బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Cinema Sketch: మాజీ మంత్రి కిడ్నాప్, రూ. 30 కోట్లు డిమాండ్, మూడు రోజులు చిత్రహింసలు, ఏం జరిగిందంటే?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ జయనగర్: ఓ రాష్ట్రంలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఊహించని విధంగా మంత్రి పదవితో చక్రం తిప్పిన రాజకీయ నాయకుడిని గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారులోనే సినిమా స్కెచ్ లెవల్లో కిడ్నాప్ చేశారు. మాజీ మంత్రిని కిడ్నాప్ చేసిన నిందితులు మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసి ముప్పుతిప్పలు పెట్టారు. రూ. 30 కోట్లు ఇస్తే వదిలేస్తాం, లేదంటే లేపేస్తాం అంటూ కిడ్నాపర్లు బెదిరించారు. ఇనుప రాడ్లు, కర్రలతో మూడు రోజులు మాజీ మంత్రిని చిత్రహింసలకు గురి చేశారు.

తరువాత చేతికి చిక్కిన డబ్బులు లాక్కొని ఆయన్న నిర్జనప్రదేశంలో వదిలేసి వెళ్లిపోవడం కలకలం రేపింది. కిడ్నాపర్లకు మాజీ మంత్రి రూ. 1. 50 కోట్లు ఇచ్చారని తెలిసింది. అయితే మాజీ మంత్రి తాను కిడ్నాపర్లకు రూ. 48 లక్షలు ఇచ్చానని పోలీసులకు చెప్పారు. కిడ్నాప్ అయిన మాజీ మంత్రి ఒక మాజీ సీఎంకు అత్యంత సన్నిహితుడు.

Lady inspector: మేడమ్ ముట్టుకుంటే రూ. లక్ష, టచ్ చేస్తే రూ. 30 వేలు, నల్లతంబికి మండింది, అంతే!Lady inspector: మేడమ్ ముట్టుకుంటే రూ. లక్ష, టచ్ చేస్తే రూ. 30 వేలు, నల్లతంబికి మండింది, అంతే!

ఆంధ్రా- కర్ణాటక బార్డర్ లో పొలిటికల్ హీరో

ఆంధ్రా- కర్ణాటక బార్డర్ లో పొలిటికల్ హీరో

ఆంధ్రప్రదేశ్- కర్ణాటక సరిహద్దులోని కోలారు శాసన సభ నియోజక వర్గం (కర్ణాటక) నుంచి ఆర్. వర్తూరు ప్రకాష్ రెండు సార్లు స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. కర్ణాటకలో స్వతంత్ర పార్టీ అభ్యర్థులకు డిమాండ్ పెరగడంతో వర్తూరు ప్రకాష్ కు ఊహించని విధంగా మంత్రి పదవి దక్కింది. నక్కతోక తొక్కినట్లు వర్తూరు ప్రకాష్ మంత్రిగా కర్ణాటక రాజకీయాల్లో చక్రం తిప్పారు.

ఫామ్ హౌస్ కు వెళితే మాజీ మంత్రి కిడ్నాప్

కోలారు సమీపంలోని బెగ్లిహోసహళ్ళి ప్రాంతంలో మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ కు సొంత ఫామ్ హౌస్ ఉంది. నవంబర్ 25వ తేదీన వర్తూరు ప్రకాష్ కోలారు సమీపంలోని ఫామ్ హౌస్ కు వెళ్లారు. అదే రోజు రాత్రి 7 గంటల సమయంలో కారు డ్రైవర్ సునీల్ తో పాటు వర్తూరు ప్రకాష్ ఆయన కారులో బెంగళూరుకు బయలుదేరారు. ఫామ్ హౌస్ నుంచి ఒక్క కిలోమీటరు దూరం వెళ్లిన మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ కు బ్యాడ్ టైమ్ ఎదురైయ్యింది.

 బాలీవుడ్ సినిమా స్కెచ్ తో కిడ్నాప్

బాలీవుడ్ సినిమా స్కెచ్ తో కిడ్నాప్

రెండు కార్లలో 8 మంది దుండగులు ముఖాలకు మాస్కులు వేసుకుని వెళ్లి మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ కారును అడ్డగించారు. తరువాత ఇనుప రాడ్లు, కత్తులతో బెదిరించిన కిడ్నాపర్లు మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్, ఆయన కారు డ్రైవర్ సునీల్ ను అదే కారులోని మద్య సీట్లు కుర్చోబెట్టారు. మాజీ మంత్రి ప్రకాష్, ఆయన కారు డ్రైవర్ సునీల్ కళ్లకు గంతలు కట్టి కారులో తిప్పుతూ గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు.

