• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Kidnap: మాజీ మంత్రి కిడ్నాప్ కేసులో ట్విస్ట్, ఆరు మంది అరెస్టు, కింగ్ పిన్ తమిళ తంబి, అసలు ఏం జరిగిందంటే ?

|

బెంగళూరు/ హోసూరు: మాజీ మంత్రి కిడ్నాప్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మాజీ మంత్రినే కిడ్నాప్ చెయ్యడంతో పోలీసు శాఖ అధికారులు సీరియస్ అయ్యారు. మాజీ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, ఓ వర్గంలో బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కర్ణాటక మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ కిడ్నాప్ కేసు ఆ రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ కేసును సీనియస్ గా తీసుకున్న పోలీసులు మొదట ఇద్దరిని, ఇప్పుడు బెంగళూరులో మరో నలుగురిని అరెస్టు చేశారు. తమిళనాడులోని హోసూరు (కర్ణాటక- తమిళనాడు సరిహద్దులోని) హోసూరు నివాసి మాజీ మంత్రి కిడ్నాప్ కేసులో కింగ్ పిన్ అని పోలీసు అధికారులు గుర్తించారు.

Illegal affair: భర్తను ఇలా కూడా చంపుతారా, ఈ స్కెచ్ యూట్యూబ్ లో కూడా లేదేమో ?, జస్ట్ రాగి ముద్ద!Illegal affair: భర్తను ఇలా కూడా చంపుతారా, ఈ స్కెచ్ యూట్యూబ్ లో కూడా లేదేమో ?, జస్ట్ రాగి ముద్ద!

పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్

పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్


ఆంధ్రప్రదేశ్- కర్ణాటక సరిహద్దులోని కోలారు శాసన సభ నియోజక వర్గం (కర్ణాటక) నుంచి ఆర్. వర్తూరు ప్రకాష్ రెండు సార్లు స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. కర్ణాటకలో స్వతంత్ర పార్టీ అభ్యర్థులకు డిమాండ్ పెరగడంతో వర్తూరు ప్రకాష్ కు ఊహించని విధంగా మంత్రి పదవి దక్కింది. నక్కతోక తొక్కినట్లు వర్తూరు ప్రకాష్ మంత్రిగా కర్ణాటక రాజకీయాల్లో చక్రం తిప్పారు.

సొంత ఫామ్ హౌస్ కు వెళిన మాజీ మంత్రి మాయం

సొంత ఫామ్ హౌస్ కు వెళిన మాజీ మంత్రి మాయం

కోలారు సమీపంలోని బెగ్లిహోసహళ్ళి ప్రాంతంలో మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ కు సొంత ఫామ్ హౌస్ ఉంది. నవంబర్ 25వ తేదీన వర్తూరు ప్రకాష్ కోలారు సమీపంలోని ఫామ్ హౌస్ కు వెళ్లారు. అదే రోజు రాత్రి 7 గంటల సమయంలో కారు డ్రైవర్ సునీల్ తో పాటు వర్తూరు ప్రకాష్ ఆయన కారులో బెంగళూరుకు బయలుదేరారు. ఫామ్ హౌస్ నుంచి ఒక్క కిలోమీటరు దూరం వెళ్లిన మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ కు బ్యాడ్ టైమ్ ఎదురైయ్యింది.

 సినిమాలు చూశారు అనుకుంటా

సినిమాలు చూశారు అనుకుంటా

రెండు కార్లలో 8 మంది దుండగులు ముఖాలకు మాస్కులు వేసుకుని వెళ్లి మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ కారును అడ్డగించారు. తరువాత ఇనుప రాడ్లు, కత్తులతో బెదిరించిన కిడ్నాపర్లు మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్, ఆయన కారు డ్రైవర్ సునీల్ ను అదే కారులోని మద్య సీట్లు కుర్చోబెట్టారు. మాజీ మంత్రి ప్రకాష్, ఆయన కారు డ్రైవర్ సునీల్ కళ్లకు గంతలు కట్టి కారులో తిప్పుతూ గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు.

