Bengaluru: విద్యార్థులకు హ్యాపీడేస్, స్కూల్స్ ప్రారంభం, ఓ పక్క కరోనా, మరో పక్క సంతోషం, ఆన్ లైన్ కు ఓకే !
బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో 9 నెలలుగా మూతపడిన స్కూల్స్ ప్రారంభం అయ్యాయి. కర్ణాటకలో జనవరి 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో ఇంతకాలం ఇళ్లకే పరిమితం అయిన విద్యార్థులు ఈ రోజు పాఠశాలకు వెళ్లి వచ్చారు. సాటి విద్యార్థుల ముఖాలు చూసి కొన్ని నెలల కావడంతో చాలా మంది ఉత్సహాంగా స్కూల్స్ కు వెళ్లారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో చాలా మంది కుటుంబ సభ్యులు ఇష్టం లేకపోయినా వారి పిల్లలను స్కూల్ కు పంపిస్తున్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థుల గురించి వారి తల్లిదండ్రులు ఆందోళన చెందనవసరం లేదని, అన్ని జాగ్రత్తలు తీసుకుని విద్యాసంస్థలు ప్రారంభిచామని కర్ణాటక ప్రభుత్వం, ఆ రాష్ట్ర విద్యాశాఖా మంత్రి సురేష్ కుమార్ అంటున్నారు. స్కూల్ కు పంపించడానికి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోతే ఆన్ లైన్ క్లాస్ లు చెప్పడానికి ఎలాంటి ఇబ్బంది లేదని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది.

అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం
కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రతిపాఠశాలలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని, పిల్లలకు ఆ వ్యాధి వ్యాపించుకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, విద్యార్థుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందనవసరం లేదని, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని కర్ణాటక విద్యశాఖా మంత్రి ఎస్, సురేష్ కుమార్ హామీ ఇచ్చారు.

ఆన్ లైన్ క్లాస్ లకు ఓకే
విద్యార్థుల కుటుంబ సభ్యులు వారి పిల్లల ఆరోగ్యంపై ఆందోళన ఉంటే వారికి ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహించడానికి విద్యాశాఖ, పాఠశాల యాజమాన్యం సిద్దంగా ఉందని మంత్రి సురేష్ కుమార్ స్పష్టం చేశారు. ఇప్పటికే పాఠశాలకు రావడానికి ఆసక్తి చూపించని విద్యార్థులకు ఆన్ లైన్ క్లాస్ లు చెప్పాలని విద్యాసంస్థల యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేశామని మంత్రి సురేష్ కుమార్ వివరించారు.

ఆరోగ్యం, భౌతికదూరం పాటించాలి
కర్ణాటకలో జనవరి 1వ తేదీ శుక్రవారం నుంచి పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. ప్రతిపాఠశాలలో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని, ప్రతి తరగతిలో కచ్చితంగా విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సూచించామని కర్ణాటక విద్యాశాఖా మంత్రి ఎస్. సురేష్ కుమార్ మీడియాకు చెప్పారు.

రంగంలోకి ప్రత్యేక టీమ్ లు
జనవరి 1వ తేదీ నుంచి కర్ణాటక మొత్తం పాఠశాలు ప్రారంభం కావడంతో విద్యాశాఖ అధికారులు అనేక చర్యలు తీసుకున్నారని మంత్రి సురేష్ కుమార్ అన్నారు. బెంగళూరు నగరం, బెంగళూరు గ్రామీణ జిల్లాతో పాటు రాష్ట్రంలోని ప్రతిజిల్లాలో ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసి ప్రతి పాఠశాలను పరిశీలించి అక్కడ విద్యార్థుల ఆరోగ్యంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ?, ఎలాంటి నియమాలు పాటిస్తున్నారు అని ప్రత్యేకంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందించడానికి సిద్దం అవుతున్నారని కర్ణాటక విద్యశాఖా మంత్రి ఎస్. సురేస్ కుమార్ అన్నారు. ముఖ్యంగా 10వ తరగతి, 12వ తరగతి (PUC) విద్యార్థులపై విద్యాశాఖ, కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపిస్తోంది.