రూ. 30 కోట్లు ఇవ్వకుంటే లేపేస్తాం

రూ. 30 కోట్లు ఇవ్వకుంటే లేపేస్తాం

మాకు రూ. 30 కోట్లు ఇవ్వకుంటే నిన్ను చంపేస్తామని కిడ్నాపర్లు మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ ను బెదిరించారని సమాచారం. డబ్బులు ఇవ్వడానికి మాజీ మంత్రి నిరాకరించడంతో మూడు రోజుల పాటు ఆయన్ను ఇనుప రాడ్లతో దాడి చేసి చిత్రహింసలు పెట్టారని తెలిసింది. మాజీ మంత్రి కారు డ్రైవర్ సునీల్ ను సైతం కిడ్నాపర్లు చితకబాదేశారని తెలిసింది. అనంతరం డబ్బులు ఇవ్వడానికి మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ అంగీకరించాడని తెలిసింది.

హుషార్... కేసు పెడితే ఫినిష్

హుషార్... కేసు పెడితే ఫినిష్

మూడు రోజులు మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ ను చిత్రహింసలకు గురి చేసిన కిడ్నాపర్లు పోలీసులకు చిక్కిపోతామనే భయంతో చివరి ఆయన్ను హోస్ కోటే సమీపంలోని శివనాపుర గ్రామం సమీపంలో అర్దరాత్రి వదిలేసి ఆయన కారు ఎత్తుకుని వెళ్లిపోయారు. స్థానికుల సహాయంతో బెంగళూరులోని కేఆర్ పురం చేరుకున్న మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ అక్కడి సత్యసాయి ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని తరువాత ఇంటికి వెళ్లారు.

రూ. 1. 50 కోట్లా ?, రూ. 48 లక్షలా

రూ. 1. 50 కోట్లా ?, రూ. 48 లక్షలా

డిసెంబర్ 1వ తేదీ రాత్రి బెంగళూరులోని బెళ్లందూరులోని స్మశానవాటికలో మాజీ మంత్రి వర్తూరు ప్రకాస్ పార్చనూర్ కారు గుర్తించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ బెళ్లందరూరు చేరుకుని అక్కడి పోలీసులకు తానను కిడ్నాప్ చేశారని కేసు పెట్టారు. మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ అనుచరుడు నయాజ్ అనే వ్యక్తి కోలారు సమీపంలోని కాఫీ డే దగ్గర కిడ్నాపర్లకు రూ. 48 లక్షలు ఇచ్చాడని, రెండు రోజుల తరువాత తనను వదిలేశారని మాజీ మంత్రి పోలీసులకు చెప్పారు. అయితే కిడ్నాపర్లకు మాజీ మంత్రి రూ. 1. 50 కోట్లు ఇచ్చారని సమాచారం.

Recommended Video

Bengaluru : బిర్యానీ పిచ్చి.. ప్రాణాల కంటే బిర్యానే ఎక్కువా? || Oneindia Telugu
అసలు ఏం జరిగింది?

అసలు ఏం జరిగింది?

మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ కు ఓ వర్గంలో మంచి పేరు ఉంది. కర్ణాటకలో గత అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా సొంతంగా పార్టీ పెట్టిన వర్తూరు ప్రకాష్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు వర్తూరు ప్రకాష్ అంత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ ను కిడ్నాప్ చేసింది ఎవరు ? అసలు ఏం జరిగింది ? అని విచారణ చేస్తున్నామని బెంగళూరులోని వైట్ ఫీల్డ్ ఉప విభాగం సీనియర్ పోలీసు అధికారి డి. దేవరాజ్ మీడియాకు చెప్పారు. మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ కిడ్నాప్ కావడం కర్ణాటకలో కలకలం రేపింది.

English summary
Karnataka former minister Varthur R prakash kidnapped by unknown persons and demanded for Rs. 30 crores, case is registered in Bellanduru police station in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X