• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Hint: ఒక్కమాటైనా వింటున్నారా ?, మంత్రాలకు చింతకాయలు రాలవు, మేమే డిసైడ్ చేస్తాం, సీఎం!

|

బెంగళూరు: జనతా కర్ఫ్యూ వలన అనుకున్న ఫలితం దక్కలేదు. ఇక ముందు మరింత కఠిన చర్యలు తీసుకుంటాము, లేదంటే సంపూర్ణ లాక్ డౌన్ అమలు చెయ్యడానికి చర్యలు తీసుకుంటామని కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప చిన్న హింట్ ఇచ్చారు. ఇప్పుడు పెట్టిన జనతా కర్ఫ్యూను ఎవరైనా కర్ఫ్యూ అంటారా ?, ప్రజలు చెప్పినా మాట వింటున్నారా ?, ఎంతచెప్పినా ఎవ్వరూ మాట వినడం లేదు, ఇప్పుడు పరిస్థితి చెయ్యిదాటి పోయే పరిస్థితి ఎదరైయ్యింది, మేము ఎంత నెత్తినోరు మొత్తుకున్నా ప్రజలు పట్టించుకోవడం లేదని, కనీసం మాస్కులు పెట్టుకోవడం లేదని, భౌతిక దూరం పాటించడం లేదని సీఎం బీఎస్. యడియూరప్ప విచారం వ్యక్తం చేశారు.

ప్రజలు తీరు చూస్తుంటే మంత్రాలకు చింతకాయలు రాలవు అనే సామెత గుర్తు వస్తోందని సీఎం పరోక్షంగా అన్నారు. అందుకే రేపటి లోపు ఏం చెయ్యాలో మేమే డిసైడ్ చేస్తాం ? అప్పుడే తిక్క కుదురుతుంది అంటూ పరోక్షంగా సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఓ చిన్న క్లూ ఇచ్చేశారు.

Illegal affair: ఫ్రీగా చిక్కిందని వడ్డీ వ్యాపారి రోజూ ఫుల్ మీల్స్, చక్రవడ్డీ లెక్కేసిన ప్రియురాలు!Illegal affair: ఫ్రీగా చిక్కిందని వడ్డీ వ్యాపారి రోజూ ఫుల్ మీల్స్, చక్రవడ్డీ లెక్కేసిన ప్రియురాలు!

ఐటీ హబ్ కు ఎఫెక్ట్

ఐటీ హబ్ కు ఎఫెక్ట్

కరోనా వైరస్ సెకండ్ వేవ్ దెబ్బతో గత 10 రోజుల నుంచి ఐటీ సిటి బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలో జనతా కర్ఫ్యూ (లాక్ డౌన్) అమలలో ఉంది. అయితే కుప్పలు తెప్పలుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. 10 వేల నుంచి ఇప్పుడు 50 వేల మార్క్ వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చేరుకుంది. ఇదే లాక్ డౌన్ సమయంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా పెరిగిపోయింది.

అమ్మ కరుణిస్తుందని ఆశ

అమ్మ కరుణిస్తుందని ఆశ

శుక్రవారం బెంగళూరులోని మెజస్టిక్ సమీపంలోని గాంధీనగర్ లోని ప్రముఖ అణ్ణెమ్మ దేవి ఆలయంలో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ప్రత్యేక పూజలు చేసి కరోనా వైరస్ నుంచి కర్ణాటక ప్రజల, దేశ ప్రజలను కాపాడాలని వేడుకున్నారు. అనంతరం గుడి ముందే సీఎం బీఎస్. యడియూరప్ప విలేకరులతో మాట్లాడారు.

మేము ఏం చెప్పాము ?, వీళ్లు ఏం చేస్తున్నారు

మేము ఏం చెప్పాము ?, వీళ్లు ఏం చేస్తున్నారు

ఏప్రిల్ 28వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు కర్ణాటక ప్రజలు అందరూ జనతా కర్ఫ్యూకు సహకరించాలని తాము పదేపదే మనవి చేస్తున్నామని సీఎం బీఎస్. యడియూరప్ప గుర్తు చేశారు. అయితే ప్రజలు ఏం చేశారు ?, ప్రభుత్వానికి ఏమైనా సహకరించారా ?, కనీసం ముఖాలకు మాస్క్ లు కూడా పెట్టుకోకుండా, భౌతిక దూరం పాటించకుండా రోడ్ల మీదకు వచ్చేస్తున్నారని సీఎం బీఎస్. యడియూరప్ప విచారం వ్యక్తం చేశారు.

మంత్రాలకు చింతకాయలు రాలవు

మంత్రాలకు చింతకాయలు రాలవు

ప్రభుత్వానికి ప్రజలు సహకరించకపోవడం వలనే కరోనా కేసులు తగ్గడం లేదని. అందుకే ఇంకా ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలా ?, లేక సంపూర్ణ లాక్ డౌన్ అమలు చెయ్యాలా ? అనే విషయంలో శనివారం లోపు మేమే డిసైడ్ చేస్తామని, అప్పుడు అందరికి తిక్క కుదురుతుంది అంటూ సీఎం బీఎస్. యడియూరప్ప అన్నారు.

వీపు విమానం మోగుతుంది

వీపు విమానం మోగుతుంది

సీనియర్ మంత్రులు, అధికారులతో ఈరోజు, రేపు (శుక్ర, శనివారాలు) సమావేశాలు నిర్వహించి ఏం చెయ్యాలో మేము డిసైడ్ చేస్తామని అంటున్న సీఎం. బీఎస్ యడియూరప్ప సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తామని పరోక్షంగా క్లూ ఇచ్చారు. సంపూర్ణ లాక్ డౌన్ అమలులోకి వస్తే గత ఏడాది ఏప్రిల్, మే, జూన్ లో ఎలా లాక్ డౌన్ అమలు చేశారో అదే టైపు మళ్లీ లాక్ డౌన్ అమలు చేస్తే అప్పుడు రోడ్ల మీదకు వచ్చే చిల్లరగాళ్లకు వీపు విమానం మోగడం కాయం అని ప్రభుత్వ అధికారులు అంటున్నారు.

కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్లను పంపిస్తున్నారు?

కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్లను పంపిస్తున్నారు?

కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్లను కొందరు కావాలనే సీఎం అధికారిక నివాసం దగ్గరకు పంపిస్తున్నారని సీఎం బీఎస్. యడియూరప్ప విచారం వ్యక్తం చేశారు. ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్న మాట వాస్తవమే అని, అయితే అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కరించుకోకుండా నేరుగా సీఎం కార్యాలయం దగ్గరకు వస్తే ఎలా అంటూ సీఎం బీఎస్. యడియూరప్ప పరోక్షంగా ప్రతిపక్షాల మీద మండిపడ్డారు.

English summary
IT Hub: Karnataka Chief Minister BS Yediyurappa on hinted that the Lockdown like restrictions imposed across State.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X