.

రాగిముద్దలో 10 నిద్రమాత్రలు మిక్స్
తన భర్త బసవరాజ్ ను హత్య చేస్తే మీకు రూ. 1 లక్ష ఇస్తానని భార్య భాగ్య వారి హోటల్ లో పని చేస్తున్న అంజినప్పతో డీల్ మాట్లాడుకునింది. బుధవారం రాత్రి హోటల్ లో వ్యాపారం ముగించుకున్న బసవరాజ్ క్వాటర్ మందు వేసుకుని ప్రియురాలు కౌసల్య ఇంటికి వెళ్లి ప్రజెంట్ మేడమ్ అంటూ ఆమెతో ఎంజాయ్ చేసి తరువాత అతని ఇంటికి వెళ్లాడు. అప్పటికే ఇంట్లో రాగి ముద్దలో 10కి పైగా నిద్రమాత్రలు కలిపి ముద్ద చేసిన భాగ్య ఇంటికి వెళ్లిన భర్త బసవరాజ్ కు పెట్టింది. భర్తకు అనుమానం రాకుండా నిద్రమాత్రలు కలపకుండా చేసిన మరో రాగి ముద్దను భాగ్య కూడా పెట్టుకుని భర్తతో కలిసి భోజనం చేసింది.

భాగ్య నాటకాలు... జస్ట్ 24 గంటల్లో అరెస్టు
నిద్రమాత్రలు కలిపిన రాగిముద్ద తిన్న బసవరాజ్ నిద్రలోకి జారుకున్నాడు. ఆ సమయంలో ఇంట్లోకి వెళ్లిన అంజినప్ప, చౌడప్పతో కలిసి భార్య భాగ్య భర్త బసవరాజ్ గొంతు నులిమి చంపేశారు. ఆటో డ్రైవర్ మారుతి సహాయంతో బసవరాజ్ శవాన్ని ఊరి బయటకు తీసుకెళ్లి విసిరేశారు. మరుసటి రోజు బసవరాజ్ శవాన్ని గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేశారు. తన భర్త బసవరాజ్ కు కౌసల్యతో అక్రమ సంబంధం ఉందని, ఆమె హత్య చేయించి ఉంటుందని భాగ్య నాటకాలు ఆడింది. అయితే పోలీసులు అనేక కోణాల్లో విచారణ చెయ్యగా అసలు విషయం బయటకు వచ్చింది. ఎగ్ రైస్ వ్యాపారి బసవరాజ్ హత్య కేసులో అతని భార్య భాగ్యతో పాటు వారి హొటల్ లో పని చేస్తున్న అంజినప్ప, చౌడప్ప, ఆటో డ్రైవర్ మారుతిని 24 గంటల్లోపు అరెస్టు చేశామని దావణగెరె పోలీసులు తెలిపారు.