బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Shock: గాడిద మీద మాజీ ఎమ్మెల్యే ఊరేగింపు, ఎందుకు ? ఎక్కడ ? ఏం జరిగిందంటే ?, వాటల్ అంటేనే!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ మైసూరు/ బళ్లారి: కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువస్తున్న వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ కర్ణాటకలో సోమవారం ప్రశాంతంగా బంద్ జరిగింది. అక్కడక్కడ అన్నదాతలు రోడ్ల మీద ఆందోళనకు దిగడంతో వాహన సంచారానికి అటంకాలు ఎదురైనాయి. కర్ణాటకలో బంద్ జరిగినా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగినా మాజీ ఎమ్మెల్యే వాటల్ నాగరాజ్ ప్రత్యక్షం అవుతారు. వాటల్ నాగరాజ్ ఏం చేసినా వెరైటీగా ఉంటుంది. కర్ణాటకలో ఎప్పుడు బంద్ జరిగినా, వాటల్ నాగరాజ్ ఆందోళనకు దిగినా ఆయన ఏం చేస్తారు అంటూ కన్నడిగులు ఆసక్తిగా గమనిస్తారు. రైతులకు మద్దతుగా ఆందోళనకు దిగిన వాటల్ నాగరాజ్ బలంగా ఉన్న గాడిద మీద రారాజు డ్రస్ వేసుకుని వాటల్ నాగరాజ్ ఊరేగింపుగా వెళ్లారు. అయితే సార్.. మీరు చాలా ఎక్కువ దూరం వచ్చేశారు, చాలు రండి అంటూ మాజీ ఎమ్మెల్యే వాటల్ నాగరాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Kangana:కంగనాకు కొవ్వు పట్టింది. దించేస్తాం, రైతులు ఉగ్రవాదులా ? కడుపుకు అన్నం తింటున్నావా ? లేదా ?Kangana:కంగనాకు కొవ్వు పట్టింది. దించేస్తాం, రైతులు ఉగ్రవాదులా ? కడుపుకు అన్నం తింటున్నావా ? లేదా ?

పార్టీ అధ్యక్షుడు.... మాజీ ఎమ్మెల్యే

పార్టీ అధ్యక్షుడు.... మాజీ ఎమ్మెల్యే

కన్నడ చళవళి వాటల్ పార్టీ అధ్యక్షుడు వాటల్ నాగరాజ్ కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వాటల్ నాగరాజ్ మాజీ ఎమ్మెల్యే. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ అనే తేడా లేకుండా అన్ని పార్టీల నాయకులతో వాటల్ నాగరాజ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కర్ణాటకలో వాటల్ నాగరాజ్ అంలే తెలీని వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రతినిత్యం ఏదో ఒక వార్తల్లో వాటల్ నాగరాజ్ ప్రజలను పలకరిస్తూనే ఉంటారు.

వాటల్ అంటే వెరైటి

వాటల్ అంటే వెరైటి

వాటల్ నాగరాజ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు అంటే మీడియా మొత్తం ఆయన ముందు ప్రత్యక్షం అవుతుంది. ఎందుకంటే ఆయన వెరైటి... వెరైటిగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా సోమవారం రైతులు నిర్వహించిన కర్ణాటక బంద్ కు వాటల్ నాగరాజ్, ఆయన మద్దతుదారులు సంపూర్ణ మద్దతు ఇచ్చారు.

వంకాయలు, టెంకాయలు, కొత్తిమీర, కరేపాకు ఫ్రీ

వంకాయలు, టెంకాయలు, కొత్తిమీర, కరేపాకు ఫ్రీ

వాటల్ నాగరాజ్ ధర్నా చేసే స్థలం నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు సంచరించే బెంగళూరులోని మెజస్టిక్ ప్రాంతం. మెజస్టిక్- బీఎంటీసీ బస్ స్టాండ్ ల మద్య భాగంలో వాటల్ నాగరాజ్ ధర్నాలు చెయ్యడం, అక్కడి నుంచి ర్యాలీలు చెయ్యడం ఆయనకు ఆనవాయితి. గతంలో ఉప్పు, టమోటోలు, టెంకాయలు, వంకాయలు, మిరపకాయలు, కొత్తిమీర, కరేపాకు ఇలా ఏదిపడితే అది ప్రజలకు ఉచితంగా పంపిణి చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిరసన వ్యక్తం చేసిన వాటల్ నాగరాజ్ ఆయన ప్రత్యేకతలు చాటుకుని ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు.

