బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రివర్గ విస్తరణ: కొత్త మంత్రుల జాబితా ఇదే: రాజ్‌భవన్‌లో కాస్సేపట్లో ప్రమాణం: అసమ్మతి భగ్గు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరింది. ఏడుమందితో మంత్రివర్గం విస్తరణకు చురుగ్గా కార్యక్రమాలు సాగుతున్నాయి. ఈ సారి ఏకంగా ఏడుమంది కొత్త ముఖాలకు కేబినెట్‌లో చోటు దక్కబోతోంది. దేశ రాజధాని వేదికగా మంత్రివర్గం విస్తరణకు సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తయింది. ఎవరెవరికి కేబినెట్ బెర్త్ కన్‌ఫర్మ్ అయిందనే విషయాన్ని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప వెల్లడించారు.

భోగి వేడుకల్లో చంద్రబాబు: వైఎస్ జగన్ నిర్ణయాల వల్ల సంక్రాంతి చిన్నబోయింది: ఆ జీవోల దగ్ధంభోగి వేడుకల్లో చంద్రబాబు: వైఎస్ జగన్ నిర్ణయాల వల్ల సంక్రాంతి చిన్నబోయింది: ఆ జీవోల దగ్ధం

కొత్తగా ఎంటీబీ నాగరాజు, ఉమేష్ కత్తి, అరవింద్ లింబావలి, మురుగేష్ నిరానీ, ఆర్ శంకర్, అంగర ఎస్‌, సీపీ యోగేశ్వరలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈ మధ్యాహ్నం వారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 3:50 నిమిషాలకు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించడానికి రాజ్‌భవన్‌లోెె సన్నాహాలు సాగుతున్నాయి. గవర్నర్ వజూభాయ్ వాలా వారితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, ఉప ముఖ్యమంత్రులు, తోటి మంత్రులు హాజరు కానున్నారు.

Karnataka CM BS Yediyurappa announces list of new minister who will take oath today

మొదట్లో సునీల్ కుమార్‌, రేణుకాచార్య, బసనగౌడ పాటిల్, ఎస్ఆర్ విశ్వనాథ, మునిరత్నను తీసుకుంటారనే ప్రచారం జోరుగా సాగింది. చివరి నిమిషంలో తుది జాబితాలో మార్పులు చోటు చేసుకున్నాయని అంటున్నారు పెద్దగా ప్రచారంలో లేని మురుగేష్ నిరానీ, అంగర ఎస్ పేర్లు జాబితాలో చేరాయి. భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం ఆమోదించిన జాబితాలోనూ స్థానిక అంశాలు, రాజకీయాలను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేశారని తెలుస్తోంది.

ప్రత్యేకించి- రేణుకాచార్య, మునిరత్నలకు బదులుగా ఈ ఇద్దరిని తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. తాజాగా చోటు చేసుకున్న మార్పులతో అసమ్మతి రాజుకుంటోంది. మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ముందే.. అసమ్మతి గళం వినిపిస్తోంది. ఇదివరకు కాంగ్రెస్‌లో కొనసాగిన మునిరత్న.. బీజేపీలో చేరారు. గత ఏడాది నిర్వహించిన ఉప ఎన్నికలో బెంగళూరు పరిధిలోని రాజరాజేశ్వరి నగర స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు. కేబినెట్‌లో చోటు కల్పిస్తామనే హామీతోనే ఆయన కాంగ్రెస్‌ను వీడారని, విస్తరణ సమయంలో హ్యాండిచ్చారని ఆయన వర్గీయులు భగ్గుమంటున్నారు.

English summary
Karnataka Chief Minister BS Yediyurappa announces list of new minister who will take oath today at 3:50 PM. MTB Nagaraj, Umesh Katti, Aravind Limbavali, Murugesh Nirani, R Shankar, CP Yogeeshwara, Angara S will take oath as ministers today at Raj Bhavan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X