• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

khiladi officer: ఒక్క ఉద్యోగం, రూ. 250 కోట్ల ఆస్తులు, స్వప్న ఆంటీ వేస్ట్, సుధా మేడమ్ చూస్తేనే!

|

బెంగళూరు/ మైసూరు/ ఉడిపి: ఆమె ప్రభుత్వ ఉద్యోగి, కేఏఎస్ అధికారి హోదాలో ఉంటూ వందల కోట్ల రూపాయల విలువైన అక్రమ ఆస్తులు సంపాధించారు. మేడమ్ ఆకారం చూసి భయంతో కొందరు, అధికార భయంతో కొందరు ఎక్కడ మాపని జరగదో అంటూ షార్వా కార్చుకుని ఆమె అడిగినంత లంచాలు ఇచ్చేసి వాళ్లపని వాళ్లు చేసుకుని వెళ్లిపోయారు. బంగారం, ఖరీదైన కార్లు, బంగారం, బంగ్లాలు, కోట్ల విలువైన ఇంటి స్థలాలను లంచం రూపంలో తీసుకున్న మేడమ్ బండారం బయటపడింది. ఆర్ టీఐ కార్యకర్తకు ఎక్కడో మండిపోవడంతో మేడమ్ గుట్టురట్టు మొత్తం బయటకు వచ్చింది. రూ. 250 కోట్లకు పైగా అక్రమాస్తులు సంసాధించిన మేడమ్ డాక్టర్ సుధా స్కెచ్ లు తెలుసుకున్న ఏసీబీ అధికారులే షాక్ కు గురైనారు.

Home Stay: మైసూరు ఆంటీలు, మండ్య బజ్జీలు, రేట్లు డేట్లు ఫిక్స్, లాక్ డౌన్ నష్టాలు, హైటెక్ స్కెచ్ !

 ఐటీ శాఖలో అధికారి అంటే మాటలా ?

ఐటీ శాఖలో అధికారి అంటే మాటలా ?

ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ ఐటీ హబ్ గా బెంగళూరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కర్ణాటక ఐటీ, బీటీ శాఖలో డాక్టర్ సుధా సీనియర్ అధికారి. కేఏఎస్ అధికారి అయిన డాక్టర్ సుధా ప్రస్తుతం బెంగళూరులోని శాంతినగరలోని ఐటీ, బీటీ శాఖ ప్రధాన కార్యాలయంలో పరిపాలనా విభాగం సీనియర్ అధికారిగా కొన్ని నెలల నుంచి ఉద్యోగం చేస్తున్నారు. ఐటీ శాఖలో అలాంటి పదవిలో ఉండటం నిజంగా డాక్టర్ సుధా మేడమ్ నక్కతోక తొక్కినట్లు అయ్యింది.

బీడీఏలో రఫ్ ఆడించిన డాక్టర్ సుధా

బీడీఏలో రఫ్ ఆడించిన డాక్టర్ సుధా

2013 నుంచి కొన్ని నెలల క్రితం వరకు డాక్టర్ సుధా బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్ సమీపంలోని బీడీఏ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగం చేశారు. ఆ సమయంలో భూ లావాదేవీలు నిర్వహించడానికి బీడీఏ కార్యాలయానికి వచ్చి వెలుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యవసాయ భూములను కమర్షియల్ భూములుగా మార్చుకోవడానికి వచ్చి వెళ్లిన రైతులు, భూ యజమానుల నుంచి డాక్టర్ సుధా కొన్ని కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నారని వెలుగు చూసింది.

 ఇంటి స్థలాలు, ఫ్లాట్ లు, బంగారం, ఖరీదైన కార్లు

ఇంటి స్థలాలు, ఫ్లాట్ లు, బంగారం, ఖరీదైన కార్లు

బీడీఏలో కేఏఎస్ అధికారిగా ఉన్న డాక్టర్ సుధా ఆమె అధికారం అడ్డం పెట్టుకుని ఎవరైనా వాళ్ల పని చేయించుకోవడానికి వస్తే వారి దగ్గర నగదుతో పాటు భారీ మొత్తంలో బంగారం, ఇంటి స్థలాలు, భూములు, అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లు, ఖరీదైన కార్లు ఇలా ఏదో ఒక రూపంలో లంచాలు తీసుకుని కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు సంపాధించారని ఏసీబీ అధికారుల విచారణలో వెలుగు చూసింది.

అసలే అబ్రహాం..... ఇక అంతే కథ

అసలే అబ్రహాం..... ఇక అంతే కథ

కర్ణాటకలో ఆర్ టీఐ కార్యకర్త టీజే. అబ్రహాం అంటే అవినీతి అధికారులకు పెద్దగా పరిచయం చెయ్యనవసరం లేదు. ఐఏఎస్ అధికారిని డాక్టర్ సుధా అక్రమ ఆస్తులు సంపాధిస్తున్నారని, ఆమె కథ ఏమో చూడండి అయ్యా అంటూ ఆర్ టీఐ కార్యకర్త అబ్రహాం జూన్ 18వ తేదీ లోకాయుక్త ప్రత్యేక కోర్టులో కేసు పెట్టారు. ఇప్పటికే ఒకసారి డాక్టర్ సుధా అక్రమాస్తుల వ్యవహారంలో ఏసీబీ దాడులు జరిగాయి. డాక్టర్ సుధా వ్యవహారం ఏమిటో చూడండి అంటూ లోకాయుక్త ఏసీబీ అధికారులకు సూచించింది.

మేడమ్ ఇంట్లో క్యాష్ రూ. 36 లక్షలు

మేడమ్ ఇంట్లో క్యాష్ రూ. 36 లక్షలు

ఆగస్టు 27వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ అధికారులు విచారణ చెయ్యగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని కొడిగేహళ్లిలోని డాక్టర్ సుధా ఇల్లు, శాంతినగరలోని ఆమె కార్యాలయం, మైసూరులోని శ్రీరాంపురలోని ఆమె భర్త ఇల్లు, ఉడిపిలోని తంక మిజారి ప్రాంతంలో సుధా బంధువుల ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. బెంగళూరులోని సుధా ఇంటిలోనే రూ. 36 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

జస్ట్ రూ. 250 కోట్లు ఆస్తులు అంతే !

జస్ట్ రూ. 250 కోట్లు ఆస్తులు అంతే !

సుధా ఇంటిలో 3.5 కేజీల బంగారం, 7 కేజీల వెండి, రూ. 36 లక్షల నగదు సీజ్ చేశారు. వీటితో పాటు విలాసవంతమైన కార్లుతో పాటు మొత్తం రూ. 250 కోట్ల రూపాయలకు పైగా అక్రమ ఆస్తులు సంపాధించారని ఏసీబీ అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూడటంతో ఆ పత్రాలను అధికారులు సీజ్ చేశారు. మొత్తం మీద అబ్రహాం దెబ్బతో డాక్టర్ సుధా అక్రమాస్తుల చిట్టా ఒక్కొక్కటి బయటకు వస్తుండటంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టు అయిన స్వప్న సురేష్ అక్రమాస్తుల కంటే డాక్టర్ సుధా అక్రమ ఆస్తులు చాలా ఎక్కువగా ఉన్నాయని వెలుగు చూసింది.

English summary
ACB officials seized 3.5 kg gold, 7 kg silver, Rs.36 lakh cash and property papers worth Rs.250 crore from KAS officer Dr. B. Sudha house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X