 కర్ణాటకలో ఏక్ నిరంజన్

కర్ణాటకలో ఏక్ నిరంజన్

వాటల్ నాగరాజ్ చేసిన వెరైటీ ధర్నాలు, ర్యాలీలు కర్ణాటకలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఇంత వరకు చెయ్యలేదు, ఆ సాహసం ఎవ్వరూ చెయ్యలేరు.వాటల్ నాగరాజ్ అంటేనే అంత వెరైటి అన్నమాట. వాటల్ నాగరాజ్ కు పోటీగా అన్ని వెరైటీ కార్యక్రమాలు చేసిన మరో రాజకీయ నాయకుడు కర్ణాటకలో ఒక్కరు కూడా లేరు. కన్నడ బాషను ఎవరైనా చులకనగా మాట్లాడినా, చివరికి కేంద్ర ప్రభుత్వం అయినా కించపరిచే విధంగా మాట్లాడితే వాటల్ నాగరాజ్ కు ఎక్కడో మండిపోతుంది. కన్నడ బాష అన్నా, కన్నడిగులు అన్నా ఆయనకు అంత ప్రేమ, ప్రాణం.

గాడిద మీద రారాజు డ్రస్ లో ర్యాలీ

గాడిద మీద రారాజు డ్రస్ లో ర్యాలీ

సోమవారం రైతులకు మద్దతు ఇస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే వాటల్ నాగరాజ్ ఆందోళనకు దిగారు. బెంగళూరు నగరం నడిబొడ్డులోని మెజస్టిక్- బీఎంటీసీ బస్ స్టాండ్ ల మద్యన ఉన్న రహదారిలో బలంగా ఉన్న గాడిదను పట్టుకుని వాటల్ నాగరాజ్ అక్కడికి వెళ్లారు. తరువాత రారాజు దుస్తుల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వాటల్ నాగరాజ్ గాడిద మీద కుర్చుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

బిత్తరపోయిన జనాలు, పోలీసులు

బిత్తరపోయిన జనాలు, పోలీసులు


మెజస్టిక్ దగ్గర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే వాటల్ నాగరాజ్, ప్రముఖ సినీ నిర్మాత సా.రా. గోవింద్, కన్నడ సంఘం నేత కేఆర్. కుమార్, గిరీష్ గౌడ తదితరులు నినాదాలు చేశారు. అప్పటికే వందలాది మంది ప్రయాణికులు అక్కడ గుమికూడటంతో పదుల సంఖ్యలో బీఎంటీసీ సిటీ బస్సులు, కేఎస్ఆర్ టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆ సమయంలో మెజస్టిక్ ప్రాంతం వాటల్ నాగరాజ్ ధర్నాతో కిక్కిరిసిపోయింది. అక్కడి నుంచి గాడిద మీద ర్యాలీగా బయలుదేరిన వాటల్ నాగరాజ్ తదితరులను పోలీసులు మద్యలోనే అడ్డుకుని పోలీసు వాహనాల్లో పోలీస్ స్టేషన్ కు తరలించారు. మొత్తం మీద మాజీ ఎమ్మెల్యే వాటల్ నాగరాజ్ గాడిద మీద ఊరేగింపుతో కొంతసేపు ట్రాఫిక్ అస్థవ్యస్థం అయ్యింది.

English summary
Karnataka Bandh: Karnataka bandh by farmer and other organizations protesting against farmer and labor against move by the government. Kannada Chaluvali Vatal Paksha leader Vatal Nagaraj detained by police at Majestic bus stand Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X