• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

యడ్డీ మెడపై హైకోర్టు తీర్పు కత్తి.. తప్పని ఉద్వాసన..? సీఎం రేసులో ఉన్నది వీరే..?

|

కర్ణాటక సీఎం యడియూరప్పకు పదవీ గండం పొంచి ఉంది. ఐటీ పార్కుల కోసం కేటాయించిన భూమిలో హైకోర్టు తీర్పు కత్తి వేలాడుతోంది. ఇటీవల హైకోర్టు పిటిషన్ కొట్టివేయడంతో.. ఆయనను పదవీ నుంచి తప్పించాలని బీజేపీ హై కమాండ్ భావిస్తోంది. యడియూరప్ప వారసుడి కోసం ప్రధాని మోడీ, హోం మంత్రి చర్చిస్తున్నట్టు తెలిసింది. ఇద్దరు నేతల గురించి చర్చిస్తున్నారని.. ఒకరి అభ్యర్థిత్వం ఫైనల్ అయ్యే అవకాశం ఉంది.

4 ఎకరాల భూమి డీ నోటిఫై..

4 ఎకరాల భూమి డీ నోటిఫై..


ఐటీ పార్కుల కోసం కేటాయించిన 4 ఎకరాలకు పైగా భూమిని డీ నోటిఫై చేసి.. గృహ నిర్మాణ అవసరాలకు మళ్లించడం ద్వారా యడియూరప్ప అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు జరపాలని 2013లో లోకాయుక్త ప్రత్యేక కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. అయితే దానిని కొట్టి వేయాలని సీఎం యడ్యూరప్ప హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. రెండు రోజుల క్రితం కొట్టివేసింది.

వన్ ఇండియా స్పెషల్ పేజ్: మీ ఫ్రెండ్స్‌కు ఈ - గ్రీటింగ్స్‌తో న్యూఇయర్ విషెస్ చెప్పండి.. అంతేకాదు ఆఫర్లు కూడా చూడం

లోకాయుక్త తీర్పు..

లోకాయుక్త తీర్పు..

భూమి కేటాయింపుపై యడియూరప్ప నిర్ణయంపై దర్యాప్తు జరగాల్సిందేనని.. అది పకడ్బందీగా జరిగేలా లోకాయుక్త కోర్టు పర్యవేక్షించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. యడియూరప్ప ఎంతకాలం పదవీలో ఉంటారనే అంశం చర్చనీయాంశమైంది. దీంతోపాటు యడియూరప్ప ఫ్యామిలీ అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతోందని కథనం ప్రసారం చేసిన ఓ టీవీ చానెల్‌పై పోలీసులు దాడి చేసి మూసివేసింది. దీనిపై కూడా బీజేపీ హైకమాండ్ అసంతృప్తితో ఉందని తెలుస్తోంది. 75 ఏళ్లు దాటిన నేతలు పదవుల్లో కొనసాగించకూడదని బీజేపీ నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో యడియూరప్ప శక్తిమంతుడైన నాయకుడు కావడంతో మోదీ, షా సీఎంగా కొనసాగించాల్సి వచ్చింది.

యడ్డీ ప్రతిపాదనకు నో

యడ్డీ ప్రతిపాదనకు నో

రాజ్యసభ అభ్యర్థుల విషయంలో యడియూరప్ప ప్రతిపాదనలను బుట్టదాఖలు చేశారు. మంత్రివర్గ విస్తరణపై యడియూరప్ప ఢిల్లీలో మకాం వేసినా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకపోవడం వంటి చర్యల ద్వారా బీజేపీ పెద్దలు సానుకూలంగా లేరనే సంకేతాలు పంపారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో యడియూరప్ప ప్రత్యామ్నాయం చూడక తప్పదనే నిర్ణయానికి వచ్చారు. విషయం తెలిసిన యడియూరప్ప ఫిబ్రవరి 27న తన పుట్టినరోజు వరకు కొనసాగించాలని, ఆ తర్వాత తాను అధిష్ఠానం సూచించిన వ్యక్తికి నాయకత్వం అప్పగిస్తానని కోరినట్టు సమాచారం. మరీ దీనిపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకొనుందో చూడాలీ.

ఇద్దరీలో ఒకరు..

ఇద్దరీలో ఒకరు..

యడియూరప్ప స్థానంలో మరొకరిని నియమించే విషయంపై పార్టీలో డిస్కషన్స్ జరుగుతున్నాయని సీనియర్‌ నేత ఒకరు చెప్పారు. సీఎంను మార్చే విషయమై ఒకట్రెండు రోజులుగా చర్చలు వేగవంతమయ్యాయని తెలిపారు. యడియూరప్ప స్థానంలో ఎవరిని నియమిస్తారనే విషయంలో పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కొత్త సీఎం రేసులో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి, లింగాయత్‌ నేత లక్ష్మణ్‌ సావడి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరిని సీఎంగా నియమించే ఛాన్స్ ఉంది.

English summary
karnataka cm yediyurappa likely to resign his post because 4 acre it park land issue turned out to homes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X