Khiladi lady: పండుగ రోజు భర్తకు పాడెకట్టింది, రంగురంగుల చీర కట్టుకుని ప్రియుడితో, మ్యాటర్!
బెంగళూరు/ బెళగావి: జాతీయ రహదారి సమీపంలోని సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజ్ లో ఓ వ్యక్తి శవం చూసిన స్థానికులు హడలిపోయారు. డ్రైనేజ్ లో చిక్కిన శవం ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిది కాదని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పండుగపూట శవం కనపడటంతో స్థానికులు హడలిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు వేలిముద్రల నిపుణులు, డాగ్ స్క్వాడ్ సహాయంతో హత్యకు గురైన వ్యక్తి ఆచూకి తెలుసుకున్నారు.
హత్యకు గురైన వ్యక్తి ఇంటి దగ్గరకు వెళ్లిన పోలీసులు హడలిపోయారు. భర్త కనపడకపోయినా ఎలాంటి ఫీలింగ్ లేకుండా అతని భార్య రంగరంగుల చీరకట్టుకుని సంతోషంగా తిరుగుతున్న విషయం గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా కిలాడీ లేడీ అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.
Illegal affair: తండ్రి దినాల రోజు తల్లి లవ్ స్టోరీ చెప్పిన కొడుకు, ఆ రోజు రాత్రి మమ్మీ, అంకుల్!

సంతోషంగా కాపురం చేస్తున్న భర్త
కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని బైలహోంగల తాలుకాలోని మరకట్టి గ్రామంలో రమేష్ నాగప్ప అలియాస్ రమేష్ (36) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం పెద్దలు సెట్ చేసిన శ్రీదేవి (32) అనే యువతిని రమేష్ వివాహం చేసుకున్నాడు. భార్య శ్రీదేవితో కలిసి రమేష్ మూడు సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశాడు.

టక్కులాడి శ్రీదేవికి అక్రమ సంబంధం
వ్యాపారం చేస్తున్న రమేష్ ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. వ్యాపారం పనిమీద బయటకు వెలుతున్న భర్త రమేష్ కు తెలీకుండా పక్క ఊర్లో నివాసం ఉంటున్న బసవరాజ్ యల్లప్ప అలియాస్ బసవరాజ్ అనే వ్యక్తితో శ్రీదేవి పరిచయం పెంచుకుంది. భర్త రమేష్ బయటకు వెళ్లిన తరువాత శ్రీదేవి పక్కఊర్లో నివాసం ఉంటున్న బసవరాజ్ తో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది.

ఎవ్వరికీ తెలీదు అనుకున్న భార్య.... కాని?
చాలాకాలం శ్రీదేవి ఆమె ప్రియుడు బసవరాజ్ తో కలిసి సంతోషంగా చెట్లు, పుట్టలు తిరుగుతూ ఎంజాయ్ చేసింది. మన విషయం ఎవ్వరికీ తెలీదని శ్రీదేవి, ఆమె ప్రియుడు బసవరాజ్ అనుకున్నారు. కాని స్థానికులకు శ్రీదేవి, బసవరాజ్ అక్రమ సంబంధం విషయం తెలిసిపోయింది. ఈ విషయం కాస్తా శ్రీదేవి భర్త రమేష్ కు చెప్పడంతో అక్కడ బెడిసికొట్టింది.

భార్యకు వార్నింగ్ ఇచ్చిన భర్త
తన భార్య శ్రీదేవి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఆమె భర్త రమేష్ రగిలిపోయాడు. నువ్వు పద్దతి మార్చుకోవాలని, లేదంటే మీ పుట్టింటి దగ్గర పంచాయితీ పెట్టి నీ పరువు రోడ్డున పడేలా చేస్తానని రమేష్ అతని భార్య శ్రీదేవికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. భర్త హెచ్చరించినా శ్రీదేవి మాత్రం ఆమె ప్రియుడు బసవరాజ్ ను వదిలి ఉండలేకపోయింది.

ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య
శనివారం సంక్రాంతి పండుగ సందర్బంగా రమేష్ బయటకు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉన్నాడు. ఆ సమయంలో శ్రీదేవి ఆమె ప్రియుడు బసవరాజ్ ను ఇంటికి పిలిపించుకుని ముందుగా వేసుకున్న స్కెచ్ ప్రకారం ఆమె భర్త రమేష్ చంపేసింది. భర్త రమేష్ శవాన్ని మాయం చెయ్యాలని స్కెచ్ వేశారు. రాత్రి బెళగావి-ధారవాడ జాతీయ రహదారి 4లోని తిమ్మాపుర సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజ్ లో రమేష్ శవాన్ని విసిరేసిన శ్రీదేవి, బసవరాజ్ అక్కడి నుంచి పారిపోయి ఎవరిపాటికి వాళ్లు ఉండిపోయారు.

పండుగ రోజు శవం చూసి షాక్
ఆదివారం స్థానికులు డ్రైనేజ్ లో శవం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హత్యకు గురైన రమేష్ ఇంటి దగ్గరకు వెళ్లి అక్కడ సీన్ చూసి హడలిపోయారు. భర్త రమేష్ కనపడకపోయినా ఎలాంటి ఫీలింగ్ లేకుండా అతని భార్య శ్రీదేవి రంగరంగుల చీరకట్టుకుని సంతోషంగా తిరుగుతున్న విషయం గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. పోలీసుల విచారణలో కిలాడీ లేడీ శ్రీదేవి, బసవరాజ్ ల అక్రమ సంబంధం మ్యాటర్ బయటకు వచ్చింది. భర్తను చంపేసిన శ్రీదేవి, ఆమె ప్రియుడు బసవరాజ్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని కిత్తూరు పోలీసులు తెలిపారు.