కన్నతల్లిపైనే అఘాయిత్యం -మద్యం తాగించి రేప్, హత్య -ఆమెకు కొడుకుతోనూ ఉందన్న పోలీసులు
మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి ఇప్పటిదాకా చాలా వార్తలు చదువుకున్నాం. పెద్దగా ప్రధాన్యం లేని(నాన్-హైప్రొఫైల్) కేసులను పోలీసుల దర్యాప్తు చేసే తీరు.. పూర్తిస్థాయిలో ఆధారాలు దొరక్కముందే బాధితురాళ్ల క్యారెక్టర్ ను ఉద్దేశించి అధికారులు చేసే అనుచిత కామెంట్లు కూడా చాలానే చూశాం. తాజాగా కర్ణాటకలోని హవేరీ జిల్లాలో చోటుచేసుకున్న ఉదంతం ఈ పరిణామాలకు పీక్స్ లా నిలిచింది. కన్నతల్లే తన కొడుకుతోనూ సంబంధం పెట్టుకుని ఆ పని కానిస్తోందంటూ పోలీసులు లీకులివ్వడం వివాదాస్పదమైంది. కొద్ది గంటలుగా ఇంటర్నెట్ లో సంచలనంగా మారిన ఆ తల్లీకొడుకుల ఉదంతం మూలాల్లోకి వెళితే..
ఒకే దెబ్బకు రెండు పిట్టలు -పవన్ కల్యాణ్ వ్యూహరచన -17,18 తేదీల్లో జనసేన క్రియాశీలక సమావేశాలు

అసలేం జరిగిందంటే..
హవేరీ జిల్లా శిగ్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వనహళ్లి గ్రామానికి చెందిన 40 ఏళ్ల మహిళ గత శుక్రవారం నుంచి కనిపించకుండాపోయింది. 15 ఏళ్ల కిందట భర్త చనిపోవడంతో అదే ఊళ్లో వ్యవసాయ కూలీగా పనిచేస్తూ, ఒక్కగానొక్క కొడుకు(21 ఏళ్ల శివప్ప)ను చూసుకుంటోంది. బాధితురాలి చెల్లెలు కూడా అదే ఊళ్లో నివసిస్తోంది. ఇద్దరూ కలిసే పొలం పనులకు వెళ్లేవాళ్లు. గురువారం పని ముగించుకుని ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం పనికి బయలుదేరి అక్కకోసం వెళ్లగా.. ఆమె ముందే పొలానికి వెళ్లిపోయిందని పిన్నికి శివప్ప బదులిచ్చాడు. కానీ శుక్రవారం రాత్రి వరకు అక్క ఇల్లు చేరకపోయేసరికి అనుమానంతో ఆమె ఊరంతా గాలించింది. చివరికి గంగీభవి రోడ్డు పక్కనున్న జొన్న చేనులో.. దుస్తులు చిరిగిపోయి పడిఉన్న మహిళ మృతదేహం కనిపించింది. వెంటనే శిగ్గావ్ పోలీసులకు సమాచారం అందించారు..
2020 కంటే దరిద్రంగా 2021 -నోబెల్ విజేత WFP చీఫ్ హెచ్చరిక -దివాళా దిశగా 50 దేశాలు..

కొడుకుతో అక్రమ సంబధం అంటూ..
వనహళ్లి గ్రామంలో చోటుచేసుకున్న ఘటనపై ముందుగా మృతురాలి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అన అక్క మరణానికి ఆమె కొడుకు కూడా కారణమేమో అని ఆమె చెప్పడంతో పోలీసులు శివప్పను శనివారం అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తండ్రి చనిపోయిన తర్వాత నుంచి తల్లి చెడుతిరుగుళ్లకు అలవాటైందని, ఒక దశలో తనతో కూడా సంబంధం పెట్టుకుందని, మిగతా మగవాళ్లందరినీ వదిలేసి కొడుకుతోనే ఉంటానని చెప్పిందని, తీరా ఆమె ప్రవర్తన మారకపోవడంతో ఉక్రోషంతో తల్లిని చంపేసినట్లు శివప్ప అంగీకరించాడని పోలీసులు చెప్పిన కథనాన్ని ప్రముఖ మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి. కానీ మృతురాలి సోదరి మాత్రం ఈ వాదనను ఖండించింది. అసలు..

అది అబద్ధం.. గొడవలు మాత్రం నిజం..
‘‘భర్తను కోల్పోయి, ఒంటరిగా పోరాడుతోన్న మహిళను, ఆమె క్యారెక్టర్ ను ఉద్దేశించి చుట్టుపక్కలవాళ్లు, లోకం నిందలు మోపడం అందరికీ తెలిసిందే. నిజానికి మా అక్క.. భర్త పోయిన తర్వాత ఒక వ్యక్తితోనే కలిసుండేది. అయితే ఆ వ్యక్తికి, అక్క కొడుకు(శివప్ప)కు పడేది కాదు. కొన్నేళ్లుగా వాళ్లు నిత్యం గొడవలు పడుతున్నారు. శివప్ప బయటికి వెళ్లినప్పుడల్లా చుట్టుపక్కలవాళ్లు అతణ్ని ఏదో ఒక రకంగా అవమానించడం, ఆ కోపంతో వాడు ఇంటికొచ్చి తల్లితో దెబ్బలాడటం తరచూ జరిగేది. ఒక దశలో శివప్ప.. ఆ వ్యక్తిని కలవడం మానేయకుంటే చంపేస్తానని తల్లిని బెదిరించాడు. అందుకే పోలీసులు అడిగినప్పుడు శివప్పపైనా అనుమానం ఉందని చెప్పాను'' అని మృతురాలి సోదరి వివరించింది. ఈలోపు..

మద్యం తాగించి, చేలోకి లాక్కెళ్లి..
తల్లీకొడుకుల మధ్య సంబంధం ఉందనేది తాము చెప్పిన మాట కాదని, నిందితుడు శివప్ప చెప్పిన విషయమని పోలీసులు వివరణ ఇచ్చుకున్నారు. అసలా రోజు రాత్రి ఏం జరిగిందో మీడియాకు వివరించారు. ఒక వ్యక్తితో తల్లి కలిసిఉండటాన్ని జీర్ణించుకోలేకక శివప్ప తరచూ గొడవ పడేవాడని, గురువారం(12) రాత్రి పొలం నుంచి తిరిగొచ్చిన తర్వాత కూడా వాగ్వాదం జరిగిందని, బయట మాట్లాడుకుందామని చెప్పి, తల్లిని గంగీభవి రోడ్డుకు తీసుకెళ్లిన శివప్ప.. ఆమెకు బలవంతంగా మద్యం తాగించి, పక్కనున్న జొన్నచేలోకి ఈడ్చుకెళ్లి, అఘాయిత్యానికి పాల్పడటంతోపాటు గొంతునులిమి దారుణంగా చంపేశాడని, శవాన్ని అక్కడే వదిలేసి తాపీగా ఇంటికి వచ్చేశాడని పోలీసులు చెప్పారు. శుక్రవారం రాత్రి మృతదేహం బయటటపడిన తర్వాత కూడా తనకేమీ తెలీదని శివప్ప బుకాయించాడని, చివరికి కస్టడీలో నేరాన్ని అంగీకరించాడని తెలిపారు. తల్లిని రేప్ చేసి, చంపేసిన శివప్పపై ఐపీసీ 376, ఐపీసీ 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని శిగ్గావ్ పోలీసులు చెప్పారు.