కర్ణాటక సీఎం యడ్యూరప్పకు కరోనా పాజిటివ్ .. రెండో సారి మహమ్మారి బారిన పడిన సీఎం
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప కరోనా మహమ్మారి బారిన పడ్డారు. గతంలో ఒకసారి కరోనా బారిన పడగా యడ్యూరప్పకు మళ్లీ రెండోసారి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం బెంగళూరులోని రామయ్య మెమోరియల్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

జ్వరంతో ఆస్పత్రికి వెళ్ళిన యడ్యూరప్పకు కరోనా పాజిటివ్ నిర్ధారణ
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. గత రెండు రోజులుగా ఆయనకు జ్వరం వస్తుండడంతో కుటుంబ సభ్యులు ఆయనను బెంగళూరులోని రామయ్య మెమోరియల్ ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజుల క్రితం ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా చేశారు. అయితే అప్పుడు కరోనా నెగిటివ్ వచ్చింది. మళ్లీ ఇప్పుడు జ్వరంతో ఆసుపత్రిలో చేరిన యడ్యూరప్పకు మరోసారి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా , కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

ట్విట్టర్ లో వెల్లడించిన సీఎం , తనను కలిసిన వారంతా హోం క్వారంటైన్ అవ్వాలని సూచన
తనకు కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప ఈ రోజు ట్వీట్ చేశారు. ట్విట్టర్లో ఒక ఈ పోస్ట్ పెట్టిన యడ్యూరప్ప తాను బాగానే ఉన్నానని కాని వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరాను అని వెల్లడించారు. కొద్దిగా జ్వరం రావడంతో మరోమారు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆయన చెప్పారు. ఇటీవల తనను కలవడానికి వచ్చిన వారందరినీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, సెల్ఫ్ క్వారంటైన్ అవ్వాలని అభ్యర్థిస్తున్నాను అని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.

ఈ రోజు కరోనా కంట్రోల్ కోసం అత్యవసర సమావేశం నిర్వహించిన సీఎం
గతేడాది ఆగస్టులో ఒకమారు ముఖ్యమంత్రి యడ్యూరప్ప కరోనా బారిన పడ్డారు.
కరోనావైరస్ కేసుల పెరుగుదల మధ్య, రాష్ట్రంలోని కోవిడ్ -19 పరిస్థితిపై చర్చించడానికి కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప ఈ రోజు తన నివాసంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 14,738 తాజా కరోనా కేసులు, 66 మరణాలు గత 24 గంటల్లో కర్ణాటక రాష్ట్రంలో నివేదించిన తరువాత ఈరోజు అత్యవసర సమావేశం నిర్వహించారు.

కరోనా కట్టడికి కీలక ఆదేశాలు.. కొద్దిసేపటికే సీఎం యడ్యూరప్పకు పాజిటివ్
సీఎం యడ్యూరప్పతో కరోనా పరిస్థితి పై రాష్ట్ర అధికారులు ఆయనతో భేటీ అయ్యారు. కరోనా దారుణ పరిస్థితులపై చర్చించారు, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు . ప్రైవేట్ ఆస్ప్తుల దోపిడీపై వార్నింగ్ ఇచ్చారు . ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్స్ పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా కఠిన నియమాలు అమలు చెయ్యాలని అధికారులను ఆదేశించారు . ఆ తర్వాత కొద్ది సేపటికే సీఎం యడ్యూరప్పకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.