 డీల్ కుదరలేదు... కానీ ?

డీల్ కుదరలేదు... కానీ ?

మాకు రూ. 30 కోట్లు ఇవ్వకుంటే నిన్ను చంపేస్తామని కిడ్నాపర్లు మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ ను బెదిరించారు. డబ్బులు ఇవ్వడానికి మాజీ మంత్రి నిరాకరించడంతో మూడు రోజుల పాటు ఆయన్ను ఇనుప రాడ్లతో దాడి చేసి చిత్రహింసలు పెట్టారు. మాజీ మంత్రి కారు డ్రైవర్ సునీల్ ను సైతం కిడ్నాపర్లు చితకబాదేశారు. అనంతరం డబ్బులు ఇవ్వడానికి మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ అంగీకరించాడు.

కేసు పెడితే నువ్వు లేవు అంతే

కేసు పెడితే నువ్వు లేవు అంతే

మూడు రోజులు మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ ను చిత్రహింసలకు గురి చేసిన కిడ్నాపర్లు పోలీసులకు చిక్కిపోతామనే భయంతో చివరి ఆయన్ను హోస్ కోటే సమీపంలోని శివనాపుర గ్రామం సమీపంలో అర్దరాత్రి వదిలేసి ఆయన కారు ఎత్తుకుని వెళ్లిపోయారు. స్థానికుల సహాయంతో బెంగళూరులోని కేఆర్ పురం చేరుకున్న మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ అక్కడి సత్యసాయి ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని తరువాత ఇంటికి వెళ్లారు.

 రూ. 48 లక్షలు స్వాహా

రూ. 48 లక్షలు స్వాహా

డిసెంబర్ 1వ తేదీ రాత్రి బెంగళూరులోని బెళ్లందూరులోని స్మశానవాటికలో మాజీ మంత్రి వర్తూరు ప్రకాస్ పార్చనూర్ కారు గుర్తించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ బెళ్లందరూరు చేరుకుని అక్కడి పోలీసులకు తానను కిడ్నాప్ చేశారని కేసు పెట్టారు. మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ అనుచరుడు నయాజ్ అనే వ్యక్తి కోలారు సమీపంలోని కాఫీ డే దగ్గర కిడ్నాపర్లకు రూ. 48 లక్షలు ఇచ్చాడని, రెండు రోజుల తరువాత తనను వదిలేశారని మాజీ మంత్రి పోలీసులకు చెప్పారు. అయితే కిడ్నాపర్లకు మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ రూ. 1. 50 కోట్లు ఇచ్చారని సమాచారం.

 కేసులో రసవత్తరమై ట్విస్ట్

కేసులో రసవత్తరమై ట్విస్ట్

కర్ణాటక మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ ను ఆయన రెండో భార్య కొడుకు కిడ్నాప్ చేయించి ఉంటాడని ఆరోపణలు వచ్చాయి. కర్ణాటక ఐజీపీ సీమంత్ కుమార్ సింగ్ సైతం కోలారు వెళ్లి కిడ్నాప్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. మొదట ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ కిడ్నాప్ కేసులో శనివారం మరో నలుగురిని అరెస్టు చేశారు. మాజీ మంత్రి కిడ్నాప్ కింగ్ పిన్ తమిళనాడులోని హోసూరు నివాసి అని తెలుసుకున్న పోలీసు అధికారులు అతని కోసం గాలిస్తున్నారు. కేసు విచారణలో ఉన్నందున అరెస్టు అయిన ఆరు మంది పేర్లు పోలీసులు బయటకు రాకుండా జాగ్రతపడ్డారని తెలిసింది.

English summary
Kidnap: Karnataka Former Minister Varthur Prakash Kidnap Case, Police Arrested 4 in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X