బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Injection: ఇంజెక్షన్ కోసం మాజీ సీఎం 45 నిమిషాలు వెయిటింగ్. ఎయిర్ పోర్టులో ఏం జరిగిందంటే ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ బెళగావి: మాజీ ముఖ్యమంత్రి ఒక Injection వేసుకోవడానికి 45 నిమిషాల పాటు వేచి చూడాల్సి వచ్చింది. మాజీ సీఎం పీఏ మతిమరుపుతో ఇంజెక్షన్ అందుబాటులో లేకపోవడంతో మాజీ సీఎం ఎయిర్ పోర్టులో 45 నిమిషాల పాటు ఇంజెక్షన్ కోసం వేచిచూడాల్సి వచ్చింది. ఇంజెక్షన్ వేసుకున్న తరువాత అక్కడి నుంచి కదలాలని మాజీ సీఎం డిసైడ్ కావడంతో అక్కడ కొంతసేపు హైడ్రామా నెలకొంది. అయితే మైసూరు పులికి ఏం కాదులే అంటూ సాటి నాయకులు, సీఎం సన్నిహితులు జోకులు వెయ్యడంతో ఆ 45 నిమిషాలు అలాఅలా గడిచిపోయింది.

Illegal affair: భర్త ఎగ్ రైస్ వ్యాపారి, గుడ్డు పక్కింట్లో పెడుతున్నాడని రాగిముద్దతో చంపేసిన భార్య!Illegal affair: భర్త ఎగ్ రైస్ వ్యాపారి, గుడ్డు పక్కింట్లో పెడుతున్నాడని రాగిముద్దతో చంపేసిన భార్య!

 మాజీ సీఎం జిల్లా టూర్

మాజీ సీఎం జిల్లా టూర్

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక విధాన సౌధలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్యకు ( Congress) చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య బాగల్ కోటే జిల్లాలో పర్యటించడానికి సోమవారం బెళగావిలోని సాంబ్రా విమానాశ్రయం చేరుకున్నారు. మాజీ సీఎం సిద్దరామయ్యకు మాజీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు బెళగావి సాంబ్రా విమానాశ్రయంలో స్వాగతం పలికారు.

 టిఫిన్ అయ్యింది..... ఇంజెక్షన్ ఎక్కడ ?

టిఫిన్ అయ్యింది..... ఇంజెక్షన్ ఎక్కడ ?

బెళగావిలోని సాంబ్రా విమానాశ్రయంలో అల్పాహారం ఆరగించిన మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య వెంటనే ఆయన పీఏని పిలిచారు. ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకురావాలని మాజీ సీఎం సిద్దరామయ్య చెప్పారు. అంత వరకు తాఫీగా టిఫిన్ చేసిన పీఏ నీళ్లు నమిలాడు. ఏందయ్య ఇంజెక్షన్ తీసుకురమ్మంటే ఆలోచిస్తున్నావ్ ? అంటూ మాజీ సీఎం సిద్దరామయ్య ప్రశ్నించారు.

 ఓరినీ దుంపతెగ.... మతిమరుపు ఎక్కువైయ్యింది

ఓరినీ దుంపతెగ.... మతిమరుపు ఎక్కువైయ్యింది

సార్.... ఇన్సులిన్ ఇంజెక్షన్ మరిచిపోయాము అంటూ పీఏ సమాధానం చెప్పడంతో ఓరినీ దుంపతెగ నీకు ఈ మధ్య మతిమరుపు ఎక్కువైపోయింది అంటూ మాజీ సీఎం సిద్దరామయ్య అక్కడే కుర్చుకున్నారు. ఎయిర్ పోర్టులో ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్ అశోక్ పట్టణ వెంటనే ఆయన కారు డ్రైవర్ ను పిలిచి బెళగావి సిటీలోకి వెళ్లి ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకురావాలని సూచించారు.

 ఎయిర్ పోర్టులో 45 నిమిషాలు

ఎయిర్ పోర్టులో 45 నిమిషాలు

బెళగావి సిటీలోకి వెళ్లి ఇన్సులిన్ ఇంజెక్షన్ ను ఎయిర్ పోర్టు దగ్గరకు తీసుకురావడానికి సుమారు 45 నిమిషాలకు పైగా అయ్యింది. అంతసేపు ఎయిర్ పోర్టులోనే ఉన్న మాజీ సీఎం సిద్దరామయ్య తరువాత ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకుని ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చారు. మన సిద్దరామయ్య మైసూరు పులి, ఇంజెక్షన్ లేకపోయినా ఆయనకు ఏమీ కాదులే అంటూ కాంగ్రెస్ పార్టీ లీడర్ అశోక్ పట్టణ జోకులు వెయ్యడంతో సిద్దరామయ్యతో పాటు అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్స్ పకపకా నవ్వేశారు.

English summary
Karnataka former CM Siddaramaiah waited 45 minutes for insulin injection in Airport in Belagavi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X