బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

IT Hub: ఐటీ కంపెనీలో మేనేజర్, కరోనా దెబ్బతో ఉద్యోగం ఊడింది, చైన్ స్నాచింగ్ లు, సార్ ఎంబీఏ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఎంబీఏ పూర్తి చేసిన యువకుడు అతని తెలివితేటలతో ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. మంచి ఉద్యోగం చూస్తూ కాలం గడుపుతున్న యువకుడికి కరోనా దెబ్బతో కష్టాలు మొదలైనాయి. పని చేస్తున్న కంపెనీలో మేనేజర్ తో పాటు అనేక మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. ఉద్యోగం చేస్తున్న సమయంలో అప్పు చెయ్యడం, ఉద్యోగం ఊడిపోవడంతో అప్పులు ఇచ్చిన వారు టార్చర్ పెట్టడంతో ఆ యువకుడికి ఏమి చెయ్యాలో అర్థంకాక సతమతం అయ్యాడు. అంతే రోడ్ల మీదపడిన యువకుడు చైన్ స్నాచింగ్ లు చేసి అప్పులు తీర్చడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్కైపోయాడు.

Recommended Video

Bengaluru Emerges As World’s Fastest Growing Tech Hub || Oneindia Telugu

Illegal affair: భార్య ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్, భర్త ఆంటీల టెక్నీషియన్, రివర్స్ !Illegal affair: భార్య ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్, భర్త ఆంటీల టెక్నీషియన్, రివర్స్ !

ఐటీ కంపెనీలో ఉద్యోగం

ఐటీ కంపెనీలో ఉద్యోగం

బెంగళూరులో నివాసం ఉంటున్న షేక్ గౌస్ బాషా అనే యువకుడు ఎంబీఏ చదివాడు. ఎంబీఏ పూర్తి చేసిన షేక్ గౌస్ బాషా అతని తెలివితేటలతో ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో కొన్ని సంవత్సరాల క్రితం మేనేజర్ గా ఉద్యోగంలో చేరాడు. కంపెనీలో హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటూ వెలుతున్న గౌస్ బాషా మంచి జీతం తీసుకుంటున్నాడు.

అవసరాల కోసం అప్పులు

అవసరాల కోసం అప్పులు

గౌస్ బాషా వ్యక్తిగత అవసరాల కోసం తెలిసిన వాళ్ల దగ్గర కొంచెం అప్పులు చేశాడు. ఉద్యోగం చేస్తున్నామని, నెలనెల జీతం వస్తోందని, ఎలాగైనా చేసిన అప్పులు తీర్చేద్దామని గౌస్ బాషా అనుకున్నాడు. అయితే గౌస్ బాషా అనుకున్నట్లు మాత్రం జరగలేదు. తన ఉద్యోగం ఊడిపోతుందని గౌస్ బాషా అస్సులు ఊహించలేదు.

 కరోనా దెబ్బతో ఉద్యోగం ఫట్

కరోనా దెబ్బతో ఉద్యోగం ఫట్

కరోనా వైరస్ దెబ్బతో లాక్ డౌన్ విధించడంతో గౌస్ బాషాకు కష్టాలు ఎదురైనాయి. గౌస్ బాషా పని చేస్తున్న ఐటీ కంపెనీలో చాలా మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. కరోనా దెబ్బతో చాలా మందితో పాటు గౌస్ బాషా ఉద్యోగం ఊడిపోయింది. ఒక్కసారిగా ఉద్యోగం పోవడంతో గౌస్ బాషాకు ఆర్థిక సమస్యలు ఎదురైనాయి.

జయనగర్ లో చైన్ స్నాచింగ్ లు

జయనగర్ లో చైన్ స్నాచింగ్ లు

గౌస్ బాషాకు ఉద్యోగం ఊడిపోయిందని అతనికి అప్పులు ఇచ్చిన వారికి తెలిసింది. అంతే మేము ఇచ్చిన అప్పులు తిరిగి ఇవ్వాలని గౌస్ బాషా మీద ఒత్తిడి పెరిగిపోయింది. ఏం చెయ్యాలో తెలీక గౌస్ బాషా బెంగళూరులోని జయనగరలోని పూర్ణిమా కన్వెన్షన్ హాల్ సమీపంలో వివాహిత మహిళ మెడలో బంగారు చైన్ లాక్కోవడానికి ప్రయత్నించి అడ్డంగా చిక్కిపోయాడు.

సార్...... నేను మాజీ మేనేజర్..... వదిలేయండి

సార్...... నేను మాజీ మేనేజర్..... వదిలేయండి

గౌస్ బాషాను విచారణ చేసిన పోలీసులు షాక్ అయ్యారు. సార్ నేను ఐటీ కంపెనీలో పని చేసిన మాజీ మేనేజర్, తనకు అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చెయ్యడంతో చైన్ స్నాచింగ్ లు చేస్తున్నానని, కేవలం రూ. 35,000 రుణం తీర్చడానికి దొంగగా మారాను, నన్ను వదిలేయండి అంటూ గౌస్ బాషా పోలీసులను వేడుకుంటున్నాడు. మొత్తం మీద కరోనా వైరస్ దెబ్బతో ఐటీ కంపెనీలో మేనేజర్ ఉద్యోగం ఊడిపోవడంతో గౌస్ బాషా చైన్ స్నాచింగ్ లు చేస్తూ పోలీసులకు పట్టుబడటంతో హాట్ టాపిక్ అయ్యింది.

English summary
IT Hub: MBA holder turns chain snatcher arrested by Bengaluru City Jayanagar police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X