• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

భార్య, బావమరిది, ఆంటీ ఇంటికి నిప్పు: కాఫీతోటలో..నిందితుడి డెడ్ బాడీ: ఈ మూడు రోజుల్లో

|

బెంగళూరు: కర్ణాటకలో సంచలనం రేపిన ఆరుమంది సజీవ దహనం కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన చోటు చేసుకున్న తరువాత అతను కనిపించకుండా పోయాడు. పోలీసులు గాలిస్తోండగానే.. అతని మృతదేహం లభించింది. నిందితుడు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. పోలీసులు వేర్వేరు కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు. ఆరుమంది సజీవదహనం కేసులో నిందితుడు కూడా మరణించడంతో పోలీసుల దర్యాప్తు అక్కడితే ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి.

బావమరిది ఇంట్లో ఉండటం ఇష్టం లేక..

బావమరిది ఇంట్లో ఉండటం ఇష్టం లేక..

మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తన భార్య తరఫు కుటుంబాన్ని మట్టుబెట్టిన ఘటన కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఈ నెల 1వ తేదీన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మడికెరి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నంపేట్‌లో నివసించే ఎరవార బోజ అనే 50 వ్యక్తి ఈ దురాగతానికి పాల్పడ్డాడు. నిందితుడు బోజ.. స్థానిక ఓ టీ ఎస్టేట్‌లో దినసరి వేతన కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిస. భార్యతో తరచూ అతను గొడవపడేవాడు. మద్యం సేవించి ఇంటికొచ్చిన ప్రతీసారీ ఆమెను చితకబాదేవాడు. భర్త పెట్టే చిత్రహింసను భరించలేక ఆమె కొంతకాలంగా అదే గ్రామంలో నివసించే సోదరుడు మంజు ఇంట్లో ఉంటోంది.

 ఇంట్లో నిద్రిస్తోన్న వారిపై పెట్రోల్ పోసి..

ఇంట్లో నిద్రిస్తోన్న వారిపై పెట్రోల్ పోసి..


తనను కాదని, భార్య బావమరిది ఇంట్లో ఉంటుండటాన్ని అవమానకరంగా భావించాడతను. మంజు ఇంటికెళ్లి తన భార్యను పంపించాల్సిందిగా పట్టుబట్టాడు. అతను దానికి అంగీకరించలేదు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. బావ, బావమరిది ఇద్దరు ఘర్షణ పడ్డారు. స్థానికులు వారిని నచ్చజెప్పడంతో శాంతించారు. తన ఆగ్రహాన్ని అణచుకోలేని బోజ అర్ధరాత్రి దాటిన తరువాత మంజు ఇంటికెళ్లాడు. పెంకులు తొలగించి, నిద్రిస్తోన్న వారిపై పెట్రోల్ చల్లాడు. నిప్పంటించి పరారయ్యాడు. ఆ సమయంలో ఇంట్లో మొత్తం 10 మంది ఉన్నారు.

మరొకరి మృతి..

మరొకరి మృతి..


బోజ భార్య బేబీ, అత్త సీత, ప్రార్థన అనే ఆరేళ్ల బాలిక సంఘటనా స్థలంలో మరణించారు. మంజు కుమారులు ప్రకాష్, విశ్వాస్, మరో బాలుడు మైసూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో నలుగురు చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో తోళ అనే నిందితుడి సమీప బంధువు భార్య భాగ్య మరణించింది. కాలిన గాయాలతో మైసూరు ఆసుపత్రిలో చేరిన ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ మంగళవారం చనిపోయింది.

కాఫీతోటలో డెడ్ బాడీ

కాఫీతోటలో డెడ్ బాడీ

ఈ ఘటన అనంతరం కనిపించకుండా పోయిన బోజ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అతని ఫోన్ కాల్‌లిస్ట్ ఆధారంగా కొడగు జిల్లాలో పలుచోట్ల వెదికారు. ఈ క్రమంలో బోజ మృతదేహం ఓ కాఫీతోటలో కనిపించింది. విరాజ్‌పేట్ తాలూకా పొన్నంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముగుటగెరిలోని కాఫీతోటలో బోజ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ మృతదేహం బోజదేనని పొన్నంపేట్ పోలీసులు నిర్ధారించారు. కాగా- అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా కేసు నమోదు చేశారు. అతను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.

English summary
The accused, who had burnt down a house killing six people, died by suicide. The body of the deceased was retrieved on Tuesday. The accused is said to have consumed poison on the same night of the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X