బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Karnataka Bandh: బెంగళూరులో హై అలర్ట్, బస్సులపై రాళ్లదాడి, హ్యాండ్ ఇచ్చిన వ్యాపారులు, సీన్ రివర్స్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ బెళగావి/ ముంబాయి: కర్ణాటకలో మరాఠీ అభివృద్ది మండలి ఏర్పాటు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కన్నడ సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. కర్ణాటక ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ డిసెంబర్ 5వ తేదీ శనివారం కర్ణాటక బంద్ కు పలు సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే కన్నడ సంఘాల పిలుపుకు పలు జిల్లాలో ప్రజలు బంద్ కు సహకరించినా కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో మాత్రం స్థానిక ప్రజలు పెద్దగా సహకరించడం లేదు. శనివారం ఉదయం నుంచి బెంగళూరులోని అనేక ప్రాంతాల్లో ఎప్పటిలాగే వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతుండటంతో కన్నడ సంఘాలు మండిపడుతున్నాయి. బెంగళూరులో కొన్ని ప్రాంతాల్లో బస్సుల మీద రాళ్లదాడి చెయ్యడంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి.

Recommended Video

Karnataka bandh over Maratha board: What is open, what is closed

Sadist: పెళ్లి కొడుక్కి బెంజ్ కారు, 5 కేజీ బంగారు, ఫస్ట్ నైట్ భరత్ రెడ్డి ఏం చేశాడంటే ? శోభనం చెట్టెక్కింది, కథ !Sadist: పెళ్లి కొడుక్కి బెంజ్ కారు, 5 కేజీ బంగారు, ఫస్ట్ నైట్ భరత్ రెడ్డి ఏం చేశాడంటే ? శోభనం చెట్టెక్కింది, కథ !

తల ఎక్కడ పెట్టుకోవాలి ?

తల ఎక్కడ పెట్టుకోవాలి ?

కర్ణాటకలో మరాఠీ అభివృద్ది మండలి ఏర్పాటు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో మరాఠీ అభివృద్ది మండలి ఏర్పాటు ఏమిటి ?, ఇప్పటికే బెళగావి జిల్లా (కర్ణాటక) మొత్తం మరాఠీ మయం అయిపోయిందని, అక్కడి నాయకులు మరాఠీలే ఎక్కువ అయ్యారని, బెళగావి జిల్లాతో పాటు మహారాష్ట్ర సరిహద్దులోని కర్ణాటక భూభాగంలో తాము తల ఎత్తుకుని తిరగలేకపోతున్నామని కన్నడ సంఘాలు మండిపడుతున్నాయి.

మీకు పౌరుషం ఉంటే ఎత్తేయండి

మీకు పౌరుషం ఉంటే ఎత్తేయండి

కర్ణాటకలో మరాఠీ అభివృద్ది మండలి ఏర్పాటు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కన్నడ సంఘాలు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నాయి. కర్ణాటకలో మరాఠీ బాషను వీళ్లు పెంచిపోషించాలని అనుకుంటున్నారని కన్నడ సంఘాలు కర్ణాటక ప్రభుత్వాన్ని, బీజేపీ నాయకులను నిలదీస్తున్నాయి. వెంటనే మరాఠీ అభివృద్ది మండలి బోర్డు ఏర్పాటును ఉపసంహరించుకోవాలని కన్నడ సంఘాలు డిమాండ్ చేశాయి.

మౌనంగా పలు పార్టీలు ?

మౌనంగా పలు పార్టీలు ?

కన్నడ సంఘాలు డిమాండ్లను అధికార పార్టీకి చెందిన బీజేపీ నాయకులతో పాటు పలు పార్టీలకు చెందిన నాయకులు మౌనంగా ఉన్నారు. కొందరు మరాఠీ అభివృద్ది మండలి బోర్డు ఏర్పాటు చెయ్యడాన్ని స్వాగతిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం చెప్పిన మాటకు కట్టుబడి ఉండటంతో ప్రభుత్వ పెద్దలు, కన్నడ సంఘాల మద్య వివాదం ముదిరిపోయింది. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శనివారం కన్నడ సంఘాలు కర్ణాటక బంద్ కు పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

బెంగళూరులో ఇది సీన్

బెంగళూరులో ఇది సీన్


కర్ణాటక రాష్ట్ర రాజధాని, ఐటీబీటీ సంస్థల హబ్ బెంగళూరులో శనివారం బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఎప్పటిలాగే చాలా ప్రాంతాల్లో వ్యాపార కార్యకలాపాలు, వారి దినచర్యలు ప్రారంభించారు. బెంగళూరు సిటీలో కూరగాయలు, పండ్లు, దినసరి సరుకులతో పాటు అనేక వ్యాపారాలకు కేంద్ర బింధువు అయిన కేఆర్ మార్కెట్ లో వ్యాపారలావాదేవీలు జరుగుతున్నాయి.

ఒక్కరోజు మామాట వినండి...... కుదరదు

ఒక్కరోజు మామాట వినండి...... కుదరదు

బెంగళూరులో ఇప్పటికే కన్నడ బాష మాట్లాడే వారి సంఖ్య పెరిగిపోతుందని, ఇప్పుడు మరాఠీ అభివృద్ది మండలి బోర్డు ఏర్పాటు చేస్తే మొదటికే మోసం వస్తోందని కన్నడ సంఘాలు వ్యాపారులకు మనవి చేశారు. ఇప్పటికే కరోనా కారాణంగా లేనిపోని ఆర్థిక సమస్యలు ఎదర్కొన్నామని, ఇక మీరు బంద్ తొక్కతొటారం అంటే మేము ఏమీ చెయ్యలేమని వ్యాపారులు తేల్చిచెప్పడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

బెంగళూరులో భారీ బందోబస్తు

బెంగళూరులో భారీ బందోబస్తు

ఇతర ప్రాంతాల నుంచి ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోవడానికి, వారి సొంత పనుల మీద బెంగళూరు వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చిన సందర్బంగా ఆ రాష్ట్రంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బెంగళూరు సిటీలో బంద్ కు అనుమతి ఇవ్వకపోవడం, బంద్ చేస్తామని కన్నడ సంఘాలు పట్టుబట్టడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

బెంగళూరులో రాళ్ల వర్షం

బెంగళూరులో రాళ్ల వర్షం

బెంగళూరులో కొన్ని ప్రాంతాల్లో శనివారం ఉదయం సంచరిస్తున్న ఆర్ టీసీ, బీఎంటీసీ బస్సులపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు వర్షం కురిపించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ఆందోళనకారులు పరుగు తీశారు. బెంగళూరు సిటీలో 15 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశామని, ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ కమల్ పంత్ అల్లరిమూకలను హెచ్చరించారు.

English summary
Karnataka Bandh: Pro-Kannada organisations have called for a bandh today against state govt s decision to form Maratha Development Authority.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X